'ఆ ఘటనతో మాకెలాంటి సంబంధం లేదు' | YSRCP Leaders takes on gali muddu krishnama naidu | Sakshi
Sakshi News home page

'ఆ ఘటనతో మాకెలాంటి సంబంధం లేదు'

Published Wed, Feb 10 2016 5:29 PM | Last Updated on Sat, Sep 29 2018 6:14 PM

YSRCP Leaders takes on gali muddu krishnama naidu

కాకినాడ : కాపు గర్జన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చోటు చేసుకున్న ఘటనలకు... తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.  బుధవారం కాకినాడలో వారిద్దరు విలేకర్లతో మాట్లాడుతూ.... టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తుని ఘటనలో తమ ప్రమేయం లేదని కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేస్తామని తెలిపారు. మీరు సిద్ధమా అంటూ గాలి ముద్దుకృష్ణమనాయుడికి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement