
టైమొస్తే ముద్రగడనూ అరెస్టు చేస్తారు
ఉప ముఖ్యమంత్రి మంత్రి చినరాజప్ప
అమలాపురం: ‘తుని ఘటనపై సీఐడీ ఒక పద్ధతి ప్రకారం విచారణ చేస్తోంది. ముందుగా విధ్వంసానికి పాల్పడిన వారిని అరెస్టు చేస్తున్నాం. వారి మీద నేరచరిత్ర కూడా ఉంది. ఏ-1 అయినంత మాత్రాన ముందుగా ముద్రగడ పద్మనాభాన్ని అరెస్టు చేయాలని లేదు. ఆయనపై నేర చరిత్ర లేదు. విధ్వంసకారులను రెచ్చగొట్ట లేదు.
కానీ టైమొస్తే ముద్రగడను కూడా అరెస్టు చేస్తారు’ అని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే ఆనందరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అరెస్టు చేసిన వారిని రిమాండుకు తరలించారని, విషయం కోర్టులో ఉన్నందున వారి మీద కేసులు తొలగించే అవకాశం లేదని రాజప్ప తేల్చిచెప్పారు.