తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనపై నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే' అని మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనపై నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే' అని మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతరులపై నెపం నెట్టడం చంద్రబాబుకు అలవాటు అని మండిపడ్డారు. సోమవారం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. కాపులకు వెంటనే రిజర్వేషన్ ప్రకటించి వారి ఆగ్రహం చల్లార్చాలని డిమాండ్ చేశారు. కాపు మంత్రులు సీఎం చంద్రబాబు భజన చేయడం మానేయండంటూ హర్షకుమార్ విమర్శించారు.
కాగా, కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యమరూపం దాల్చిన సంగతి తెలిసిందే.