టీవీ ఛానెల్ ఎండీని విచారిస్తున్న సీఐడీ
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు గర్జన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై రాజమండ్రి సీఐడీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ ఎండీ సాయిసుధాకర్ను సీఐడీ అధికారులు విచారణకు పిలిపించారు. సోమవారం ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చారు. తునిలో ఆందోళనకారులు రైలును దహనం చేయడం, పోలీస్ స్టేషన్లో విధ్వంసం సృష్టించిన ఘటనపై సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
కాపులను బీసీల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో తునిలో కాపుగర్జన సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.