ఆలస్యంగా నడుస్తున్న 53 రైళ్లు
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశం చలికి వనికిపోతోంది. దట్టమైన పొగమంచు వల్ల జనజీవనం స్తంభించిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా 53 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 26 రైళ్ల వేళల్లో మార్పులు చేసి.. మూడు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
పొగమంచు మూలంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఆలస్యంగా బయలుదేరనుంది. మధ్యాహ్నం 12:25 గంటలకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.