'కాపుల్లో చిచ్చుపెట్టాలని ప్రభుత్వం చూస్తోంది' | private news channel md saisudhakar speaks over cid enquiry | Sakshi
Sakshi News home page

'కాపుల్లో చిచ్చుపెట్టాలని ప్రభుత్వం చూస్తోంది'

Published Tue, Sep 20 2016 1:54 PM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM

private news channel md saisudhakar speaks over cid enquiry

హైదరాబాద్ : కాపుల్లో చిచ్చుపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఓ ప్రైవేట్ చానల్ ఎండీ సాయిసుధాకర్ ఆరోపించారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ...తుని ఘటనపై విచారణ పేరుతో కావాలనే కొందర్ని వేధిస్తున్నారన్నారు.   
 
సీఐడీ విచారణలో తాను చెప్పిన దానికి, పత్రికల్లో వచ్చిన దానికి తేడా ఉందన్నారు. విచారణ వివరాలు ఒక పత్రికకు మాత్రమే ఎలా వచ్చాయో పోలీసులు చెప్పాలన్నారు. ఆ పత్రికలో వచ్చిన వార్తలపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. విచారణ ఫుటేజీని బయటపెట్టాలని సాయిసుధాకర్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో సోమవారం సీఐడీ విచారణకు ఆయన హాజరైన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement