ఏపీ ప్రభుత్వానికి ముద్రగడ అల్టిమేటం
తుని: కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన రాస్తారొకో ఆదివారం ముగిసింది. రిజర్వేషన్లపై ప్రకటనకుగాను ఏపీ ప్రభుత్వానికి ఆదివారం రాత్రి ముద్రగడ అల్టిమేటం జారీచేశారు. రేపు సాయంత్రం లోగా ఒక ప్రకటన రావాలని ఆయన డిమాండ్ చేశారు. దీని తర్వాత కీలక కార్యాచరణకు ముద్రగడ సన్నితులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
కాగా, ఆదివారం మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. సభ వేదికపై నుంచి దిగిన ముద్రగడ పద్మనాభం సమీపంలోని రైలుపట్టాలపై బైఠాయించారు. అనంతరం పక్కన ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు.