
రెండుచోట్లా ఓడిపోయిన అవమాన భారం నుంచి ఇంకా పవన్ కల్యాణ్ బయటకు రాలేదు. తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌పై ఈర్ష్య, అసూయద్వేషాలతో రగిలిపోతున్నారు. వేదిక ఏదైనా సరే సీఎంను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మంత్రులను సన్నాసులంటున్న పవన్‌కు సంస్కారం ఉందా? ఒక పార్టీకి వ్యవస్థాపకుడై ఉండి కులాలు ఆపాదిస్తూ పబ్లిక్‌లో మాట్లాడతారా? సీఎం జగన్.. కులం, మతం, రాజకీయం చూడబోమని చెప్పి అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. నిర్మాతలు, దర్శకులకు కూడా పవన్ కులాన్ని ఆపాదించడం విచారకరం. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ పదేపదే జగన్‌ను లక్ష్యంగా చేసుకుని దూషించారు. సీఎంగా ఉన్న చంద్రబాబును మాత్రం ఏమీ అనలేదు.
పవన్ బీజేపీతో ఉన్నా వారిద్దరి స్నేహబంధం అప్పటి నుంచి ఇప్పటికీ విడిపోలేదు. నిర్మాతలు, దర్శకులు ఆన్‌లైన్ టికెట్ విధానం కావాలని కోరారు. కేంద్రంలో బీజేపీ కూడా ఈ విధానాన్నే కోరుతోంది. ఒకవేళ పవన్‌కు అది ఇష్టం లేకపోతే ఆన్‌లైన్ టికెట్ విధానం తీసేయాలని ప్రధాని మోదీని కోరాలి. దేశంలో హుందాతనంతో వ్యవహరిస్తున్న తక్కువ మంది నాయకుల్లో సీఎం జగన్ ఒకరు. చివరకు తన దగ్గర పనిచేసే అటెండర్‌ను కూడా అన్నా అని పిలుస్తారు.
– తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
Comments
Please login to add a commentAdd a comment