పొగమంచుతో రైళ్లు ఆలస్యం
న్యూఢిల్లీ: ఉత్తరాదిన చలి, పొగమంచు తీవ్రంగా ఉంది. ఢిల్లీలో దట్టమైన పొగమంచు ఆవరించింది. దీనివల్ల రైళ్ల రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 12 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఉత్తరాదిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.