‘కలెక్టర్‌ వెళ్లిన షిప్‌లోకి పవన్‌ను ఎందుకు వెళ్లనివ్వలేదు?’ | Ex Minister Kurasala Kannababu Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘కలెక్టర్‌ వెళ్లిన షిప్‌లోకి పవన్‌ను ఎందుకు వెళ్లనివ్వలేదు?’

Published Sat, Nov 30 2024 5:43 PM | Last Updated on Sat, Nov 30 2024 6:57 PM

Ex Minister Kurasala Kannababu Comments On Pawan Kalyan

సాక్షి, కాకినాడ జిల్లా: దొంగ సొత్తు దొరికినప్పుడు ఎందుకు ఆపలేదు?.. సీజ్‌ చేసిన బియ్యాన్నే మళ్లీ ఎందుకు రిలీజ్ ‌చేశారంటూ కూటమి సర్కార్‌ను మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘‘పవన్ ఆవేదన గమనించాను. ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతోంది. పోర్టుకు వస్తానంటే ఆరు నెలలు నుంచి ఆపేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం ఎగుమతులపై దృష్టి పెట్టారు. సివిల్ సప్లయి శాఖ మంత్రి తనిఖీలు చేసి పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు.

..సివిల్ సప్లయి శాఖ నుండి పోర్డు వద్ద రెండు చెక్ పోస్టులు పెట్టారు. సివిల్ సప్లయి ఛైర్మన్ తోట సుధీర్ కూడా రేషన్ బియ్యం లారీలను పట్టుకున్నట్లు చూశాను. గతంలో మంత్రి మనోహర్ పట్టుకున్న బియ్యమే.. మళ్లీ బిజీ ఇచ్చి బియ్యాన్ని విడుదల చేశారు. బియ్యాన్ని విడుదల చేసినప్పుడు సివిల్ సప్లయి శాఖ షరతులు ఏంటి అని అడుగుతున్నాను. సివిల్ సప్లయి చెక్ పోస్టులు దాటి ఈ బియ్యం పోర్టులోకి ఎలా వెళ్లాయి’’ అంటూ కన్నబాబు నిలదీశారు.

‘‘బియ్యం ఉన్న షిప్‌లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనీయడం లేదని పవన్ అంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ను ఎవరూ ఆపి ఉంటారని సామాన్యులలో ప్రశ్నలు తలెత్తున్నాయి. డిప్యూటీ సీఎం పై స్ధాయిలో వ్యక్తే పవన్‌ను షిప్పులోకి ఎక్కకుండా ఆపారా?. అక్రమాలు జరుగుతున్న పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనిదే?. కాకినాడ పోర్టు దేశ భద్రతకు ముప్పు  ఉందని పవన్ ఆందోళన చెందారు. ఒకవేళ కసాబ్ లాంటి వాళ్లు వస్తే తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదే కదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.

సీజ్ చేసిన బియ్యాన్నే మళ్లీ ఎందుకు రిలీజ్ చేశారు?

‘‘కలెక్టర్ వెళ్లిన షిప్పులోకి డిప్యూటీ సీఎంను ఎందుకు ఆపారు? ఎవరూ ఆదేశాల మేరకు ఆపి ఉంటారు. ఇప్పటీకి రేషన్ బియ్యం దందా జరుగుతుందని ఎల్లో‌ మీడియాలోనే వస్తుంది? దానిని అడ్డుకోవాలి. సిస్టమ్‌లో ఉన్న లోపాలను సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పవన్ ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పవన్ దేశ భద్రత కోసం మాట్లాడారు.. దానికి రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. సివిల్ సప్లయి శాఖ చాలా పటిష్టం అవ్వాల్సిన అవసరం ఉంది. 

..ఇవాళ పేపర్ చూస్తే షాక్ కొట్టింది.. బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ. విద్యుత్ ఛార్జీలతో చంద్రబాబు ప్రజలను బాదేశారు. యూనిట్ మీద రూ.2.19 పైసలు అదనపు భారాన్ని  వేశారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రజల మీద భారం వేసి జగన్ సంపద సృష్టించలేదు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికలకు మందు అనేక సభల్లో చంద్రబాబు చెప్పారు. ఇది చంద్రబాబు పర్మినెట్ స్టేట్‌మెంట్‌. ఐదు నెలల్లో మాట మార్చేశారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement