తమ రాజీనామాల వల్ల ప్రభుత్వం పడిపోదని అమలాపురం పార్లమెంట్ సభ్యుడు జి.వి.హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. రాజీనామాల విషయమై పార్లమెంట్ హాల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ముందుగా రాజీనామాలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమకు సూచించారని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే అందరం కలసి రాజీనామాలు చేద్దామని సీఎం కిరణ్ తమతో పేర్కొన్న విషయాన్ని హర్షకుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.