
తిరుపతి నుంచి విశాఖ వెళ్లే రైళ్లు ఆలస్యం
తిరుపతి : తుని సంఘటన నేపథ్యంలో తిరుపతి నుంచి విశాఖపట్టణంవైపు వెళ్లే రైళ్లు సోమవారం ఆలస్యంగా బయలుదేరతాయని తిరుపతి రైల్వే అధికారులు తెలిపారు.
తిరుపతి నుంచి విశాఖపట్టణం వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ రాత్రి 8.35 గంటలకు బయలుదేరాల్సి ఉండగా రెండు గంటలు ఆలస్యంగా రాత్రి 10.35 గంటలకు బయలుదేరుతుంది. అలాగే విశాఖపట్టణం మీదుగా భువనేశ్వర్ వెళ్లే భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వెళ్లాల్సిన రైలు రాత్రి 7.15 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.