g v harsha kumar
-
'తుని ఘటనపై ప్రజలను వేధించొద్దు'
రాజమండ్రి: తుని ఘటనపై ప్రజలను వేధించ వద్దని టీడీపీ ప్రభుత్వానికి అమలాపురం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ సూచించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జి.వి.హర్షకుమార్ మాట్లాడుతూ... అధికారం మారితే కేసులు మాఫీ అయిపోతాయన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడ వద్దని టీడీపీ నేతలకు హర్షకుమార్ హితవు పలికారు. మంత్రి నారాయణ జాతిని ఉద్దరించినట్లు మాట్లాడటం సరికాదని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు తగవని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. -
'కల్లబొల్లి మాటలతో జనాన్ని మభ్యపెట్టవద్దు'
రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై అమలాపురం మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిప్పులు చెరిగారు. కాపు సామాజిక వర్గానికి ఎలా రిజర్వేషన్ కల్పిస్తారో స్పష్టం చేయాలని చంద్రబాబునాయుడును హర్షకుమార్ డిమాండ్ చేశారు. కల్లబొల్లి మాటలతో జనాన్ని మభ్యపెట్టవద్దంటూ చంద్రబాబుకు హర్షకుమార్ హితవు పలికారు. అలాగే ఎస్సీ, బీసీలు, కాపులకు ప్రకటించిన నిధుల్లో ఎంత మేర ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబుకు సూచించారు. తెలంగాణలో ఇచ్చినట్లూ ఆంధ్రా మార్కెటింగ్ కమిటీలో బీసీలు, ఎస్సీలకు స్థానం కల్పించేలా పోరాడాలని బీసీ సంఘం నాయకుడు, టీడీపీ నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు విజ్ఞప్తి చేశారు. -
హర్షకుమార్కు హైకోర్టు బెయిల్ మంజూరు
హైదరాబాద్ : అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్కు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రిలో క్రైస్తవుల కోసం శ్మశానం ఏర్పాటు చేయాలని కోరుతూ జీవీ హర్షకుమార్ జూలై 10వ తేదీన స్థానిక జాంపేట సెయింట్ పాల్ చర్చి గ్రౌండ్లోఆమరణ నిరాహారదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాల సమయంలో నగరంలో దీక్షతో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన పోలీసు అధికారులు శనివారం రాత్రి (11-07-2015) ఆయనను బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి అనారోగ్యంతో ఉన్న హర్షకుమార్ను ఆసుపత్రికి తరలించారు. ఆ రాత్రంతా హర్షకుమార్ ఆస్పత్రిలో కూడా నిరాహార దీక్ష కొనసాగించారు. అక్కడితో ఆగని ఆయన ఆదివారం ఉదయం రోడ్డు మీదే పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో హర్షకుమార్ను పోలీసులు ఆదివారం సాయంత్రం జడ్జి నివాసానికి తీసుకువెళ్లి ఆయన ముందు నిలబెట్టారు. దీంతో హర్షకుమార్కు 14 రోజుల రిమాండ్ విధించారు. హర్షకుమార్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో హైకోర్టు హర్షకుమార్కు బెయిల్ మంజూరు చేసింది. -
మా రాజీనామాలతో ప్రభుత్వం పడిపోదు: హర్షకుమార్
తమ రాజీనామాల వల్ల ప్రభుత్వం పడిపోదని అమలాపురం పార్లమెంట్ సభ్యుడు జి.వి.హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. రాజీనామాల విషయమై పార్లమెంట్ హాల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ముందుగా రాజీనామాలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమకు సూచించారని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే అందరం కలసి రాజీనామాలు చేద్దామని సీఎం కిరణ్ తమతో పేర్కొన్న విషయాన్ని హర్షకుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.