
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): తూర్పుగోదావరి జిల్లా తునిలో రైలు దహనం ఘటన కేసుకు సంబంధించి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. మొత్తం 41 మందికి కోర్టు సమన్లు జారీ చేయగా వారిలో ముగ్గురు అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యారు. ముద్రగడతోపాటు మరో 37 మంది రైల్వే కోర్టు న్యాయమూర్తి సురేష్ బాబు ఎదుట హాజరయ్యారు. ఈ నెల 16కు విచారణ వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment