వేసవి ప్రత్యేక రైళ్లు
Published Sat, Feb 4 2017 2:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
నగరంపాలెం (గుంటూరు) : వేసవి సెలవులకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్–కుచ్చివెల్లి– హైదరాబాద్‌కు, విశాఖపట్నం– తిరుపతి– విశాఖపట్నానికి డివిజను మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజరు ఎండీ ఆలీ ఖాన్‌ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్ నం.07115 హైదరాబాద్ – కొచ్చివెల్లి ప్రత్యేక రైలు ఫిబ్రవరి 04, 05, 18, 25, మార్చి 04, 11, 18, 25, ఏప్రిల్ 01, 08, 15, 22, 29, మార్చి 06, 13, 20, 27, జూన్ 03, 10, 17, 24 తేదీల్లో.. అనగా ప్రతి శనివారం హైదరాబాద్‌లో 21.00 గంటలకు బయలుదేరి ప్రతి సోమవారం కొచ్చివెల్లికి 03.20కి చేరుకుంటుందని తెలిపారు. ఇది డివిజను పరిధిలో నల్గొండకు 23.20/23.22, పిడుగురాళ్లకు ఆదివారం 00.45/00.47, గుంటూరుకు 02.55/03.15కి వచ్చి బయలుదేరుతుందని తెలిపారు. అలాగే ట్రైన్ నం : 07116 కుచ్చివెల్లి–హైదరాబాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు టైం వివరాలను తెలిపారు. ట్రైన్ నం : 08573 విశాఖపట్నం– తిరుపతి ప్రత్యేక రైలు ఫిబ్రవరి 06, 13, 20, 27 తేదీల్లో అనగా.. ప్రతి సోమవారం విశాఖపట్నంలో 22.55కి బయలుదేరి న్యూగుంటూరుకు మంగళవారం 06.10/06.12కి వచ్చి బయలుదేరి తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు. ట్రైన్ నం: 08574 తిరుపతి– విశాఖపట్నం ప్రత్యేక రైలు ఫిబ్రవరి 07, 14, 21, 28 తేదీల్లో.. అనగా ప్రతి మంగళవారం తిరుపతిలో 15.30కి బయలుదేరి న్యూగుంటూరు 22.20/22.22కి వచ్చి బయలుదేరి విశాఖపట్నానికి బుధవారం 06.50కి చేరుకుంటుందని తెలిపారు.
Advertisement
Advertisement