reservations declaration
-
ఆప్షన్లకు గడువిస్తాం.. స్థానికతపై చెప్పలేం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ మరింత వివాదాస్ప దమవుతోంది. ఈ వ్యవహారంపై అన్ని జిల్లాల్లోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం జరిపిన సమాలోచనలు కూడా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. క్షేత్రస్థాయిలో వస్తున్న వ్యతిరేకతను మంత్రి దృష్టికి తెచ్చేందుకు సంఘాల నేతలు ప్రయత్నించారు. విభజన పద్ధతులు లోపభూయిష్టంగా ఉన్నాయని అన్ని సంఘాలు అభిప్రాయపడ్డాయి. హడావుడిగా ఆప్షన్లు ఇవ్వమనడం సరికాదంటూ, స్థానికతకు ప్రాధాన్యత లేకుండా, సీనియారిటీకే పెద్దపీట వేయడాన్ని సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. యూటీఎఫ్, పీఆర్టీయూ, ఎస్టీయూ సహా 12 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మంత్రి సబిత విడివిడిగా సంప్రదింపులు జరిపారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సంఘాలు ఇచ్చిన లిఖిత పూర్వక అభ్యంతరాలను మంత్రి పరిశీలించారు. జూనియర్లకు అన్యాయం స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ పోస్టులు జిల్లా క్యాడర్‌గా ఉండటం వల్ల ఉపాధ్యాయులకు స్థాన చలనం తప్పడం లేదని, స్థానికతకు ప్రాధాన్యం లేకపోవడం వల్ల స్థిర నివాసం ఏర్పరచుకున్న జూనియర్లకు అన్యాయం జరుగుతుందని యూటీఎఫ్ ప్రతినిధులు కె.జంగయ్య, చావా రవి మంత్రికి తెలిపారు. కొత్త జిల్లాల్లో 80 శాతం పోస్టులు స్థానికులకే ఇవ్వాలన్నారు. మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీలను దామాషా పద్ధతిలో కేటాయించాలని సూచించారు. వితంతువులు, మహిళలను ప్రత్యేక కేటగిరీలో చేర్చాలన్నారు. ఒక్కరోజులో ఆప్షన్ల ముగింపా? కేవలం ఒక్క రోజులోనే అప్షన్లు ముగించడం అన్యా యమని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి పర్వత రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. స్థానికతను వదిలేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. క్యాడర్ విభజన ఉత్తర్వులే అమలు కాకపోతే కొత్త జిల్లాలకు ఉపా ధ్యాయుల కేటాయింపు ఎలా చేస్తారని ప్రశ్నిం చారు. విభజనకు ముందే వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలకు న్యాయం చేయాలన్నారు. ఉత్తర్వులు సవరించండి టీచర్ల కేటాయింపు ఉత్తర్వులను సవరించాలని పీఆర్టీయూ అధ్యక్షుడు పింగిలి సిరిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు కోరారు. సీనియర్ల ఐచ్ఛికాన్ని పరిశీలిస్తూనే, జూనియర్లకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ప్రధాన డిమాండ్‌కు లభించని పరిష్కారం విద్యాశాఖ హడావుడిగా ఆప్షన్ల తంతు ముగించిందన్న విమర్శలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు భేటీ అనంతరం సంఘం నేతలు తెలిపారు. ఆప్షన్ల ఎంపికకు మరికొంత గడువు ఇస్తామని భరోసా ఇచ్చినట్టు చెప్పారు. అయితే స్థానికతపై మాత్రం నిర్ణయాన్ని వెల్లడించలేదన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే విధమైన మార్గదర్శకాలు ఇవ్వడం వల్ల, దీనిపై నిర్ణయం తన చేతుల్లో ఉండదనే అభిప్రాయం మంత్రి వ్యక్తం చేసినట్లు చెప్పారు. స్థానికతను పరిగణలోనికి తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్‌కు చర్చల్లో ఎలాంటి పరిష్కారం లభించలేదని ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆందోళన ఉధృతం ఉద్యోగుల విభజన అంశంపై ఉపాధ్యాయ వర్గాలో ఆందోళన పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద పలు సంఘాల నేతలు, జూనియర్ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. పలుచోట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలను టీచర్లు నిలదీస్తున్నారు. సంఘాల నేతలు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉండటం వల్లే సీనియారిటీ అంశాన్ని సమర్థిస్తున్నారని జూనియర్ ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులకు అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలతో లేఖలు వస్తున్నాయి. ఆప్షన్ల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని టీచర్లు ఆరోపిస్తున్నారు. కొందరు నకిలీ సర్టిఫికెట్లతో తప్పుదారి పట్టిస్తున్నారని వరంగల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు కార్తికేయ తెలిపారు. -
Telangana : మద్యం దుకాణాలకు ‘రోస్టర్ పాయింట్లు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను రోస్టర్ పాయింట్ల పద్ధతిలో అమలు జరపాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను రూపొందించింది. ఎక్సైజ్ శాఖ రూపొందించిన నిబంధనల ప్రకారం 2021–23 సంవత్సరాలకు గాను రాష్ట్రంలోని వైన్ (ఏ4) షాపుల్లో 30 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఇందులో గౌడ్లకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు. ఈ రిజర్వేషన్లను అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు ముందుగా డ్రాలు తీయాల్సి ఉంటుంది. జిల్లా ఎక్సైజ్ అధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో కూడిన కమిటీ ముందు వీడియో చిత్రీకరణ చేస్తూ ఈ డ్రాలు తీయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఆ డ్రాలలో వచ్చిన షాపులను ఈ మూడు వర్గాలకు కోటా మేరకు కేటాయిస్తారు. కోటా పూర్తయిన తర్వాత మిగిలిన షాపులను ఓపెన్ కేటగిరిలో అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచుతారు. ఎక్సైజ్ శాఖ రూపొందించిన నిబంధనల ప్రకారం.. ముందుగా జిల్లాలో ఉన్న షాపులన్నింటికీ నంబర్లు కేటాయించి టోకెన్ల రూపంలో ఒక ఖాళీ డబ్బాలో పోయాలి. ఆ డబ్బా నుంచి ఒక్కో టోకెన్ బయటకు తీయాలి. మొదటి టోకెన్ షాపును ఎస్టీలకు, ఆ తర్వాత వచ్చే టోకెన్‌ను ఎస్సీలకు, ఆ తర్వాతి దాన్ని గౌడ సామాజిక వర్గాలకు కేటాయించాలి. ఈ కోటా పూర్తయిన తర్వాత డబ్బాలో మిగిలిన టోకెన్ నంబర్లున్న షాపులను ఓపెన్ కేటగిరీ డ్రాల కోసం నోటిఫై చేస్తారు. షెడ్యూల్డ్ ఏరియాలో అన్నీ ఎస్టీలకే.. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిధిలోనికి వచ్చే షాపులన్నింటినీ గిరిజనులకే కేటాయించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ షాపులన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేయనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లోని షాపులను సాధారణ డ్రా నుంచి మినహాయించనున్నారు. ఈ షాపులకు ఎస్టీలకు ఇస్తున్నందున మైదాన ప్రాంతాల్లోని షాపుల్లో ఎస్టీలకు పరిమిత సంఖ్యలో మాత్రమే కేటాయించనున్నారు. -
తెలంగాణలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
-
తెలంగాణలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్ర పురపాలక సంచాలకులు శ్రీదేవి ఆదివారం ఆయా కార్పొరేషన్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. 13 నగరపాలక సంస్థల్లో ఎస్టీ-1, ఎస్సీ-1, బీసీ-4, జనరల్-7 స్థానాలను కేటాయించగా, 123 పురపాలికల చైర్మన్లలో ఎస్టీ-4, ఎస్సీ-17, బీసీ-40, జనరల్ -62 స్థానాలను కేటాయించినట్లు ఆమె తెలిపారు. మీర్పేట్ మేయర్ పదవి ఎస్టీకి కేటాయించగా, రామగుండం మేయర్ పదవి ఎస్సీకి కేటాయించారు. జవహర్‌నగర్, బండ్లగూడ, నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పదవులను బీసీకి కేటాయించినట్లు ఆమె తెలిపారు. 128 మున్సిపాలిటీలో జడ్చర్ల, నకిరేకల్ ఇంకా సమయం ఉందని, వివిధ కారణాలతో పాల్వంచ, మందమర్రి, మణుగూరుకు రిజర్వేషన్ ప్రకటించడం లేదని వివరించారు. 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించామన్నారు. కొత్త చట్టం ప్రకారం ఇవే రిజర్వేషన్లు తరువాత ఎన్నికల్లో కూడా వర్తిస్తాయన్నారు. ఎస్టీ రిజర్వుడ్ మున్సిపాలిటీలు.. అమన్‌గల్, వర్ధన్నపేట, దోర్నాల్, మరిపెడ, డోర్నకల్. ఎస్సీ రిజర్వుడు మున్సిపాలిటీలు.. కేతనపల్లి, బెల్లంపల్లి, మధిర, పరకాల, వైరా, నస్కురు, అలంపూర్, తోర్రుర్, నార్సింగి, పెద్ద అంబర్ పేట, ఐజా, పెబ్బేరు, నెరుడుచెర్ల, వడ్డేపల్లి, భూపాలపల్లి, తిరుమలగిరి బీసీ రిజర్వుడు మున్సిపాలిటీలు.. సిరిసిల్ల, నారాయణ పేట, కోరుట్ల, చండూరు, భీంగల్, ఆందోల్, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, నిర్మల్, కిసిగి, రాయికల్, పోచంపల్లి, రమాయపేట, బోధన్, సదాశివ పేట, ఆర్ముర్, మెటపల్లి, గద్వాల్, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, సుల్తానాబాద్, నర్సంపేట, కిదంగల్, తుఫ్రాన్, ఆలేరు, భువనగిరి. 13 కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఎస్టీ : మీర్పేట్ ఎస్సీ : రామగుండం బీసీ : జవహర్ నగర్, వరంగల్, నిజామాబాద్, బండ్లగూడ జనరల్ : బండాగ్ పెట్, కరీంనగర్, బొడుప్పల్, పిర్జాదిగూడ. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజాంపేట (జనరల్ స్థానాల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు) మొత్తం జనాభాలో 1.9 శాతం ఎస్టీ జనాభా 3.25% రిజర్వేషన్లు 3.6 శాతం ఎస్సీ జనాభా. 14% రిజర్వేషన్లు 32.5 శాతం బీసీ % జనాభా, 33 శాతం రిజర్వేషన్లు ఖరారు. పూర్తి జాబితా కోసం ... -
మున్పిపల్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్
-
మున్పిపల్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అందుకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 128 మున్సిపాలిటీలలో 121 మున్సిపాలిటీలతో పాటు 10 మున్సిపల్ కార్పొరేషన్లు అయిన కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, బడంగ్‌పేట, నిజాంపేట, బండ్లగూడ, జవహర్‌నగర్, మీర్‌పేటలో ఎన్నికలు నిర్వహించనున్నారు. సాంకేతిక కారణాల దృష్యా, గడువు తీరక మరికొన్ని మున్సిపాలిటీల్లో తర్వాత జరగనున్నాయి. అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, సిద్దిపేట, పాల్వంచ, మందమర్రి, మణుగూరు వంటి ఏజెన్సీ ప్రాంతాలు ఈ కేటగిరిలో ఉన్నాయి. కాగా, రిజర్వేషన్ల అంశం ఓ కొలిక్కి వచ్చిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. మున్సిపాలిటీలో ఉన్న జనాభా ప్రకారం ఒక పోలింగ్ కేంద్రానికి 800 ఓటర్లను కేటాయించే అవకాశం ఉంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ ముందు లేదా తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాన్ని తీసుకోనుంది. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించనుంది. -
‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎంపీపీల జిల్లా కోటాను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు కసరత్తు చేసిన జిల్లా పరిషత్ అధికారులు బుధవారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎంపీపీ, జెడ్పీటీసీలకు సంబంధించి మండలాల వారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగించారు.ఎంపీటీసీల రిజర్వేషన్ మాత్రం ఆయా జిల్లాల ఆర్డీఓల పర్యవేక్షణలో ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్‌ను జనాభా ప్రాతిపదికన నిర్ణయించగా, బీసీల రిజర్వేషన్ మాత్రం ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించారు. ఉదయంనుంచి రాత్రి వరకు రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి రిజర్వేషన్లను ప్రస్తుతం తయారు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతికి సూర్యాపేట, భువనగిరికి రిజర్వేషన్ జాబితాను పంపంచి అనుమతి తీసుకున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్ నల్లగొండ జిల్లా ఎంపీపీ జెడ్పీటీసీ అడవిదేవులపల్లి ఎస్టీ(జ) ఎస్టీ(జ) అనుముల ఎస్సీ(జ) ఎస్సీ(జ) చందంపేట ఎస్టీ(మ) ఎస్టీ(మ) చండూరు బీసీ(మ) బీసీ(జ) చింతపల్లి జనరల్(మ) జనరల్(మ) చిట్యాల బీసీ(మ) బీసీ(మ) దామరచర్ల ఎస్టీ(మ) ఎస్టీ(మ) దేవరకొండ జనరల్ జనరల్(మ) గుండ్లపల్లి జనరల్(మ) జనరల్ గుర్రంపోడు జనరల్ జనరల్(మ) కనగల్ బీసీ(జ) బీసీ(జ) కట్టంగూర్ జనరల్ జనరల్ కేతెపల్లి ఎస్సీ(జ) ఎస్సీ(మ) కొండమల్లేపల్లి జనరల్(మ) జనరల్(మ) మాడ్గులపల్లి ఎస్సీ(మ) ఎస్సీ(జ) మర్రిగూడ జనరల్ జనరల్ మిర్యాలగూడ జనరల్(మ) జనరల్ మునుగోడు బీసీ(జ) బీసీ(మ) నకిరేకల్ జనరల్ జనరల్(మ) జనరల్ జనరల్(మ) నల్లగొండ ఎస్సీ(జ) ఎస్సీ(జ) ఎస్సీ(జ) ఎస్సీ(జ) నాంపల్లి జనరల్(మ) జనరల్ నార్కట్‌పల్లి నార్కట్‌పల్లి(జ) జనరల్ నేరేడుగొమ్ము ఎస్టీ(జ) ఎస్టీ(జ) నిడమనూరు జనరల్(మ) జనరల్(మ) పీఏపల్లి జనరల్ జనరల్(మ) పెద్దవూర జనరల్(మ) జనరల్ శాలిగౌరారం ఎస్సీ(మ) ఎస్సీ(మ) తిప్పర్తి జనరల్ జనరల్ తిరుమలగిరి సాగర్ ఎస్టీ(జ) ఎస్టీ(మ) త్రిపురారం జనరల్(మ) జనరల్(మ) వేములపల్లి ఎస్సీ(మ) ఎస్సీ(మ) అడ్డగూడూరు ఎస్సీ(జ) ఎస్సీ(మ) ఆలేరు ఎస్సీ(జ) ఎస్సీ(జ) ఆత్మకూరు ఎం జనరల్(మ) జనరల్ బొమ్మల రామారం జనరల్ జనరల్ భువనగిరి బీసీ(మ) బీసీ(జ) బీబీనగర్ జనరల్ జనరల్(మ) చౌటుప్పల్ జనరల్ జనరల్ గుండాల ఎస్సీ(మ) ఎస్సీ(మ) మోటకొండూరు జనరల్(మ) జనరల్ మోత్కూర్ జనరల్(మ) జనరల్(మ) నారాయణపురం జనరల్(మ) జనరల్(మ) పోచంపల్లి జనరల్ జనరల్(మ) రాజాపేట బీసీ(జ) బీసీ(జ) రామన్నపేట బీసీ(మ) బీసీ(మ) తుర్కపల్లి ఎస్టీ(జ) ఎస్టీ(జ) వలిగొండ బీసీ(జ) జనరల్(మ) యాదగిరిగుట్ట బీసీ(జ) బీసీ(మ) నల్లగొండ జిల్లాకు సంబంధించిన రిజర్వేషన్‌తోపాటు మిగిలిన రెండు జిల్లాల జాబితాను కూడా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అనుమతితో జెడ్పీ అధికారులు ప్రకటించారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 31 మండలాల పరిధిలో మొత్తం 16మహిళలకు రిజర్వ్ కాగా, 15 మండలాలు జనరల్‌కు కేటాయించారు. సూర్యాపేటలో మొత్తం 23 మండలాలకు మహిళలకు 12, జనరల్‌కు 11 కేటాయించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలకు గాను 7 మహిళలకు రిజర్వ్ చేయగా, 10 జనరల్‌కు కేటాయించారు. మూడు జిల్లాల పరిధిలో ఎంపీపీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లలో మహిళలకు 50 శాతం కేటాయించారు. -
రిజర్వేషన్లపై టెన్షన్
జిల్లాలో గ్రామ పంచాయతీలు 468 వార్డులు 4,750 మొత్తం ఓటర్లు 7,25,660 మహిళలు 3,61,914 పురుషులు 3,63,746 సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లౖòపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ గ్రామ పంచాయతీకి ఏ రిజర్వేషన్ కానుందోననే సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వ ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 721 గ్రామ పంచాయతీల్లో 719 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయావర్గాల నేతలు తాము పోటీ చేయదల్చుకున్న స్థానాలకు రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారుల గుర్తింపు పూర్తి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో పాల్గొనే అధికారుల గుర్తింపు ఇప్పటికే పూర్తయ్యింది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఆఫీసర్లు(పీఓ)లు 1439 మందిని గుర్తించారు. ఇందులో మహబూబ్‌నగర్ డివిజన్లో 691, నారాయణపేట్‌లో 148 మందిని ఎంపిక చేశారు. ఏపీఓలు 2,271 మందిని గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా మండలాల్లో ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు కేత్రస్థాయి పరిశీలన చేశారు. జిల్లా వ్యాప్తంగా 6,366 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గుర్తించారు. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఎన్నికల నిబంధన మేరకు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు జిల్లాలోని గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ ఎప్పుడెప్పుడా అని రాజకీయ పార్టీలు, ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ఆరంభమైన తరువాత ఒక్కసారిగా పల్లె వాతావరణం వేడెక్కనుంది. ఆగస్టు 2, 2013న కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. అంతలోపు ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు, 4,750 వార్డులు ఉన్నాయి. మొత్తం 7,25,660మం ది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,61,914 మహిళ ఓటర్లు, 3,63,746 పురుష ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. దీనిప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లను అమలు చేయనుండగా, బీసీలకు ఓటర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ల అమలుచేస్తారు. దీంతోపాటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు ఉంటుంది. అన్ని కేటగిరీల్లోనూ 50శాతం పదవులు మహిళలకు కేటాయించనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బీసీలకు 34శాతం, జనాభా ఆధారంగా ఎస్సీలకు 20.46 శాతం సర్పంచ్ పదవులను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో ఎస్టీ జనాభా 5.73శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఓటర్ల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు బీసీలకే కేటాయించే రిజర్వేషన్లను వారి ఓటర్ల సంఖ్య ఆధారంగా కేటాయించనున్నారు. జిల్లాలో 4,61,542 బీసీ ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,30,319 పురుష, 2, 31,223మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 34శాతం మేరకు సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించనున్నారు. దీని ప్రకారం జిల్లాలో బీసీలకు 243 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఎస్టీలకు 5.73శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. దీంతో తండాలను కలుపుకుని 148 స్థానాలు సర్పంచ్ స్థానాలు దక్కనున్నాయి. ఎస్సీలకు 20.46 శాతం రిజర్వేషన్లను ఎస్సీలకు కేటాయిస్తారు. మొత్తం 714 స్థానాల్లో ఎస్సీలకు 146 స్థానాలు దక్కనున్నాయి. జనరల్‌కు వివిధ వర్గాలకు 60శాతం మేరకు రిజర్వేషన్ల కేటాయించే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 6,366 వార్డులు జిల్లా వ్యాప్తంగా 721 గ్రామ పంచాయతీలు, 6366 వార్డులు ఉన్నాయి. ఇందులో 34 శాతం లెక్కన బీసీలకు 2,164 స్థానాలు రానున్నాయి. వాటిలో 1,082 మహిళలకు, 1,082 బీసీ జనరల్ స్థానాలకు కేటాయించే అవకాశాలున్నాయి. ఎస్సీలకు 20.46శాతం లెక్కన 1,302 స్థానాలు దక్కనున్నాయి. వాటిలో 651 మహిళలకు, మిగతావి ఎస్సీ జనరల్‌కు దక్కే అవకాశాలున్నాయి. అలాగే ఎస్టీలకు 5.73శాతం మేరకు 365 స్థానాలు దక్కనుండగా, వాటిలో 182 మహిళలకు, 183 ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్లు పోగా 2,535 స్థానాలు జనరల్‌కు దక్కనున్నాయి. వాటిలో జనరల్ మహిళలకు 1,267 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. మార్గదర్శకాలు రావాల్సి ఉంది ప్రభుత్వం నుంచి తమకు పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు అందాల్సి ఉంది. గత ఎన్నికల్లో నిర్వహించిన మాదిరిగానే రిజర్వేషన్లు కేటాయించాలని సూచనప్రాయంగా తెలిపారు. అందులో అంతగా స్పష్టత లేదు. మరో 4, 5 రోజుల్లో పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. – వెంకటేశ్వర్లు, డీపీఓ -
ఏపీ ప్రభుత్వానికి ముద్రగడ అల్టిమేటం
తుని: కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన రాస్తారొకో ఆదివారం ముగిసింది. రిజర్వేషన్లపై ప్రకటనకుగాను ఏపీ ప్రభుత్వానికి ఆదివారం రాత్రి ముద్రగడ అల్టిమేటం జారీచేశారు. రేపు సాయంత్రం లోగా ఒక ప్రకటన రావాలని ఆయన డిమాండ్ చేశారు. దీని తర్వాత కీలక కార్యాచరణకు ముద్రగడ సన్నితులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కాగా, ఆదివారం మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. సభ వేదికపై నుంచి దిగిన ముద్రగడ పద్మనాభం సమీపంలోని రైలుపట్టాలపై బైఠాయించారు. అనంతరం పక్కన ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు.