
పొగ మంచుతో రైళ్ల రాకపోకలకు అంతరాయం
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో చలి మరింత పెరిగిపోతోంది. దట్టమైన పొగమంచు కారణంగా అక్కడ 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. పగటిపూట అధికంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, ఉదయం వేళల్లో అత్యల్పంగా 6.9 డిగ్రీలే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.