'తుని ఘటనపై ప్రజలను వేధించొద్దు' | G V Harsha kumar responding on tuni incident issue | Sakshi
Sakshi News home page

'తుని ఘటనపై ప్రజలను వేధించొద్దు'

Published Wed, Jun 8 2016 2:01 PM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

G V Harsha kumar responding on tuni incident issue

రాజమండ్రి: తుని ఘటనపై ప్రజలను వేధించ వద్దని టీడీపీ ప్రభుత్వానికి అమలాపురం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ సూచించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జి.వి.హర్షకుమార్ మాట్లాడుతూ... అధికారం మారితే కేసులు మాఫీ అయిపోతాయన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడ వద్దని టీడీపీ నేతలకు హర్షకుమార్ హితవు పలికారు. మంత్రి నారాయణ జాతిని ఉద్దరించినట్లు మాట్లాడటం సరికాదని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు తగవని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement