
ఆరు గంటలు ఆలస్యంగా రైళ్లు
రామగుండం: న్యూఢిల్లీలో పొగమంచు కారణంగా బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నై వైపు వెళ్లే రైళ్లు ఆరు గంటల ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆలస్యంగా నడుస్తున్న వాటిలో గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ (జీటీ), తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ తదితర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నారుు.