
సూపర్ సిక్స్‌పై ఏడు నెలలకే చేతులెత్తేశారు
తల్లికి వందనం పథకాన్ని తల్లికి తద్దినంగా మార్చారు
ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు రాబోతున్నాయి
ఇంత దౌర్భాగ్య పాలన రాష్ట్ర చరిత్రలో చూడలేదు
ఈ వంచనపై పవన్‌కళ్యాణ్ ఏ గుడి మెట్లు కడుగుతారు?
కూటమి సర్కార్‌పై భూమన కరుణాకర్‌రెడ్డి మండిపాటు
తిరుపతి, సాక్షి: సూపర్ సిక్స్ హామీలపై పచ్చి అబద్ధాలు చెబుతూ కోట్లాది మందిని చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలపై బాబు యూటర్న్ ప్రకటనపై మంగళవారం ఉదయం తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడారు.
‘‘చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాజకీయమంతా లాక్కోవడమే. అధికారంలోకి వచ్చాక ప్రజాద్రోహమే చంద్రబాబు నైజం. ఏమాత్రం ప్రజల సంక్షేమం పట్టించుకోరాయన. అలాగే ఇప్పుడూ చంద్రబాబు కోట్లాది మందిని మోసం చేస్తున్నారు. ఎన్నికల ముందు అప్పటి సీఎం జగన్‌పై నిందలు వేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెబుతూ ఆచరణ సాధ్యం కాదని చెబుతూ కపట నాటకం ఆడుతున్నారు. చంద్రబాబు ప్రజా ద్రోహం, ప్రజలకు పొడిచే వెన్నుపోటు ఎలా ఉంటుందో నీతి ఆయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ అమలుకు పరిస్థితి లేదు అని, వృద్ధి రేటు 15% పెంచిన తర్వాత ఆలోచిస్తాను అని చెప్పడం దారుణం.
.. చంద్రబాబు మోసపు హామీలు ఒంటి కన్ను నక్క కథ గుర్తుకు వస్తోంది. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలన చేశారు. కరోనా సమయంలో కూడా దేశంలో ఆదర్శంగా పాలన సాగించారు. కానీ, చంద్రబాబు మాత్రం ఒంటి కన్ను నక్కలా ఇప్పుడు హామీల గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఐదు లక్షల ఫించన్లు కట్ చేశారు. విధ్యుత్ చార్జీలు పెంచము అని చెప్పి రూ. 19 వేల కోట్లు ప్రజలు పై విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపారు. తల్లికి వందనం కాస్త.. తల్లికి తద్దినంగా మారిపోయింది. అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పోభవగా మారిపోయింది. ఆడబిడ్డ నిధి పథకం ఆడబిడ్డ ఏడుపు పథకంగా మారిపోయింది. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది.
సంప్రదాయ దుస్తుల నిబంధన ఏమైంది?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పాలనలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు, 4 సార్లు కొండపై ఎర్రచందనం దొరికింది. వీఐపీ దర్శన సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్ళాలి అనే నిబంధన గాలికి వదిలేశారు. విజిలెన్స్ వ్యవస్థ నిద్ర పోతోంది. అదనపు ఈవో వెంకన్న చౌదరి ఏం చేస్తున్నారు?. సనాతన ధర్మ ఉద్యమ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ దీనిపై మాట్లాడాలి.
లోకేష్ కోసమే సంపద సృష్టి:
రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పాలన సాగుతోంది. ఆయన ఈ ఏడు నెలల పాలనంతా వంచన, మోసం, దోపిడీతోనే సాగింది. తాను సంపద సృష్టిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెబితే, అది లోకేష్ కోసమని జనం గుర్తించలేకపోయారు. బాబు మాటలను గుడ్డిగా నమ్మి మోసపోయారు. అందుకే ఇప్పుడు ప్రజల్లో చంద్రబాబు మీద తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ చరిత్రలో ఇంత తక్కువ కాలంలో వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజల ముందుకు వెళ్లే ధైర్యముందా?.

.. చంద్రబాబును మోసిన పవనాందుల వారు ఏం చేస్తున్నారు?. పవనాంద స్వామి ఏ గుడి మెట్లు కడుతుతున్నారు. చంద్రబాబు అబద్ధాల బుద్ధుడు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రజల కోపాగ్నిలో చంద్రబాబు ప్రభుత్వం భస్మం కాకతప్పదు’’ అని భూమన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment