కిర్లంపూడి: తుని ఘటనపై ఏపీ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను గుర్తించిన సీఐడీ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అరెస్టైన వారిపై 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సీఐడీ పోలీసులు మంగళవారం సాయంత్రం కాకినాడ మెజిస్ట్రేట్ ఎదుట వారిని హాజరు పర్చారు. న్యాయమూర్తి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. అరెస్టైన వారిలో దూడల మహేంద్ర(అమలాపురం), లగుడు శ్రీనివాస్(కిర్లంపూడి), నక్కా సాయి గణేష్(అంబాజీపేట), గుంటూరుకు చెందిన శివగణేష్, పవన్ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు.
తుని ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో మాట్లాడుతూ...బాధ్యులపై చర్యలు తీసుకోకూడదా ..? అని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రశాంతతకు మారుపేరన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం లాండ్ అండ్ ఆర్డర్కు విఘాతం కలిగిస్తారా అన్నారు.
తుని ఘటనలో ఏడుగురికి రిమాండ్
Published Tue, Jun 7 2016 6:32 PM | Last Updated on Thu, Oct 4 2018 8:31 PM
Advertisement
Advertisement