'కల్లబొల్లి మాటలతో జనాన్ని మభ్యపెట్టవద్దు'
రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై అమలాపురం మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిప్పులు చెరిగారు. కాపు సామాజిక వర్గానికి ఎలా రిజర్వేషన్ కల్పిస్తారో స్పష్టం చేయాలని చంద్రబాబునాయుడును హర్షకుమార్ డిమాండ్ చేశారు.
కల్లబొల్లి మాటలతో జనాన్ని మభ్యపెట్టవద్దంటూ చంద్రబాబుకు హర్షకుమార్ హితవు పలికారు. అలాగే ఎస్సీ, బీసీలు, కాపులకు ప్రకటించిన నిధుల్లో ఎంత మేర ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబుకు సూచించారు. తెలంగాణలో ఇచ్చినట్లూ ఆంధ్రా మార్కెటింగ్ కమిటీలో బీసీలు, ఎస్సీలకు స్థానం కల్పించేలా పోరాడాలని బీసీ సంఘం నాయకుడు, టీడీపీ నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు విజ్ఞప్తి చేశారు.