Super Six Promises
-
‘పవన్, బాబు.. ఉచిత బస్సుకు నిధులేవీ?’
సాక్షి, వైఎస్సార్: ఏపీ బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలకు కేటాయింపులకు పొంతన లేదన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి. నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి అయినా కేటాయించావా చంద్రబాబు?. ఉచిత బస్సుకు నిధులేవీ? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు సంపద సృష్టించే సత్తా ఉంటే ఎందుకు వ్యాపారాలు తగ్గిపోతున్నాయి? అని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల అమలుకు మాత్రం బడ్జెట్లో కేటాయింపులు లేవు. సూపర్ సిక్స్ అందించే ఉద్దేశ్యం ఉందా? లేదా?. నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి అయినా కేటాయించావా చంద్రబాబు?. స్త్రీ నిధి పేరుతో ప్రతీ మహిళకు నెలకు 1500 అన్నావు.. బడ్జెట్లో ఎక్కడ?. ఉచిత బస్సు ఎక్కడ?. తల్లికి వందనం 12వేల కోట్లు అవసరమైతే 9వేల కోట్లు ఇచ్చారు. దీపం పథకం 60 శాతం మందికి అందడం లేదు. మీరు గ్రామాలకు వచ్చి వాకబు చేసే ధైర్యం ఉందా?. అన్నదాత సుఖీభవకి కూడా అరకొర నిధులు కేటాయించావు. హామీలు నెరవేర్చకపోతే చొక్కా పట్టుకుని అడగమన్నాడు లోకేష్.. ఇప్పుడు ఏం చేయాలి?అదేమంటే సంపద సృష్టిస్తాను అన్నావు.. ఆ సంపద సృష్టి ఎక్కడ?. ఇప్పటి వరకు లక్ష కోట్ల అప్పులు తెచ్చావు. ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్లాయి?. గతంలో పెట్రోల్ రేట్లు పెరిగాయి.. అధిక పన్నులు వేస్తున్నారని అన్నావ్. మరి మీరేం తగ్గించారు?. అభివృద్ధి ఎక్కడ జరిగింది?. వైఎస్సార్సీపీ హయాంలో ప్రతీ కుటుంబానికి లక్ష వరకూ డీబీటీ ఇచ్చాం. కడప ఉక్కు కోసం జిందాల్ సంస్టను తెచ్చాం.. ఈరోజు ఎందుకు ముందుకు పోవడం లేదు?. వైద్య విద్యలో మాకు సీట్లు కావాలని రాష్ట్రాలు పోటీ పడతాయి. వైఎస్ జగన్ తెచ్చిన సీట్లు వెనక్కు పంపిన ఘనత చంద్రబాబుదే.మీపై మాట్లాడారని పోసానిని అరెస్ట్ చేశారు. లోకేష్, పవన్‌లు వైఎస్ జగన్‌ను ఎన్నెన్ని మాటలు అన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టేందుకు నేను సిద్ధం. పోలీసులు మీ లిమిట్స్ దాటకండి. తప్పు చేస్తే ఇరు పక్షాల వారిపై చర్యలు తీసుకోండి. చంద్రబాబు మాటలపై విశ్వసనీయత లేదని పవన్‌తో అబద్ధాలు చెప్పించాడు. పవన్.. ఇచ్చిన ప్రతీ హామీకి నువ్వే బాధ్యత తీసుకుని నెరవేర్చు. రెడ్‌బుక్‌లో మా హక్కులు కాలరాస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఈ రాష్ట్రం చంద్రబాబు, లోకేష్ జాగీరు ఏమీ కాదు. మాకు కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. సీజ్ ద షిప్ ఏమైంది?.. తిరుపతి లడ్డూ ఏమైంది?. అబద్దాలు చెప్పడం కాదు.. కొన్ని పనులు చేసైనా నిరూపించుకోండి’ అని హితవు పలికారు. -
సూపర్ సిక్స్ గోవిందా.! బడ్జెట్ పేరుతో బడా మోసం
-
నమ్మించి నయ వంచన!
సాక్షి, అమరావతి : ఆచరణ సాధ్యం కాని హామీలతో అందలమెక్కిన టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే అన్నదాతలకు మొండి చేయి చూపింది. ‘ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుంటున్నారు. రైతులకు జగన్ కేవలం రూ.7,500 చొప్పునే ఇస్తున్నారు. మిగతా ఆరు వేలు కేంద్రమే ఇస్తోంది. అదే మాకు అధికారం ఇస్తే తొలి ఏడాది నుంచే ప్రతి రైతుకు మేమే రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం’ అంటూ ప్రజాగళంలో చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. తీరా ఆచరణకు వచ్చేసరికి అన్నదాతలకు పంగనామాలు పెడుతున్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ.. వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించింది కేవలం నాలుగు శాతం మాత్రమే కావడం గమనార్హం. రూ.3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం రూ.12,401 కోట్లు కేటాయించడం పట్ల రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన తొలి ఏడాది బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి మొక్కుబడిగా రూ.1,000 కోట్లు కేటాయించారు. ఓ వైపు వైపరీత్యాలు, మరోవైపు మార్కెట్లో ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఎంతో కొంత ఊరటనిస్తుందని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ పగ్గాలు చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా తొలి ఏడాదికి సంబంధించి పైసా పెట్టుబడి సాయం విదిల్చ లేదు. వాస్తవానికి రాష్ట్రంలో రైతు భరోసా లబి్ధదారులు 53,58,368 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జమ చేయాలంటే బడ్జెట్లో రూ.10,717 కోట్లు కేటాయించాలి. కానీ కేటాయించింది కేవలం రూ.6,300 కోట్లే. ఈ మొత్తం రూ 20 వేల చొప్పున అర్హులైన రైతులకు చెల్లిస్తే కేవలం 31.50 లక్షల మందికి మాత్రమే సరిపోతుంది. అంటే వాస్తవ లబ్ధిదారుల్లో 22.08 లక్షల మందికి పెట్టుబడి సాయం అందదు. మరో పక్క కౌలు రైతులకు తామే పూర్తిగా పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. పెట్టుబడి సాయంలో ఇలా రూ.4,417 కోట్ల మేర కోత పెట్టడం పట్ల రైతాంగం నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఆర్ఎస్కేలు, అగ్రి ల్యాబ్‌ల నిర్వహణకు కేటాయింపులు నిల్ ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ల నిర్వహణకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఆర్బీకేలను కుదించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం అగ్రి ల్యాబ్‌లను పీ–4 పద్దతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామని ఇటీవలే ప్రకటించింది. అందువల్లే వీటి నిర్వహణకు కేటాయింపులు జరపలేదనే వాదన విని్పస్తోంది. ధరల స్థిరీకరణ నిధికి వైఎస్ జగన్ హయాంలో రూ.3 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం రూ.300 కోట్లు విదిల్చింది. విపత్తుల బారిన పడి పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కింద గత జగన్ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లో పైసా కూడా కేటాయించ లేదు. విత్తన రాయితీ పథకానికి గతేడాది రూ.268 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది పెంచకపోగా రూ.240 కోట్లకు కుదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు పశువుల మేత కోసం బంజరు భూముల కేటాయింపు కోసం నిధులు, గోపాల మిత్రల పునర్నియామకం ఊసే లేదు. రాయితీపై సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు కూడా నిధులు కేటాయించలేదు. రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న హామీ ప్రస్తావన లేదు. పట్టు పరిశ్రమకు 2023–24 బడ్జెట్‌తో పోల్చితే భారీగా కోత పెట్టింది. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి, స్వచ్ఛంద బీమా నమోదు పథకం తీసుకొచ్చారు. ఈ పథకానికి రూ.1,023 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా కోసం ఏటా రూ.1,700 కోట్లు కేటాయించారు. అలాగే వడ్డీ లేని పంట రుణాల కోసం వైఎస్ జగన్ సర్కారు హయాంలో ఏటా రూ.500 కోట్లు కేటాయించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని సగానికి సగం తగ్గించింది. కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించడం వల్ల ఖరీఫ్ 2024–25 లో 69.51 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్ పొందగా, స్వచ్ఛంద బీమా నమోదు పథకాన్ని అమలు చేయడంతో రబీ 2024–25 సీజన్లో కేవలం 7.65 లక్షల మంది రైతులు 9.93 లక్షల ఎకరాలకు మాత్రమే కవరేజ్ పొందగలిగారు. గడిచిన రబీ సీజన్‌తో పోల్చుకుంటే మూడో వంతు రైతులకు కూడా రక్షణ లేకుండా పోయింది. పాత లబ్దిదారులకే వేట నిషేధ భృతిగద్దెనెక్కగానే వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 2024–25 సీజన్‌కు 1,30,128 మంది అర్హత పొందగా, వారికి రూ.260.26 కోట్లు జమ చేయాల్సి ఉంది. కాని ఏడాది గడిచినా పైసా విదల్చలేదు. అనర్హులున్నారంటూ రీ సర్వే పేరిట అర్హులను తొలగించి, తమ పార్టీ సానుభూతిపరులను చేర్చి 1,22,968 మంది అర్హత పొందినట్టుగా లెక్క తేల్చారు. వారికి రూ.245.94 కోట్లు జమ చేయాలని ప్రతిపాదనలు పంపారు. అదే విషయాన్ని బడ్జెట్లో ప్రస్తావించారు. కానీ 2025–26 సీజన్లో వేటకు వెళ్లే మత్స్యకారులకు నిషేధ భృతి కోసం కేటాయింపులు జరపక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఆక్వా, నాన్ ఆక్వాజోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అర్హత కలిగిన 68,134 ఆక్వా కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ విస్తరిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఆ మేరకు కేటాయింపులు జరపలేదు. ఎప్పటిలోగా అమలు చేస్తామన్న స్పష్టతా ఇవ్వలేదు. మరో వైపు ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్స్, సబ్సిడీపై ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం వంటి హామీలపై పైసా కేటాయింపు జరపక పోవడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. మత్స్య యూనివర్సిటీకి మొండి చేయి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంతో పాటు వైఎస్సార్ ఉద్యాన, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు అరకొరగానే కేటాయింపులు జరిపారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య యూనివర్సిటీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే కేటాయించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీకీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో భవన నిర్మాణాలకు ప్రతిపాదించారు. రూ.100 కోట్లతో పరిపాలన భవనం, అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్స్, రైతు శిక్షణా కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా నిర్మాణ పనులు చేపట్టారు. ఈ వర్సిటీకి గతేడాది పైసా ఖర్చు చేయలేదు. ఈ ఏడాది పైసా కేటాయింపులు జరపలేదు. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ జెట్టీల నిర్మాణానికి సైతం పైసా కేటాయించలేదు. దీంతో వీటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. -
వందనమా.. వంచనా!
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తాం. నీకు పదిహేను వేలు... నీకు పదిహేను వేలు.. నీకు కూడా పదిహేను వేలు ఇస్తాం.’ అని టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ వెళ్లి చెప్పారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఉన్న 87.42 లక్షల మంది పిల్లలకు రూ.15వేలు ఇచ్చేందుకు ఒక ఏడాదికి రూ.13,113 కోట్లు కావాలి. ‘తల్లికి వందనం కింద ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న పిల్లలు అందరికీ రూ.15వేలు చొప్పున ఇస్తాం.’ అని బాబు గ్యారెంటీ పేరిట మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ లెక్కన చూసినా యూడైస్‌లో నమోదైన విద్యార్థులు 87.42 లక్షల మందికి రూ.15వేలు చొప్పున ఇవ్వాలంటే రూ.13,113 కోట్లు కావాలి.‘తల్లికి వందనం పథకాన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నాం.’ అని 2025ృ26 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి చెప్పారు. అంటే.. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15వేలు ఇస్తామన్న హామీ నుంచి ‘ప్రతి విద్యార్థి తల్లికి’ ఈ పథకం వర్తిస్తుంది అనే వరకు తీసుకొచ్చారు. గత పరిణామాలు, ప్రస్తుతం ఆర్థిక మంత్రి మాటలు చూస్తే ‘తల్లికి వందనం’ అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి: ‘తల్లికి వందనం’ పథకంపై కూటమి ప్రభుత్వం మరోసారి అంకెల గారడీ చేసింది. ఈ పథకం కింద ఎంతమందికి సాయం అందిస్తారనేది చెప్పకుండా బడ్జెట్లో రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించి కనికట్టు చేసేందుకు ప్రయత్నించింది. కొత్తగా ‘ప్రతి విద్యార్థి తల్లికి’ సాయం అంటూ చంద్రబాబు మార్క్ మోసానికి తెరతీసింది. ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. ‘సూపర్ సిక్స్’ హామీలకు వచ్చేసరికి ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ రూ.15వేలు ఇస్తామని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ 2024–25లో తల్లికి వందనం పథకానికి రూ.5,387 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. కానీ, పైసా ఇవ్వలేదు. ఒక్క విద్యార్థికి సాయం అందించలేదు. శుక్రవారం ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్లో ఈ పథకానికి రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ‘ప్రతి విద్యార్థి తల్లికి’ ఈ పథకం వర్తిస్తుందని కొత్త ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం అందించిన యూడైస్ ప్లస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 87.42 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇవ్వాలంటే రూ.13,113 కోట్లు అవసరం. కేటాయించింది రూ.9,407 కోట్లే. అంటే మొత్తం విద్యార్థుల్లో 24.70 లక్షల మందికి కోత పెట్టక తప్పదు. అందుకే ‘ప్రతి విద్యార్థి తల్లికి’ ఈ పథకం వర్తిస్తుందని కొత్త పల్లవి అందుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖకు తగ్గిన కేటాయింపులు రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్లో పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు (9.86 శాతం) కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదే 2024–25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లతో ప్రతిపాదనలు చేయగా, ఇందులో పాఠశాల విద్యకు రూ.29,909.31 (10.15శాతం) కోట్లు కేటాయించారు. అయితే, చేసిన ఖర్చు మాత్రం రూ.28,560.64 కోట్లే. ఈ మొత్తం వేతనాలు, అలవెన్సులకే సరిపోయింది. ప్రస్తుత బడ్జెట్లో రూ.31,805 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా, ఆ మొత్తం ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులకే సరిపోతాయి. అలాగే, 2024–25 బడ్జెట్లో ప్రకటించిన 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటనకే పరిమితమైంది. తాజా బడ్జెట్ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని కూటమి సర్కారు రెండోసారి ఎంతో గొప్పగా చెప్పుకోవడం గమనార్హం. ‘నాడు–నేడు’ ప్రశ్నార్థకం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మన బడి నాడు–నేడు’ పథకం రెండో విడతలో రూ.8వేల కోట్ల బడ్జెట్‌తో 23 వేల ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే రూ.4 వేల కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. మిగిలిన పనులు పూర్తికావాలంటే మరో రూ.4 వేల కోట్లు అవసరం.కూటమి ప్రభుత్వం ఈ పథకానికి ‘మన బడి–మన భవిష్యత్తు’గా పేరు మార్చి 2024–25 బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. అలాగే, 2025–26 బడ్జెట్లోనూ రూ.1,000 కోట్లు కేటాయింపునకు ప్రతిపాదించారు. దీంతో మన బడి–మన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్ బుక్ చూస్తే కలర్ ఎక్కువ... కంటెంట్ తక్కువగా కనిపిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు అంటూ ఇన్నాళ్లూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారం బడ్జెట్ లెక్కల సాక్షిగా బయటపడిందన్నారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. » బడ్జెట్ అంచనా వ్యయం రూ.3,22,359 కోట్లు, రెవెన్యూ రాబడి రూ.2,17,976 కోట్లు, అప్పు రూ.1,04,382 కోట్లుగా చూపించారు. ఇది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్. బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వం గురించి 25 సార్లు, విధ్వంసం అంటూ మరో పది సార్లు ప్రస్తావించారు. ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు అవుతోంది. ఇకనైనా ప్రజలకు ఎన్నికల హామీల అమలు గురించి చెప్పాల్సిన అవసరం లేదా? » సూపర్ సిక్స్ హామీలపై ప్రతి ఇంటికి తిరిగి పదేపదే చెప్పి ప్రజలను నమ్మించారు. 2019–24 వరకు నాటి సీఎం వైఎస్ జగన్ క్యాలెండర్ ప్రకారం మేనిఫేస్టోలో చెప్పినది ప్రతీదీ అమలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇదే తరహాలో హామీలను అమలు చేస్తుందని ఆశతోనే ప్రజలు కూటమికి పట్టం కట్టారు. గతంలో అనేకసార్లు చంద్రబాబు వల్ల మోసపోయినా కూడా తిరిగి వారు చెప్పిన ఆకర్షణీయమైన హామీలతో మోసపోయి కూటమికి అధికారం అప్పగించారు. సూపర్ సిక్స్ హామీల అమలేదీ?సూపర్ సిక్స్ హామీల అమలును చూస్తే తొలి ఏడాది బడ్జెట్ లో ఎలా మొండిచేయి చూపించారో అలాగే ఈ బడ్జెట్ లో కూడా చేశారు. దీపం పథకం కింద అర్థదీపం, పావుదీపం అమలు చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం చేసినంత అప్పు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఒక్క ఏడాదిలోపే రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేశారు. 1995 నాటి పరిస్థితిని ఉదహరిస్తూ, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ఆర్థిక మంత్రి వాపోయారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో 1995లో మిగులు బడ్జెట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు ఈ సృష్టిస్తున్న సంపదను ఎందుకు కేటాయించడం లేదు? 2014–19 లో స్థూల ఉత్పత్తి 13.5 పెరిగితే, 2019–24 లో 10.3 పెరిగిందని పోలిక చెబుతున్నారు. వైఎస్సార్సీపీ హాయంలో కోవిడ్ తో మొత్తం ఎకానమీ దెబ్బతిన్న సమయాన్ని కూడా పోలుస్తారా?అప్పులపై తప్పుడు లెక్కలు» అప్పుల గురించి మాట్లాడుతూ 2024, మార్చి 31 నాటికి అప్పు రూ.3,75,295 కోట్లు ఉంది. ప్రభుత్వ అప్పు రూ. 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్స్ లైబిలిటీస్ రూ. 80,914 కోట్లు, కార్పోరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు, సివిల్ సప్లయిస్ రూ.36,000 కోట్లు, విద్యుత్ సంస్థలు రూ.34,267 కోట్లు, రూ.1,13,000 కోట్లు కాంట్రాక్టర్లకు, ఎంప్లాయిస్ కు రూ.21,000 కోట్లు, మొత్తం కలిపి రూ.9,74,556 కోట్లు అప్పులు ఉన్నాయని ముఖ్యమంత్రి తన ప్రజెంటేషన్‌లో వెల్లడించారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఎలా మాపై విషప్రచారం చేశారు?» కార్పొరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు అన్ని చంద్రబాబు చెప్పారు. కానీ కాగ్ చెప్పిన దాని ప్రకారం రూ.1,54,797 కోట్లు అని స్పష్టంగా ఉంది. అంటే కాగ్ చెప్పినది సరైనదా? లేక మీరు చెబుతున్న లెక్కలు సరైనవా? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక అంశాలపై ఏది చెప్పినా ప్రతి దానికీ ఆధారాన్ని చూపించేవారు, కానీ కూటమి మాత్రం తమ లెక్కలకు ఎక్కడా ఆధారాలను చూపించడం లేదు. సివిల్ సప్లయిస్ కు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వలేకపోవడం వల్ల, పేమెంట్ చేయడానికి సివిల్ సప్లయిస్ అప్పులు చేసింది. అంటే ఈ రూ.36,000 కోట్లు కూడా కాగ్ చెప్పిన రూ. 1,54,797 కోట్ల అప్పుల్లో కలిసే ఉంది. కానీ దానిని కూటమి ప్రభుత్వం విడిగా చూపి ఎక్కువ అప్పులు ఉన్నట్లుగా చిత్రీకరించింది. డిస్కం అప్పుల గురించి రూ.34,267 కోట్లు ఉన్నట్లు చూపించారు. సడ్సీటీ కింద రైతులకు, ఎస్సీ, ఎస్టీ లకు గృహ వినియోగ సబ్సిడీని ప్రభుత్వం డిస్కంలకు కట్టకపోవడం వల్ల డిస్కంలు అప్పులు చేశాయి. ఇవి కూడా కాగ్ చెప్పిన మొత్తంలో కలిసే ఉన్నాయి. దానిని కూడా విడిగా చూపి ఎక్కువ అప్పులు చేశామని ప్రచారం చేశారు. » అలాగే కాంట్రాక్టర్ లకు చెల్లించాల్సిన వాటిల్లో అప్ లోడ్ అయినవి 86,000 కోట్లు వీటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. మొత్తం అప్పులు చూస్తే 7,83,773 కోట్లుగా లెక్క తేలుతున్నాయి. వీటిల్లో 3,90,250 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైయస్ఆర్ సీపీ పాలనలోకి వచ్చినప్పుడు ఉన్న అప్పు. మా హయాంలో జరిగిన అప్పు రూ.3,33,513 కోట్లు మాత్రమే. కానీ కూటమి పార్టీలు మాపై తప్పుడు ప్రచారం చేశాయి. శ్రీలంక, కాంబోడియా అంటూ దుష్ప్రచారం చేశాయి.సంపద సృష్టించడమంటే వృద్ధి రేటు తగ్గడమా?» సంపద సృష్టి అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. పదినెలల్లో మైనస్ 0.01 శాతం వృద్ధిలో ఉన్నారు. వైఎస్సార్సీపీకి పాలన చేతకాదు అంటూ విమర్శలు చేశారు. మరి ఈ పదినెలల్లో మీరు చేసింది ఏమిటీ? స్థూల ఉత్పత్తి బాగుంటే, రెవెన్యూ రాబడిలో వృద్ది కనిపిస్తుంది. 2024లో అంటే ఏప్రిల్ నుంచి 2025 జవనరి వరకు పదినెలలు లెక్కేస్తే రెవెన్యూ రాబడి మైనస్ లోకి వచ్చింది? 2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు వైఎస్సార్సీపీ పాలనలో సాధించిన రెవెన్యూ రూ. 72,872 కోట్లు. కూటమి పాలనలో పది నెలల్లో రూ.72,864 కోట్లు వచ్చింది. అంటే మా కన్నా ఎనిమిది కోట్లు తక్కవగా రెవెన్యూ వచ్చింది. ఇదేనా మీ సంపద సృష్టి? » నీతి అయోగ్ ప్రకారం 2015–19 వరకు 12.9 శాతం రెవెన్యూ రాబడిలో సీఎజీఆర్ ఉంది. 2020–23 వరకు 14.1 శాతం పెరిగింది. దీనిని బట్టి ఎవరు సంపదను సృష్టిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంటిపన్నులు పెంచి రెవెన్యూ పెంచుకోవాలని చూస్తున్నారు. పన్నులు పెంచడం వల్ల రాబడి పెరగకపోగా ఒకదశలో నిలిచిపోతుంది. ఫిబ్రవరి 1, 2025 నాటికి 16,997 గ్రామాలు, 9వేల వార్డుల్లో మార్కెట్ విలువను పెంచాలని ప్రతిపాదించారు. కూటమి పాలనలో స్టాంప్స్ అండ్ రెవెన్యూ ఆదాయం పడిపోవడంతో దానిని పెంచుకోవడానికి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని నిర్ణయించారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారుతాజా బడ్జెట్ లో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ధాన్యంకు గత ఏడాది రూ. 1740 క్వింటా రేటు ఉంటే, ఈ ఏడాది రూ.1,470 నుంచి 1,500 ఉంది. ఎంఎస్పీ రూ. 2,300 ఉంది. ప్రొక్యూర్ మెంట్ ఎక్కడ జరుగుందో తెలియడం లేదు. వ్యవసాయదారులు దళారీలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మిర్చి క్వింటా గత ఏడాది 21 నుంచి 23 వేలకు అమ్మితే ఈ ఏడాది రూ.8 నుంచి 11 వేలకు అమ్ముతున్నారు. పత్తి క్వింటా గత ఏడాది మా హయాంలో రూ.10 వేలు ఉంటే, ఇప్పుడు రూ.5000కి అమ్మతున్నారు. మినుములు గత ఏడాది రూ.10 వేలు ఉంటే, ఈ ఏడాది రూ.6 వేలు, కంది క్వింటాలు గత ఏడాది రూ.9–10వేలు అమ్మితే ఈ ఏడాది రూ.5500 లకు అమ్ముకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవ కింద ఎక్కడా రైతులను ఆదుకోవడం లేదు. రూ.6300 కోట్లు అన్నదాతా సుఖీభవ కోసం బడ్జెట్ లో రాశారు. కేంద్రం ఇచ్చే ఆరు వేలను కూడా కలుపుకునే అని మాట మార్చారు. దీని ప్రకారం చూసినా 45 లక్షల మంది రైతులకే అందుతుంది. మొత్తం 55 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇరవై వేలు రాష్ట్రప్రభుత్వమే ఇస్తే కనీసం 30 లక్షల మందికి కూడా ఈ కేటాయింపులు సరిపోవు. గత ఏడాదికే 55 లక్షల మంది రైతులు రైతుభరోసాను అందుకున్నారు. అన్నదాత సుఖీభవకు బడ్జెట్ లో కేటాయింపులు రూ.6300 కోట్లు అని చూపిస్తే, అగ్రికల్చర్ బడ్జెట్ లో వ్యవసాయ మంత్రి అన్నదాత సుఖీభవకు రూ.9400 కోట్లు చూపించారు. ఇందులో ఏది సరైనదో, ఎందుకు వ్యత్యాసం చూపించారో తెలియదు. పథకాల కేటాయింపుల్లోనూ చిత్తశుద్ధి లేదు» సూపర్ సిక్స్ పథకాల అమలుకు బడ్జెట్ లో చేసిన కేటాయింపులు చూస్తే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అర్థమవుతుంది. యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల భృతి అన్నారు, స్కూల్ కు వెళ్లే విద్యార్థికి రూ.15వేలు, ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఏ హామీకీ సరైన కేటాయింపులు లేవు. 2025–26లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు కేటాయిస్తున్నామని చెప్పారే తప్ప ఎంత దీనికి కేటాయిస్తున్నారో ప్రకటించలేదు. తల్లికి వందనం పైన కూడా అలాగే చెప్పారు. నిజంగా వీటిని అమలు చేసే ఉద్దేశం ఉంటే దానిపైన ఎందుకు స్పష్టత ఇవ్వలేదు? » తల్లికి వందనంకు బడ్జెట్ బ్రీఫ్‌లో రూ.9,407 కోట్లు చూపించారు. కానీ వాస్తవంగా లెక్కలను బట్టి దాదాపు రూ.12,450 కోట్లు అవసరం. కానీ కేటాయించింది రూ.8,278 కోట్లు మాత్రమే. దీనిప్రకారం కేవలం 55 లక్షల పిల్లలకే తల్లికి వందనం అందుతుందని అర్థమవుతోంది. అంటే వారికి ఎగ్గొట్టేస్తున్నారు. అప్పు చూస్తే జనవరి నెలాఖరు నాటికి రూ.82,738 కోట్లు అని చూపించారు. కానీ బడ్జెట్ బుక్ లో మాత్రం అప్పు కేవలం రూ. 73,362 కోట్లు అని రాశారు. మూలధన వ్యయం రూ.24,072 కోట్లు అని గత బడ్జెట్లో చెప్పి, ఖర్చు పెట్టింది ఎంతా అని చూస్తే రూ.10,850 కోట్లు మాత్రమే. అంటే ఈ రెండు నెలల్లో రూ.13000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారా? -
కూటమి పానలపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది
-
ఆ మాటలు నిజంగా మనసులోంచే వచ్చాయా?
కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలన్నది ఒక థియరీ. దీన్ని బాగా వంటబట్టించుకున్న వాళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందువరుసలో ఉంటారు. రాజకీయ చరిత్ర మొత్తం ప్రజలను గందరగోళం పరచడం ద్వారా లేదంటే మాయ చేయడం ద్వారానే సాగిందని ఇట్టే అర్థమైపోతుంది. ఈ కారణం వల్లనే ప్రజలకు ఆయనపై అంత విశ్వాసలేమి!. కొన్ని ఇతర కారణాల వల్ల ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి స్థానాన్నైతే సంపాదించుకోగలిగారు. కానీ ఆ స్థాయిలోనే ప్రజల నుంచి గౌరవం, ఆదరణ, మన్నన పొందుతున్నారా? సందేహమే. ఈ చర్చ ఇప్పుడెందుకు వస్తోందంటే.. తాజాగా ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. అవి నిజంగానే చంద్రబాబు(Chandrababu) మనసులోంచి వచ్చాయా? లేక ఇంకోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే బదులుండదు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంలోనూ బాబు గారు దిట్టే. తద్వారా పరిస్థితి ఏదైనా క్రెడిట్ మాత్రం తన ఖాతాలోనే పడేలా వ్యవహరిస్తూంటారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే తీసుకుందాం.. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా వాటి అమలు ఊసేలేదు. కానీ మాటలు మాత్రం బోలెడన్నిసార్లు మార్చేశారు. ఒకసారేమో.. బటన్ నొక్కితే సరిపోతుందా? అంటారు.. ఇంకోసారి సూపర్ సిక్స్ అమలు చేస్తామని అంటారు. మరోపక్క ఢిల్లీలో కేజ్రీవాల్, ఏపీలో జగన్ మోడల్ సంక్షేమం విఫలమయ్యాయి అనేస్తారు. అలాగే.. సంపద సృష్టించకుండా ప్రజలకు డబ్బు పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడ? అని ప్రశ్నిస్తారు!. ఎన్నికల ముందు సంపద తాను సృష్టించగలనని గంభీర ఉపన్యాసాలు చేసేదీ ఈయనే.. అధికారంలోకి వచ్చాక సంపద ఎలా సృష్టించాలో తన చెవిలో చెప్పండని జనాన్ని అడిగేదీ ఈయనే కావడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో చంద్రబాబు ఒక మాట చెప్పించారు. అదేమిటంటే 'ఒక వ్యక్తికి చేపలు ఇవ్వడం కాదని, చేపల వల ఇవ్వాలి" అనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తారని తెలిపారు. ఏమిటి దాని అర్థం? సంక్షేమ పథకాల వల్ల డబ్బు వృథా అవుతుందనా? ప్రజలకు నగదు పంపిణీ వల్ల నష్టమనే కదా? వీటిని సమర్థించే వారు కూడా ఉండవచ్చు. కానీ.. వారికి షాక్ ఇచ్చే తీరులో ఆ మరుసటి రోజే చంద్రబాబు అందరికన్నా తానే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని ప్రకటించారు. సూపర్‌సిక్స్ సహా హామీలన్నీ అమలు చేస్తానని కూడా ఆయన ప్రకటించేశారు. ఇందుకోసం ఏడాదికి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చువుతుందని అంచనా. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఏటా రూ.70 వేల కోట్లు అవుతూంటేనే విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అందుకు రెట్టింపు మొత్తాన్ని ఇస్తానంటే నమ్మగలమా?. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్షీణించిందని అంటారు. మరి అలాంటప్పుడు అవే విధానాలను కొనసాగిస్తానని చెప్పడమే కాకుండా, జగన్ కంటే ఎక్కువ ఇస్తానని అనేవారా? కాదా? నాలుగుసార్లు సీఎం అయినా ఈ ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ లేదని అంటారు. ఒకసారి పాత రికార్డులు తిరగేస్తే వాస్తవాలు తెలుస్తాయి! 👉1994లో తొలిసారి ఆర్దిక మంత్రి అయిన వెంటనే చంద్రబాబు చేసిన పని ఏమిటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా నాశనం చేసేసిందంటూ శ్వేతపత్రాలు విడుదల చేయడం. ఆ తరువాత ఎన్టీఆర్‌ను సీఎం సీటు నుంచి లాగి పడేశాక కూడా అదే మాట. 👉1996 లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ టైమ్‌లో ఉన్న మద్య నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం మొదలైన వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నడిపి మొత్తం మార్చేశారు. లోక్ సభ ఎన్నికలలో మాత్రం మద్య నిషేధాన్ని కఠినతరం చేస్తామని ప్రచారం చేశారు. 👉2004 ఎన్నికల్లో కూడా ఇదే వ్యవహారం. అప్పటి వరకు విద్యుత్ సంస్కరణల పేరుతో ఛార్జీల పెంపు, 56 ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, జన్మభూమి కింద ప్రజల నుంచి ఆయా పనులకు డబ్బులు వసూలు చేయడం వంటివి చేశారు. ఎన్నికలు వచ్చాక కోటి వరాలు అంటూ ప్రజలకు స్కీములు ప్రకటించారు. 👉2009లో సైతం నగదు బదిలీతోసహా అనేక వాగ్దానాలు చేశారు. టీడీపీ వాగ్దానాల డొల్లతనాన్ని అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ఎండగట్టిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. 2004 నుంచి 2024 వరకు ఎన్ని విన్యాసాలు చేసింది తెలిసిన చరిత్రే. తాను ప్రతిపక్షంలో ఉంటే ప్రజలంతా కష్టాలలో ఉన్నట్లు చెబుతారు. రైతుల రుణమాఫీతో సహా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలని అంటారు. అధికారంలోకి రాగానే అవన్ని వృధా ఖర్చు అని సూక్తులు చెబుతారు. తాజాగా తొమ్మిది నెలల పాలనలో కన్నా, అంతకుముందు ఏడాది జగన్ పాలన(YS Jagan Term)లో ఆర్థికాభివృద్ది రేటు, జీఎస్టీ, జీఎస్డీపీ వంటివి అధికంగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నా, ఆయన మాత్రం తన పంథాలో విధ్వంసం జరిగిందని ఆరోపిస్తారు. అలాగని ఆ విధ్వంసం ఏమిటో వివరిసారా? ఊహూ లేదు!పడికట్టు పదాలతో, కొత్త కొటేషన్లతో జనాన్ని మాయ చేయగలిగితే చాలన్నది ఆయన విధానంగా కనిపిస్తుంది. తాజాగా తల్లికి వందనం(Thalliki Vandanam) పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ప్రకటించారు. చేస్తారో లేదో ఇంకేమి మతలబు పెడతారో తెలియదు. కానీ.. ఏడాది కాలం ఈ పథకాన్ని ఎగవేసిన సంగతి దాచేస్తారు. పైగా మే నెలలో స్కూళ్లు తెరవరు. మరి ఏ ప్రాతిపదికన ఈ పథకానికి ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తారో చూడాలి మరి!. అదే కాదు. ఒక్క ఫించన్లు, అన్న క్యాంటిన్లు, అరకొర ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ తప్ప, మిగిలిన ఏ పథకం కూడా అమలు కాలేదు. వాటికి ఇంతవరకు షెడ్యూలే ఇవ్వలేదు. ప్రతి మహిళకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, రైతు భరోసా రూ.20 వేలు, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తుంగలో తొక్కేశారు. చంద్రబాబు భావన ప్రకారం.. గవర్నర్ స్పీచ్‌లో చెప్పించినట్లుగా అయితే ఈ స్కీములన్నీ చేపలే అవుతాయి. కాని, చేపలు పట్టే వలలు కావు కదా! వాటి మీద క్లారిటీతో చెప్పే ప్రయత్నం చేయరు. ఒకప్పుడు అసలు భారీ ప్రాజెక్టులంటేనే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు. అవి వెంటనే పూర్తి కావని, ఎన్నికలకు ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాని ఎన్నికలకు ముందు భారీ సాగునీటి ప్రాజెక్టులకు మాత్రం జోరుగా శంకుస్థాపనలు చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వదలివేస్తే, అప్పటి విపక్షనేత రాజశేఖర రెడ్డి ఆ ప్రాంతాలకు వెళ్లి పూలు పెట్టి వచ్చారు. తన హయాంలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా సుముఖత చూపని చంద్రబాబు... వైఎస్ చొరవతో ముందుకు వెళ్లిన తరువాత పోలవరం తన కల అంటూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా రూ. 85 వేల కోట్లతో ‘జల్ జీవన్’ మిషన్ కింద స్కీమును, రూ.80వేల కోట్లతో పోలవరం-బనకచర్ల స్కీమును అమలు చేస్తామని చెబుతున్నారు. వీటిలో ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందంటున్నారు. అవి ఎలా ముందుకు వెళుతాయన్నది ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు. సామాన్యుడికి మద్యం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరచవలసిన సీఎం అలా మాట్లాడితే ఎలా? అని విమర్శిస్తున్నారు. ఇక స్వర్ణాంధ్ర, విజన్ 2047, కొత్తగా పీ-4 వంటి అంశాలతో ప్రజలను ఊహాలోకాలలోకి తీసుకువెళ్లడానికి తన ప్రసగంలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ సోషల్ మీడియా యుగం వచ్చాక చంద్రబాబు మాయలన్ని తెలిసిసోతున్నాయి. అదే ఆయనకు సమస్యగా ఉంది. దాంతో సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో హామీలు అమలు చేస్తూ, నిర్మాణాత్మకంగా ప్రగతి వైపు ప్రభుత్వాన్ని నడిపితే సంతోషమే. కానీ ఆయన చేసే మాటల గారడీ రీత్యా ఆ పరిస్థితి కనబడడం లేదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కేంద్రం మూడో విడత ఇస్తోంది.. బాబు సాయం ఏదీ?
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చీరాగానే పీఎం కిసాన్ పథకంపై తొలి సంతకం చేసిన ప్రధాన మంత్రి మోదీ మాట తప్పకుండా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాలుగో రోజునే తొలి విడత సాయం పంపిణీ చేశారు. చెప్పిన సమయానికే రెండో విడతా ఇచ్చారు. ఇప్పుడు సోమవారం మూడో విడత సాయం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కానీ, అదే కూటమితో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం అధికారంలోకి వస్తే ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీని అటకెక్కించేశారు. రైతులను మరోసారి వంచించారు.పీఎం కిసాన్‌లో మొదటి స్థానంలో ఏపీపీఎం కిసాన్ పథకం తొలి విడతలో రాష్ట్రానికి చెందిన 40.91 లక్షల మంది అర్హులకు రూ.834.61కోట్లు కేంద్రం జమ చేసింది. రెండో విడతలో 41.84 లక్షల మందికి రూ.836.89 కోట్లు జమ చేసింది. మూడో విడతలో 42.04 లక్షల మంది అర్హత పొందగా, వీరికి రూ.840.95 కోట్లు జమచేయనున్నారు. ఈ నెల 24న బీహార్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బటన్ నొక్కి ఈ సొమ్ములు జమ చేస్తారు. గత మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందించిన సాయంతో కలిపితే ఇది 19వ విడత సాయం. ఇలా మొత్తం రూ.17,219.45 కోట్ల మేర రాష్ట్ర రైతులు లబ్ధి పొందుతున్నారు. గడిచిన ఐదేళ్లలో పీఎం కిసాన్ అమలులో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్రం ప్రకటించింది.ఆ రూ.1000 కోట్లు దేనికి ఖర్చు చేశారు ?ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం ఇస్తామంటూ సూపర్ సిక్స్‌లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 53.58 లక్షల మందికి రూ.10,717 కోట్లు జమ చేయాల్సి ఉంది. 4 నెలలు ఓటాన్ అకౌంట్‌తో గడిపేసిన టీడీపీ ప్రభుత్వం నవంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించింది. పీఎం కిసాన్ మూడో విడతతో కలిపి అన్నదాత సుఖీభవ ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో కొంతవరకైనా కష్టాల నుంచి గట్టెక్కవచ్చని రైతులు ఎదురు చూశారు. పీఎం కిసాన్ మూడో విడతా అందుతోంది. ఇప్పుడు వచ్చే ఖరీఫ్ నుంచి ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. అలాంటప్పుడు బడ్జెట్లో రూ.1,000 కోట్లు ఎందుకు కేటాయించారు? దేని కోసం ఖర్చు చేస్తారో చెప్పాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇచ్చిన హామీ కంటే మిన్నగా వైఎస్ జగన్ సాయంఏటా మూడు విడతల్లో రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చీ రాగానే ఇచ్చిన హామీకంటే మిన్నగా ఏటా రూ.13,500కు సాయాన్ని పెంచి, తొలి ఏడాది నుంచే పంపిణీ ప్రారంభించి రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రతీ ఏటా మే/జూన్లలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున 53.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ. 34,288.17 కోట్లు జమ చేసి అండగా నిలిచారు.ప్రతి రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సిందేరైతులను మభ్యపెట్టేందుకు బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించిన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆచరణలో పైసా కూడా విదల్చలేదు. ఇలాంటప్పుడు బడ్జెట్లో ఎందుకు కేటాయించారో సమాధానం చెప్పాలి. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రెండేళ్ల సాయం కలిపి ప్రతి రైతుకు రూ.40 వేల చొప్పున జమ చేయాలి. లేకుంటే రైతుల తరపున ఉద్యమిస్తాం.– జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంపెట్టుబడి సాయం అందక అగచాట్లుజగన్ ప్రభుత్వంలో ఏటా సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందేది. ఈ ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం పైసా కూడా సాయం చేయలేదు. దీంతో సాగుకు పెట్టుబడి దొరక్క రైతులు పడరాని పాట్లు పడ్డారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రూ.3 నుంచి రూ.5కు వడ్డీలకు అప్పులు చేసి మరీ సాగు చేశారు. అయినా వైపరీత్యాల బారిన పడి, ఆశించిన స్థాయిలోదిగుబడులు రాలేదు. పంటకు మద్దతు ధరా దక్కక తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే సాయమందించాలి. – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతుల సంఘం -
CBN: మాటలు స్వీటు.. చేతలు చేటు!
వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని ఒకప్పుడు అనేవారు. దీంట్లో వాస్తవం మాటెలా ఉన్నా... రాజకీయాల్లో చంద్రబాబు వంటి వారు చేసే ప్రకటనలకు మాత్రం ఈ సామెతను వర్తింపజేసుకోవచ్చు. ఎందుకంటారా? బాబుగారి ప్రకటనలు ఎప్పుడు ఎలా ఉంటాయో కనిపెట్టడం కష్టమే మరి!. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఆయన చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేస్తూంటారు. వినేవారి మతిపోతుంది ఈ ప్రకటనలు వింటే. కొందరు వీటిని మతిలేని ప్రకటనలని కూడా అంటుంటారు. కాని, ఆయన తెలివిగానే ఎప్పటికి ఏది అవసరమో ఆ మాటలే మాట్లాడుతుంటారు. కొద్ది రోజుల క్రితం ఆయన రెండు ప్రకటనలు చేశారు. సంపద సృష్టి ఎలాగో తనకు చెవిలో చెప్పమన్న ప్రకటన కూడా అలాంటిదే. ఎన్నికలకు ముందు తానే సంపద సృష్టికర్తనని వీర బిల్డప్ ఇచ్చిన ఆయన అకస్మాత్తుగా.. బేలగా.. అదెలా చేయాలో నాకు చెవిలో చెప్పండి అని అడుగుతారని ఎవరైనా ఊహించగలరా?. ఇదొక్కటే కాదు... ఢిల్లీలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నేతలు సంపద సృష్టించకుండా దాన్ని పంచే అధికారం లేదని అన్నారు. అంటే ఏమిటి దీని అర్థం? సబ్సిడీ పథకాలు అమలు చేయరాదని చెప్పడమే కదా!. ప్రజలకు నగదు బదిలీని వ్యతిరేకించడమే కదా! మరి ఇదే చంద్రబాబు(Chandrababu) ఎన్నికల సమయంలో బోలెడన్ని ఉచిత వరాల వర్షం ఎందుకు కురిపిస్తారు? ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా పోతారు?సోషల్ మీడియా యుగంలో అవన్ని వెలుగులోకి వస్తుండడంతో ఆయన ప్రభుత్వం చికాకు పడుతూ ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ ప్రయోగిస్తుంటుంది. మాట మార్చడంలో దేశంలోనే ఒక రికార్డు సాధించిన చంద్రబాబు ఇప్పుడు అసలుకే ఎసరు పెడుతున్నట్లు అనిపిస్తుంది. ఎన్నికల ప్రచారంలో సూపర్‌సిక్స్ అని, ఎన్నికల ప్రణాళిక అని తెగ ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు పలు గందరగోళ ప్రకటనలు చేస్తూ ప్రజలకు పిచ్చెక్కెస్తున్నారనే చెప్పాలి. ఎన్నికలకు ముందేమో సంపద గురించి చెప్పకుండా తాము వస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని ఒకటికి పదిసార్లు ప్రకటించే వారు. తెలుగుదేశం మహానాడు(TDP Mahanadu)లో సూపర్ సిక్స్ హామీల ప్రకటన చేసి 'తమ్ముళ్లూ అదిరిపోయిందా" అంటూ సంబరపడితే ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆహా.. ఓహో అంటూ శరభ.. శరభ అని గంతులేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై శరాలు వదిలారని ప్రచారం చేశాయి. అంతవరకు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల హామీలు అమలులో భాగంగా వివిధ స్కీములలో లబ్దిదారులకు ఆర్థిక సాయం చేస్తుంటే.. బటన్ నొక్కడం తప్ప ఏమి చేస్తున్నారని తప్పుడు కథనాలు ఇచ్చేవారు. మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని, అదేమంత పెద్ద పనా అని వ్యాఖ్యానించారు. తాను ఇంకా ఎక్కువ చేయగలనన్నట్లు బిల్డప్ ఇచ్చేవారు. అంతేకాదు.. రూ.70 వేల కోట్ల మేర స్కీములను అమలు చేస్తేనే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పిన చంద్రబాబు అంతకు రెండు రెట్లు అధికంగా అంటే రూ.1.5 లక్షల కోట్ల విలువైన స్కీములను బటన్ నొక్కడం ద్వారా పేదలకు అమలు చేస్తామని అనేవారు. అదెలా సాధ్యమైని ఎవరికైనా అనుమానం వస్తుందని, ముందుగానే తనకు సంపద సృష్టించే అనుభవం ఉందని దబాయించేవారు. అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి మాటేమో కాని, అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే రూ.80 వేల కోట్ల బడ్జెట్ అప్పులు చేస్తే, బడ్జెట్ తో సంబంధం లేకుండా మరో రూ.40 వేల కోట్లకు పైగా అప్పు చేశారు. పోనీ వీటినేమైనా పేదల కోసం ఖర్చు చేస్తున్నారా? ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి వ్యయం చేస్తున్నారా అంటే అదేమీ లేదు. అభివృద్ది పనులకైనా ఖర్చు పెడుతున్నారా? అంటే అదీ కనపడదు. జగన్ టైంలో వచ్చిన ఓడరేవులు, మెడికల్ కాలేజీల వంటివాటిని ప్రైవేటు పరం చేస్తానంటున్నారు. రాయచోటి వద్ద జరిగిన ఫించన్ల పంపిణీ కార్యక్రమ సభలో ఒక రైతు.. తమకు అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. వర్కవుటు చేస్తున్నామని చెబుతూ, అవి ఇవ్వాలంటే ముందు డబ్బులు సంపాదించాలని, లేదంటే డబ్బు సంపాదించే మార్గం తనకు చెవిలో చెప్పాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు తెలివితేటలతో ఆర్థికంగా ఎదగాలని కూడా ఒక సలహా పారేశారు. ఈ మాత్రం దానికి సూపర్ సిక్స్ అని, ఎంతమంది పిల్లలనైనా కనండి.. వారందరి చదువు కోసం తాను తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున డబ్బు ఇస్తానని ఎందుకు చెప్పారు?.. అని ఎవరికైనా ఒక సందేహం వస్తే అది వారి ఖర్మ అనుకోవాలన్నమాట. ఆ వెంటనే రైతు భరోసా కూడా మూడు విడతలుగా అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండిటిలో ప్రజలు ఏది నమ్మాలి? ఇక ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 'నాకు దేశ అభివృద్ధి, భవిష్యత్తు ముఖ్యం. సరైన అభివృద్ధే సరైన రాజకీయం.., దేశంలో సంపద పెంచకుండా పంచడం సరైనది కాదు" అని సందేశం ఇచ్చారు. దీనిపై చర్చ జరగాలని అంటూ, సంపద సృష్టించకుండా దానిని పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఢిల్లీలో ఆప్ పాలనను విమర్శించి వారి పాలన విఫల ప్రయోగం అని వ్యాఖ్యానించారు. ఇదే చంద్రబాబు 2019లో కేజ్రీవాల్‌ను గొప్ప పాలకుడని, విద్యావంతుడు అని అభివర్ణించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అది వేరే విషయం. ఇప్పుడు సంపద సృష్టించకుండా పంచే హక్కు నేతలకు లేదని అంటున్నారంటే, ఏపీలో ఇప్పట్లో సూపర్ సిక్స్ అమలు చేయలేమని చెప్పడమే అవుతుంది కదా అనే విశ్లేషణ వస్తుంది. ఒకసారేమో తాను చెప్పినదాని కన్నా ఎక్కువే ఇస్తానని అంటారు. మరో సారి డబ్బు ఎక్కడ ఉందని అంటారు. ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలను పెంచబోనని, తగ్గిస్తానని చెబుతారు. అధికారంలోకి రాగానే రూ.15 వేల కోట్ల భారం మోపారు. తాజాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువలను పెంచడం ద్వారా వేల కోట్ల అదనపు ఆదాయం పొందే యత్నం చేశారు. ప్రజలకు సంపద పంచుతానని చెప్పిన చంద్రబాబు వారేదో కాస్తో, కూస్తో సంపాదించుకున్న దానిని ఇలా లాక్కుంటున్నారేమిటని సందేహం రావచ్చు. అదే సంపద సృష్టి అన్న అభిప్రాయం వస్తుందన్న మాట. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష జరిపి.. ప్రజలపై అదనపు భారం మోపలేం అని అన్నారట. మరి ఇప్పటి వరకు వేసిన భారం సంగతేమిటి? అని అడిగే అవకాశం ప్రజలకు ఉండదు. ఏ ఒక్కరు పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలని, అలాగని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని అధికారులకు చెప్పారు. వేధింపులు వద్దని పైకి చెప్పడం బాగానే ఉన్నా, ప్రభుత్వ సిబ్బంది ఏమి చేస్తారో ఊహించుకోవడం కష్టం కాదు. గత ఏడాది జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది చంద్రబాబు పాలనలో ఆదాయం తగ్గింది. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని చంద్రబాబు అంటారు. ప్రజలపై అదనపు భారం మోపలేమని ఆయన అన్నారట. ఇంతకన్నా కపటత్వం ఏమి ఉంటుంది? జగన్ టైంలో తలసరి ఆదాయం పెరిగినా, జీఎస్డీపీ, జీఎస్టీ గణనీయంగా అభివృద్ది చెందినా.. అసలేమీ జరగలేదని చెబుతారు. అదే చంద్రబాబు గొప్పదనం. రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేసుకుంటే ఇప్పుడేమో లక్ష రెండువేల కోట్ల దగ్గరే ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే చంద్రబాబు అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్లే ఈ పరిస్తితి ఏర్పడిందనే కదా అర్థం? అయినా భజంత్రి మీడియా ఉంది కనుక ఏమి చెప్పినా చెల్లుబాటు అయిపోతోంది!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రాబట్టడంలో బాబు సర్కార్ విఫలం
-
ఏమండోయ్ చంద్రలు.. ఏమయ్యాయి హామీలు.. దుమ్మురేపుతున్న కొత్త పాట
-
సూపర్ సిక్స్ కాదు.. సూపర్ సెవెన్ డైవర్షన్స్..
-
హామీలు అమలు చేయకుండా ఆరోపణలా?: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు:తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో అంబటి రాంబాబు శుక్రవారం(ఫిబ్రవరి7) మీడియాతో మాట్లాడారు.‘అధికారంలోకి వచ్చేందుకు కూటమి నేతలు అసత్యాలు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడు వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. హామీల అమలులో 40 ఏళ్ల నారా చంద్రబాబు అనుభవం ఏమైంది. కూటమి పాలనలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాపై ఆరోపణలు చేస్తున్నారు’అని అంబటి రాంబాబు మండిపడ్డారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..కూటమి అసమర్ధ పాలనపై వైఎస్ జగన్ ప్రజలకు వివరించి చెప్పారుప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వివరంగా వివరించారు8 మాసాల కూటమి పాలనలో అన్ని మోసాలు, దాడులు, అరాచకాలే 40 ఏళ్ల అనుభవం కలిగి నాలుగుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు.వైఎస్ జగన్ అమలుకు సాధ్యం కానీ హామీలను ఇవ్వరుచంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా సాధ్యం కాదు అని చెప్తున్నారువైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేక పోతున్నారు..జగన్ హాయంలో 14 లక్షల కోట్ల అప్పులు అని అబద్ధం చెప్పారుబడ్జెట్లో 6 లక్షల కోట్లు అని చూపించారుఎల్లో మీడియా కోసం తప్పుడు లెక్కలు, అబద్ధాలు చెపుతున్నారు2.73 లక్షల కోట్లు డైరెక్ట్ గా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు వైఎస్ జగన్ వేశారు.ఎన్నికల ముందు సంపద సృష్టిస్తా అన్నారుమంచంలో ఉన్న ముసలి ఆమె కూడా నొక్కుతుంది బటన్ అన్నారుచంద్రబాబు ముసలి వాడే కదా బటన్ ఎందుకు నొక్కలేక పోతున్నారుఆయన వల్ల కాకపోతే ఆయన తనయుడు నారా లోకేష్ యువకుడే కదా ఆయనతో నొక్కించ వచ్చు కదా బటన్ఏ మాత్రం ప్రమేయం లేని మిథున్ రెడ్డి గారికి లిక్కర్ స్కాం అంట కడుతున్నారుప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీకు జీతాలు అన్నారుఒక్క నెల మాత్రమే 1వ తేదీ ఇచ్చారుదావోస్ పర్యటనలో ఏపీకి పెట్టుబడులు రాలేదురెడ్బుక్ అంటే పరిశ్రమలు ఎలా వస్తాయికూటమి ప్రజా ప్రతినిధులకు దమ్ము, ధైర్యం ఉంటే నిన్న వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలిటీడీపీ నేతల రాజకీయ బతుకు అంతా అబద్ధాలు, మోసంచెత్త వాగుడు, కారుకూతలు పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలిగుంటూరుకు మూడు ఆర్వోబీలు వచ్చాయి అని గొప్పలు చెపుతున్నారుకాగితాల మీద చాలా అవుతాయి. రియాల్టీ లో అవ్వాలిగ్యారెంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ జ్వరం, వెన్నుపూసలో నొప్పి అని ఇంట్లో పడుకున్నాడుబటన్ నొక్కమంటే విషం కక్కుతున్నాం అంటే ఎలా.రోడ్ల గుంతలు పూడ్చటానికి రూ. 26 వేల కోట్లు అప్పు చేశారు.డొక్కా మీద నేను మాట్లాడాల్సిన అవసరం లేదుపవన్ కళ్యాణ్ నిజంగా సిక్ అయ్యాడా..? షూటింగ్లో ఉన్నాడా తెలీదు.పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు, నారా లోకేష్ మీద అలకపునాడు ఏమో నాకు తెలీదుచంద్రబాబు రెడ్ బుక్ ఓపెన్ చేసిన తరువాత కేసులు నమోదు అవుతాయి.నా మీద ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు -
ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..
-
బాబు మోసాలపై జగన్ నిలదీత : YS Jagan
-
దావోస్‌లో ఒక్క MOU జరగలేదు: వైఎస్ జగన్
-
బాబు సూపర్ సిక్స్ పథకాలు అన్నీ పాయే
-
రాష్ట్ర పరిస్థితులు, ప్రజా సంబంధ అంశాలపై మాట్లాడనున్న వైఎస్ జగన్
-
Big Question: ఎవరిని వదిలిపెట్టను
-
8 నెలలకే ప్రజలకు 70MM సినిమా.. ప్రజలే మీ కాలర్ పట్టుకుని...!
-
కూటమి ప్రభుత్వంలో విద్యార్ధులకు తీవ్ర ఇబ్బందులు
-
సూపర్ సిక్స్ పేరుతో దగా... టీడీపీపై పరీక్షిత్ రాజు ఫైర్
-
చంద్రబాబు బూటకపు హామీలు.. ఏకిపారేసిన పుష్ప శ్రీ వాణి..
-
Big Question: కాలర్ పట్టుకుందాం రండి.. లోకేష్ కోసం వెయిటింగ్
-
Big Question: జగన్ ముందే చెప్పాడు.. బాబుది విజన్ కాదు విధ్వంసం
-
రాష్ట్ర విభజనకు చంద్రబాబు ముఖ్య కారకుడు అయ్యాడు: వేణుగోపాలకృష్ణ
-
‘బాబు మోసాలను పవన్ ప్రశ్నించరా?’
సాక్షి, తూర్పుగోదావరి: పేదల ద్వేషి అయిన చంద్రబాబు నాయుడు.. ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై.. బుధవారం రాజమండ్రిలో వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు.‘‘తల్లికి వందనం, ఫీజు రియింబర్స్‌మెంట్, రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వకుండా అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పినా ఇప్పటిదాకా అది జరగలేదు. ఎందుకు?. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ఎందుకు ఈ విషయాల్లో మౌనంగా ఉన్నారు?. పవన్ కళ్యాణ్ స్పందించాలి... లేదంటే చంద్రబాబు మాయలో పడి మీరు మోసపోయినట్టే.. అలాగే ప్రజల వద్ద నమ్మకమూ కోల్పోతారు.ఖజానా 100 కోట్లు ఉన్న సమయంలోనే నవరత్న పథకాలను వైయస్ జగన్ అద్భుతంగా అమలు చేశారు. రాష్ట్ర ఆదాయం కూడా ఆయన హయాంలోనే పెరిగింది. 7,000 కోట్లు రూపాయలతో ఖజానా మీ చేతిలో పెడితే ఏం చేశారు?. పదిహేను శాతం వృద్ధిరేటు దాటిన తర్వాత సూపర్ సిక్స్ అమలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని స్పష్టమవుతోంది. పోలవరం ,అమరావతి చంద్రబాబు అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి.... చంద్రబాబు ఆస్తులు విలువ పెరుగుతుంది మినహా ప్రజలకు ఒరుగుతున్నది ఏమీ లేదు.ప్రజలు మీరు చెప్పిన హామీలు అమలు చేస్తారని ఎదురు చూస్తున్నారు ... వాటిపై దృష్టి పెట్టండి అని హితవు పలికారాయన.చంద్రబాబు పేదల ద్వేషి. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పింది ఎవరు?. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భూములు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతున్నారు. మీ వాళ్ళు భూములు కొనుగోలు చేసినందుకు మీ స్వార్థం కోసం అమరావతిలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకపోవడం దారుణం అని వేణుగోపాల్ అన్నారు. -
చంద్రబాబూ..ఇంత మోసమా!: అనంతవెంకట్రామిరెడ్డి
సాక్షి,అనంతపురం:ఇచ్చిన అన్ని హామీలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అమలు చేశారని,నవరత్నాలను నిక్కచ్చిగా అమలు చేసిన ఘనత ఆయనదేనని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంతవెంకట్రారామిరెడ్డి అన్నారు. బుధవారం(జనవరి29) ఆయన మీడియాతో మాట్లాడారు.‘సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు చేతులెత్తేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంత మోసం చేస్తారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబుకు అవగాహన లేదా? సూపర్‌సిక్స్ హామీలకు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించాలి.సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు. ప్రజలు అధైర్య పడొద్దు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది’అని అనంతవెంకట్రామిరెడ్డి తెలిపారు.గుమ్మనూరు జయరాం ఆగడాలు పెరిగిపోయాయి‘మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వార్తలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా? ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగడాలు మితిమీరి పోతున్నాయి.ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసులు దాడి చేశారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది.బాధితులపైనే హత్యాయత్నం కేసు కేసులు నమోదు చేస్తున్నారు.టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారు’అని అనంతవెంకట్రామిరెడ్డి ఫైరయ్యారు. -
బాబుపై 420 కేసు !?
-
మోసకారి బాబు.. మళ్లీ ఫెయిల్
-
చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడమంటే బాదుడే.. బాదుడు
-
తల్లులకు వందనం లేదు.. అన్నదాతకు సుఖీభవ లేదు
-
నమ్మి ఓటు వేసినందుకు చంద్రబాబు తన నైజాన్ని చూపించారు: ఇస్సాక్ బాషా
-
మోసకారి చంద్రబాబు
-
సూపర్ సిక్స్ పథకాల అమలుపై చంద్రబాబు చేతులెత్తేయడం సరికాదు
-
చెప్పింది చేయడం నా బ్లడ్ లోనే లేదు
-
పిచ్చి పిచ్చి ఆశలొద్దు.. గెలుపు కోసం ఎన్నో చెప్తాం
-
ఆంధ్రప్రదేశ్ అప్పులు తీర్చే స్థోమత సున్నా స్థాయికి చేరింది చంద్రబాబు పాలనలోనే... తేల్చిచెప్పిన నీతి అయోగ్ నివేదికలు
-
అద్దంలా అంకెలు.. అబద్ధాల రంకెలు!
సాక్షి, అమరావతి: బటన్ నొక్కి డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లకుపైగా ప్రజలకు పారదర్శకంగా అందించిన పాలకుడు విధ్వంసకారుడా? లేక ఐదేళ్లలో ఏమీ చేయకుండా మాటలతో మభ్యపుచ్చి సింగపూర్ గ్రాఫిక్స్ చూపించిన నాయకుడు విధ్వంసకారుడా? ఇచ్చాపురం నుంచి హిందుపురం దాకా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సచివాలయాలు, పది ఉద్యోగాలు, ఆర్బీకేలు, ఆస్పత్రులు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు తీసుకొచ్చిన వ్యక్తి విజన్ ఉన్న లీడరా? లేక 14 ఏళ్లు పాలించినా.. ఆంధ్రప్రదేశ్‌లోని 14 వేల పంచాయితీల్లో ఏ ఊరికి వెళ్లినా.. ఏ ఒక్క పథకమూ గుర్తు రాకుండా.. నాది అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న వారికి విజన్ ఉన్నట్లా?ఒక ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు మూలధన వ్యయం, అప్పుల వృద్ధి తీరును కొలమానంగా పరిగణిస్తారు. ఆ లెక్కలన్నీ చూశాక ఆర్థిక క్రమశిక్షణతో ఎవరు పాలన సాగించారో ప్రతి ఒక్కరూ చెబుతారు. సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న సీఎం చంద్రబాబు వైఎస్సార్ సీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ ఆరోపణలకు దిగారు. కానీ ‘కాగ్’ లెక్కలు, అధికారిక గణాంకాలను ఎవరూ దాచిపెట్టలేదు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడమంటే బాదుడే.. బాదుడు! ఆయన అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. భావి తరాల కోసం గత ప్రభుత్వం సృష్టించిన విలువైన సంపద లాంటి మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రైవేట్‌కు బేరం పెడుతున్నారు. ఇవన్నీ దాచిపెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కన్నార్పకుండా అబద్ధాలు వల్లిస్తున్నారు. 2023–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యధికంగా మూలధన వ్యయం చేసిందని, అయితే దాన్ని వదిలేసి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు చేయాల్సిన పని కాదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో చంద్రబాబు హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో తక్కువగా అప్పులు చేయడమే కాకుండా మూలధన వ్యయం అధికంగా చేసింది. 2022–23లో వైఎస్సార్సీపీ రూ.67,985 కోట్లు అప్పు చేసి మూలధన వ్యయం రూ.7,244 కోట్లు మాత్రమే చేసిందని చంద్రబాబు తప్పుబట్టారు. మరి ఈ ఆర్థిక ఏడాదిలో రూ.73,635.92 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు మూలధన వ్యయం కేవలం రూ.8,894.98 కోట్లే చేసిన విషయాన్ని ఎందుకు దాచి పెడుతున్నారు? ⇒ వైఎస్సార్సీపీ పాలనకు సంబంధించి ఐదేళ్ల గణాంకాలు కాకుండా నాలుగేళ్ల లెక్కలతో సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సామాజిక రంగంలో వైఎస్సార్సీపీ రెట్టింపు మూల ధన వ్యయం చేసింది. ఇక జీఎస్డీపీ వృద్ధి కన్నా వడ్డీ చెల్లింపుల వృద్ధి పెరిగిందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ గత ఐదేళ్ల పాలనలో జీఎస్డీపీలో అప్పుల సగటు వార్షిక వృద్ధి 17.51 శాతం ఉండగా జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ది 13.48 శాతమే ఉందనే విషయాన్ని చంద్రబాబు చెప్పకుండా వదిలేశారు. అంటే 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో అప్పులు తీర్చే స్థోమత లేకుండా చేశారు. బాబు గత పాలనలోనే జీఎస్డీపీ వృద్ధి కన్నా వడ్డీల చెల్లింపు, అప్పుల వృద్ధి ఎక్కువగా ఉంది. ⇒ 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికే అప్పులు తీర్చే పరిస్థితి సున్నాగా ఉందనే విషయాన్ని చెప్పకుండా చంద్రబాబు తనకు అనుకూలంగా అవాస్తవాలను వల్లించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వడ్డీల చెల్లింపు 15.42 శాతం మేర పెరగగా అదే సమయంలో జీఎస్డీపీ వృద్ధి కేవలం 13.48 శాతమే ఉంది. అప్పులు తీర్చే స్థోమత సున్నా స్థాయికి చేరిన విషయాన్ని కావాలనే కప్పిపుచ్చారు. ⇒ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యంతో సాగించిన ఐదేళ్ల చంద్రబాబు దుష్పరిపాలన, కోవిడ్ సంక్షోభం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించాయి. చంద్రబాబు పాలనలో బడ్జెట్ అప్పులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా గ్యారెంటీ ఇచ్చిన అప్పులు, బకాయిలు కలిపి సగటు వార్షిక వృద్ధి 22.63 శాతం ఉండగా... కోవిడ్ సంక్షోభం ఎదుర్కొన్నప్పటికీ వైఎస్సార్సీపీ హయాంలో అప్పుల సగటు వార్షిక వృద్ధి కేవలం 13.57 శాతమే ఉండటం గమనార్హం. దీన్ని కూడా చంద్రబాబు కప్పిపుచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రాష్ట్ర సొంత ఆదాయం తగ్గిపోయిందంటూ.. తన హయాంలోని 2018–19తో ఒక్క ఏడాదితో పోల్చుకుంటూ చంద్రబాబు మసిబూసి మారేడుకాయ చేసేందుకు యత్నించారు. ⇒ ఆర్థిక క్రమశిక్షణ, ద్రవ్య జవాబుదారీ బాధ్యతను చంద్రబాబు హయాంలో గాలికి వదిలేశారు. నిబంధనలు ఉల్లంఘించి.. తదుపరి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక చేయాల్సిన అప్పులను కూడా ముందే చేసేసిన ఆయన నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక సంఘం నిబంధనలకు మించి రూ.31,082 కోట్లు అధికంగా అప్పులు చేయడం గమనార్హం. చంద్రబాబు పాలనలో కోవిడ్ లాంటి సంక్షోభాలేమీ లేకపోయినప్పటికీ అనుమతికి మించి అప్పులు చేయడంతో... అనంతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రుణ పరిమితిని కేంద్రం దాదాపు రూ.17,000 కోట్లు తగ్గించింది. -
సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు మాటమారుస్తున్నారు
-
అయిపాయే.. చేతులెత్తేసిన చంద్రబాబు! (ఫొటోలు)
-
బాబు అబద్ధాల బుద్ధుడు.. లోకేష్ కోసమే సంపద సృష్టి: భూమన
తిరుపతి, సాక్షి: సూపర్ సిక్స్ హామీలపై పచ్చి అబద్ధాలు చెబుతూ కోట్లాది మందిని చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలపై బాబు యూటర్న్ ప్రకటనపై మంగళవారం ఉదయం తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడారు.‘‘చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాజకీయమంతా లాక్కోవడమే. అధికారంలోకి వచ్చాక ప్రజాద్రోహమే చంద్రబాబు నైజం. ఏమాత్రం ప్రజల సంక్షేమం పట్టించుకోరాయన. అలాగే ఇప్పుడూ చంద్రబాబు కోట్లాది మందిని మోసం చేస్తున్నారు. ఎన్నికల ముందు అప్పటి సీఎం జగన్‌పై నిందలు వేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెబుతూ ఆచరణ సాధ్యం కాదని చెబుతూ కపట నాటకం ఆడుతున్నారు. చంద్రబాబు ప్రజా ద్రోహం, ప్రజలకు పొడిచే వెన్నుపోటు ఎలా ఉంటుందో నీతి ఆయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ అమలుకు పరిస్థితి లేదు అని, వృద్ధి రేటు 15% పెంచిన తర్వాత ఆలోచిస్తాను అని చెప్పడం దారుణం. .. చంద్రబాబు మోసపు హామీలు ఒంటి కన్ను నక్క కథ గుర్తుకు వస్తోంది. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేశారు. కరోనా సమయంలో కూడా దేశంలో ఆదర్శంగా పాలన సాగించారు. కానీ, చంద్రబాబు మాత్రం ఒంటి కన్ను నక్కలా ఇప్పుడు హామీల గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఐదు లక్షల ఫించన్లు కట్ చేశారు. విధ్యుత్ చార్జీలు పెంచము అని చెప్పి రూ. 19 వేల కోట్లు ప్రజలు పై విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపారు. తల్లికి వందనం కాస్త.. తల్లికి తద్దినంగా మారిపోయింది. అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పోభవగా మారిపోయింది. ఆడబిడ్డ నిధి పథకం ఆడబిడ్డ ఏడుపు పథకంగా మారిపోయింది. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది.సంప్రదాయ దుస్తుల నిబంధన ఏమైంది?కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పాలనలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు, 4 సార్లు కొండపై ఎర్రచందనం దొరికింది. వీఐపీ దర్శన సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్ళాలి అనే నిబంధన గాలికి వదిలేశారు. విజిలెన్స్ వ్యవస్థ నిద్ర పోతోంది. అదనపు ఈవో వెంకన్న చౌదరి ఏం చేస్తున్నారు?. సనాతన ధర్మ ఉద్యమ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ దీనిపై మాట్లాడాలి.లోకేష్ కోసమే సంపద సృష్టి:రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పాలన సాగుతోంది. ఆయన ఈ ఏడు నెలల పాలనంతా వంచన, మోసం, దోపిడీతోనే సాగింది. తాను సంపద సృష్టిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెబితే, అది లోకేష్ కోసమని జనం గుర్తించలేకపోయారు. బాబు మాటలను గుడ్డిగా నమ్మి మోసపోయారు. అందుకే ఇప్పుడు ప్రజల్లో చంద్రబాబు మీద తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ చరిత్రలో ఇంత తక్కువ కాలంలో వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజల ముందుకు వెళ్లే ధైర్యముందా?. .. చంద్రబాబును మోసిన పవనాందుల వారు ఏం చేస్తున్నారు?. పవనాంద స్వామి ఏ గుడి మెట్లు కడుతుతున్నారు. చంద్రబాబు అబద్ధాల బుద్ధుడు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రజల కోపాగ్నిలో చంద్రబాబు ప్రభుత్వం భస్మం కాకతప్పదు’’ అని భూమన అన్నారు. -
‘సూపర్ సిక్స్’ ఇవ్వలేం
తల్లికి వందనంపై ఇక తర్జన భర్జన లేదు.. 46 లక్షల మంది తల్లులకు షాక్! అన్నదాతా సుఖీభవపై ఆలోచనే అనవసరం.. 54 లక్షల మంది రైతన్నల్లో నిర్వేదం! ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల సాయం గల్లంతే.. 1.80 కోట్ల మంది అక్క చెల్లెమ్మల ఆక్రందన! నిరుద్యోగ భృతి నీటి పాలేనని కోటి మంది యువతలో తీవ్ర ఆందోళన!సూపర్ సిక్స్‌లు.. సెవెన్లు ఇక గాలిలో కలిసినట్లే! ఎందుకంటే.. సూపర్ సిక్స్‌లు కావాలంటే ఏపీ వృద్ధి రేటు 15 శాతానికి పెరగాలి! అందుకే.. విజన్ 2047 డాక్యుమెంట్లను ఇంట్లో భద్రంగా దాచుకోమని తనను నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారు! ప్రెస్ మీట్ సాక్షిగా వారిలో ఏ మూలో దాగిన ఆశలను పటాపంచలు చేశారు!! సాక్షి, అమరావతి: ఇందుమూలంగా ఐదున్నర కోట్ల మంది ప్రజానీకానికి తెలియచేయునది ఏమనగా.. సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామంటూ ఎన్నికల వాగ్దానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులెత్తేశారు! తన మార్కు రాజకీయాన్ని ప్రజలకు మరోసారి రుచి చూపించారు. మోకాలికి బోడి గుండుకు ముడిపెడుతూ.. సూపర్ సిక్స్ హామీలకు, వృద్ధి రేటుకు లంకె పెట్టారు! కేంద్రం ఇస్తున్న డబ్బులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. సంపద సృష్టించి.. ఆదాయం పెరిగితే.. అప్పుడు రైతు భరోసా, తల్లికి వందనం అమలు చేస్తామని వెల్లడించారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాటన పెట్టేందుకు తొమ్మిదేళ్లు పడుతుందో పదేళ్లు పడుతుందో అంతుబట్టడం లేదంటూ కాడి పారేశారు. సూపర్ సిక్స్‌లు.. సెవెన్లు అంటూ ఎన్నికల హామీలతో ఊరించి ఏడు నెలల పాటు దాగుడు మూతలతో నెట్టుకొచ్చిన సీఎం చంద్రబాబు ఎట్టకేలకు ముసుగు తొలగించారు! వాస్తవ పరిస్థితిని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానంటూ తన మనసులో ఎప్పుడో ఆవిష్కృతమైన వాటిని కుండబద్ధలు కొట్టారు. రాష్ట్రాల ఆర్ధిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. అబ్బే... ఇప్పుడు చేయలేం...! రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ఏటా 15 శాతం మేర పెరిగి తద్వారా ఆదాయం, సంపద సమకూరిన తరువాతే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాబడి తగ్గుతోందని.. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల అమలుకు వెసులుబాటు లేదని, అవకాశం ఉంటే ఒక్క నిమిషం కూడా జాప్యం చేయనని చెప్పారు. వృద్ధి రేటు పెరిగి సంపద, ఆదాయం పెరిగితేనే వెసులుబాటు వస్తుందని, అప్పటి వరకు సూపర్ సిక్స్ అమలులో జాప్యం తప్పదని సీఎం స్పష్టం చేశారు. వీటితో మాకేం సంబంధం? బాబు చేస్తారని ఓటు వేశామని, హామీలు అమలు చేయాలనే విధంగా సామాన్య ప్రజలు ఆలోచన చేస్తున్నారని, అందుకే వాస్తవ పరిస్థితిని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానని వెల్లడించారు. నమ్మి ఓట్లు వేశాం కదా..! ఇంకా హామీలను అమలు చేయడం లేదని కొంత మంది ఆలోచన చేస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. డబ్బులున్నాయి కదా..! ఎందుకు అమలు చేయడం లేదు? నమ్మి ఓట్లు వేశాం కదా..! అనే ఫీలింగ్‌లోకి ప్రజలు వెళ్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరానికి రూ.12,150 కోట్లు రాగా, అమరావతికి రూ.15,000 కోట్లు వచ్చాయని, విశాఖ ఉక్కు రివైవ్ (పునరుద్ధరణ)కు రూ.11,114 కోట్లు ఇచ్చిందని, అయితే వాటిని సంక్షేమానికి వ్యయం చేయలేనని చంద్రబాబు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు పడుతుందో.. పదేళ్లు పడుతుందో..! గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నానని, ఇందుకు తొమ్మిదేళ్లు పడుతుందో పదేళ్లు పడుతుందో తెలియడం లేదని, సూపర్ సిక్స్ హామీల అమలుకు లేట్ అవుతుందని చంద్రబాబు చెప్పారు. విశ్వ ప్రయత్నం చేసినా ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి రాలేదన్నారు. ఆర్ధికంగా వెసులుబాటు వచ్చిన తరువాత సంపద సృష్టించడం ద్వారా ఆదాయం పెంచిన అనంతరం సంక్షేమ పథకాలను అమలు చేస్తానన్నారు. అందుకే ప్రజలకు వాస్తవాలు చెబుతూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసింది.. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, మూలధన వ్యయం తక్కువ చేసిందని, దీంతో వృద్ధి తగ్గిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా వృద్ధి రేటు తగ్గిపోయి అప్పులు పెరిగాయన్నారు. రెవెన్యూ మాత్రం పెరగలేదన్నారు. తద్వారా ఏడాదికి రూ.76 వేల కోట్లు నష్టపోతున్నట్లు చెప్పారు. అభివృద్ధిపై డబ్బులు వ్యయం చేయడం ద్వారా 15 శాతం వృద్ధి సాధించే ప్రయత్నం చేస్తున్నానని, తద్వారా సంపద వస్తుందని, దాన్ని సంక్షేమానికి వెచ్చిస్తానని తెలిపారు. శ్రీలంకలా రాష్ట్రం.. ప్రజల కోరికలు తీర్చాలంటే రెవెన్యూ రాబడి పెరగాల్సి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థతో పాటు మిగతా వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నానని, అయితే ఇందుకు ఇంకా సమయం పడుతుందన్నారు. రాష్ట్రం శ్రీలంకలా అవుతోందని గతంలోనే చెప్పానని, ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా రాష్ట్ర ఆరోగ్య సూచికల్లో అదే చెప్పిందన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి జల్సాలు చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అప్పులు తీర్చే స్థోమత కూడా లేకుండా చేసిందన్నారు. కచ్చితంగా వ్యయం చేయాల్సిన వేతనాలు, పెన్షన్లు, వడ్డీల చెల్లింపు, పరిపాలన వ్యయం గత ప్రభుత్వంలో 64.6 శాతానికి పెరిగిందన్నారు. మరో పక్క మూలధన వ్యయం తగ్గిపోయిందన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ఇతర హామీలివీ...⇒ పూర్ టు రిచ్.. పీ–4 పథకాలు అంటూ ఇంతవరకు ఏ ఒక్కటీ ప్రకటించలేదు ⇒ ఏటా జాబ్ క్యాలెండర్ జాడే లేదు ⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను హామీ మేనిఫెస్టోకే పరిమితం. ⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ అమలు చేయలేదు ⇒ ఉద్యోగుల సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు ⇒ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్, డీఏ ప్రకటిస్తామనే హామీని విస్మరించారు ⇒ వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచకపోగా ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడారు ⇒ కాపుల సంక్షేమ కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని బడ్జెట్లో అందుకు తగ్గట్టు నిధులు ఇవ్వలేదు ⇒ విద్యుత్ బిల్లుల భారం తగ్గించకపోగా ఆర్నెల్లలోనే రూ.15 వేల కోట్లకుపైగా చార్జీల భారం మోపారు. ⇒ ఉచితంగా ఇసుక అంటూ పచ్చముఠాల దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు. -
సూపర్ సిక్స్ అమలుపై చేతులెత్తేసిన చంద్రబాబు
సాక్షి,అమరావతి : సూపర్ సిక్స్ అమలుపై సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదని, ఆర్ధిక పరిస్థితి మెరుగుపడ్డాకే పథకాల అమలు చేస్తామని ప్రకటించారు. నీతి ఆయోగ్ రిపోర్ట్‌పై చంద్రబాబు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సూపర్ సిక్స్ అమలుపై చేతులెత్తేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదంటూ మరోసారి అబద్ధాలు చెప్పారు. ఆర్ధిక పరిస్థితి మెరుగపడ్డాకే పథకాల అమలు చేస్తానంటూ చంద్రబాబు మరోసారి మోసానికి తెరతీశారు. ఎన్నికల సమయంలో అప్పులు రూ.14లక్షల కోట్లంటూ ఇదే చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. అప్పులున్నా హామీలు అమలు చేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అమలు చేస్తానంటూ వాగ్ధానం ఇచ్చిన చంద్రబాబు .. ఇప్పుడు అప్పల పేరుతో తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడ వేయడంపై రాష్ట్ర ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చెయ్యలేను చేతకాదు.. ఒప్పుకోలేక తప్పుకోలేక చంద్రబాబు సతమతం
-
కాంతి లేని కూటమి పాలన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి ఏడు నెలల పాలన పూర్తి చేసుకుంది. పాలనపై తనదైన ముద్ర వేయ డానికి ఇది సరిపడ సమయంగానే భావించ వచ్చు. అందునా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి 7 నెలలు గణనీయమైన సమయంగానే పరిగణించాలి. ముందుగా, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలు విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోడానికి ఏమీలేదు. ‘నీకు 15,000... నీకు 15,000’గా పాపులర్ అయిన ‘తల్లికి వందనం’ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి ఇస్తామని తాజగా ప్రకటించి మరో వాయిదా వేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ పథకం మునుపు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’కి పేరు మార్పు పథకం. అంటే, ఉన్న పథకానికి తిలోదకాలు ఇచ్చి కొత్త పథకం ఇవ్వకుండా ‘అప్పు రేపు’ తరహా గోడ మీద రాత గారడీ చేయడమే! ‘దీపం’ పథకాన్ని చంద్రబాబు మార్కు చాకచక్యంతో ముందుగానే అరకొరగా అమలు చేసే ప్రణా ళిక సిద్ధం చేశారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఇస్తాము అన్న హామీపై నోరు మెదపట్లేదు. అలాగే, ప్రతి మహిళకూ సంవత్సరానికి రూ. 18,000 ఇస్తా మంటూ చేసిన వాగ్దానమూ అటకెక్కినట్టే ఉంది. మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉగాదికి అని వస్తున్న వార్తల్లో నిజం ఎంతో వేచి చూడాలి. రైతులకు వాగ్దానం చేసిన సంవత్సరానికి 20 వేల రూపాయల పథకం రేపో మాపో అని దాటేస్తున్నారు – ఇది కూడా గత ప్రభుత్వం ఇచ్చిన పథకమే అయినప్పటికీ వారు ఇచ్చిన రూ. 13,500 కూడా గడచిన సంవత్సరానికి ఇంకా ఇవ్వనేలేదు. వెరసి, ‘సూపర్ సిక్స్’ హమీలలో ఒక్కటి కూడా చిత్త శుద్ధితో అమలు చెయ్యలేదు అనేది సుస్పష్టం.‘నాడు–నేడు’ పథకం ద్వారా పెక్కు ప్రభుత్వ బడులను జగన్ ప్రభుత్వం ఆధునీకరించి, మరుగుదొడ్ల నిర్వహణకై ప్రత్యేక నిధులు కేటాయించి, పిల్లలకి స్వచ్ఛమైన వాతావరణం కల్పిస్తూ అధ్యాపకులకీ, పిల్లల తల్లి–తండ్రులకీ పర్యవేక్షణ అప్పజెబితే, లోకేష్ అధ్యాపకులకు ఉపశమనం పేరిట పర్యవేక్షణ పద్ధతికి తూట్లు పొడిచారు. పేద పిల్లలకు ఇంగ్లీషు చదువు చెప్పించి విప్లవాత్మకమైన మార్పులు జగన్ తెస్తే, మాతృ భాష పేరుతో సదస్సులు పెట్టి తమ అస్మదీయులైన మాజీల నోటితో ఆ పథకానికి తెర దించే కార్యక్రమం మొదలు పెట్టారు. బుడమేరు వరద తీవ్రతను ముందుగానే అంచనా వేయలేక పోవటం, ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించలేకపోవటంలో ప్రభుత్వ అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. అధికార లెక్కల ప్రకారంగానే 45 మంది చనిపోయారంటే ధన, ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోచ్చు. ప్రభుత్వంలో ఉన్నవారే అత్యంత సున్నితమైన తిరుపతి లడ్డూ వివాదానికి తెరలేపటం చాలా దిగజారుడు చర్యగా నిలిచిపోతుంది. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన సనాతన ధర్మ పరిరక్షణ హావభావ కేళి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుంది.పవన్ కల్యాణ్ ప్రతి విషయానికీ గత ప్రభుత్వానిదే బాధ్యత అనడం ఒక రివాజుగా పెట్టుకున్నారు. అది ఎంత చవకబారు స్థాయికి చేరిందో ఇటీవల జరిగిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈవెంట్‌కి వచ్చి రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన ఇద్దరు యువకుల ఉదంతం చెబుతుంది. కనీసం ఆ కుర్రాళ్లు చనిపోయిన రహదారి తీరు ఎలా ఉందో తెలుసుకోకుండా జగన్ రోడ్లు బాగు చేయకపోబట్టే వారు చనిపోయారు అని ఒక ఉప ముఖ్యమంత్రి అనడం సిగ్గు చేటు. మరుసటి రోజు స్వయానా ఆయనే వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన చిత్రాలలో చక్కని రోడ్డు కనిపిస్తూనే ఉంది. పై పెచ్చు యువతను బైక్ స్టంట్లు చేయమని, సైలెన్సర్లు తీసేసి రచ్చ చేయమని ఒక సినీ వేదిక పైనుంచి పిలుపు నివ్వడం అత్యంత హేయమైన చర్య. రాష్ట్రంలో జరిగిన ప్రతిపక్ష కార్య కర్తల బహిరంగ హత్యలు, నేతల అరెస్టులు ఒక ఎత్తయితే, సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టిన వేల కొలది కేసులు బహుశా రాష్ట్ర చరిత్రలోనే కనివిని ఎరుగం. చంద్రబాబు వాగ్దానాలు నీటిమూటలనే విషయం ఇప్పుడు కళ్ళు తెరిచి పరిశీలించగలిగే ఎవరికైనా అర్థమవుతుంది. ‘సూపర్ సిక్స్’ అని హమీ ఇచ్చిన వారికే వాటిపై విశ్వాసం లేదు అనేది ఇప్పుడు అందరికీ విదితమయ్యింది. అయితే, ఇవన్నీ తెలిసే ఈ రాష్ట్ర ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారా? సామాజిక సమీకరణాలే తప్ప ప్రభుత్వ పనితీరు కానీ, వాగ్దానాల అమలుపై నమ్మకం గానీ మన రాష్ట్రంలో ప్రాధాన్యత సంత రించుకోవా? రానున్న కాలం ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. డా‘‘ జి. నవీన్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులుnaveen.prose@gmail.com -
అప్పారావు చిటికెల పందిరి!
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఏడు మాసాలు పూర్తి చేసు కొని ఎనిమిదో నెలలో ప్రవేశించి ఓ వారం గడిచిపోయింది. అష్టమంలోకి బుధుడు ఎంట్రీ ఇచ్చినట్టున్నాడు. గణాంకాలూ, లెక్కలూ వగైరా సబ్జెక్టులు బుధ గ్రహం పోర్టుఫోలియోలని చెబు తారు. అవసరమున్నా లేకపోయినా సరే ఈ మధ్య ముఖ్య మంత్రి సంపద సృష్టి లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు. ఇలా ఆర్థిక శాస్త్ర అధ్యాపకుని అవతారం ఎత్తడం వెనుక ఆయన మనో భావాలేమిటో గ్రహించాలి.కొత్త ప్రభుత్వ పనితీరును మొదటి ఆరు మాసాలపాటు జనం పెద్దగా పట్టించుకోరని మన రాజకీయ నాయకులు అభిప్రాయపడతారు. ఏడో నెల నుంచి మాత్రం నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. అందుకే కొత్త ప్రభుత్వాలకు తొలి ఆరు నెలలు ‘హనీమూన్ పీరియడ్’ అనే ముద్దుపేరును తగిలించుకున్నారు. ఆ మురిపాల కాలం కరిగిపోయి ఐదు వారాలైంది. జనం ప్రశ్నించడం మొదలైంది. వీధుల్లోకి రావడం కూడా ప్రారంభమైంది. జనం దృష్టి మళ్లింపు ఎత్తుగడలతో నెట్టుకురావడం ఇక కుదరదు. ఏదో ఒకటి చెప్పాలి. ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. ఎందుకు ఇంకా అమలు చేయడం లేదో విడమర్చి వివరించాలి.ఎన్నికలకు ముందు మూడు పార్టీల కూటమి ఎడాపెడా చేసిన వాగ్దానాల సంగతి తెలిసినదే! వాటిలో ఓ ఆరింటిని అతి ప్రధానాంశాలుగా గుర్తించి ‘సూపర్ సిక్స్’ పేరుతో తక్షణం అమలు చేస్తామని ఊదరగొట్టిన వైనమూ తెలిసినదే! ‘సూపర్ సిక్స్’లో భాగంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామనీ, నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామనీ హామీ ఇచ్చారు. ఒక ఇంటిలోంచి ఎంతమంది విద్యార్థులు బడికెళ్తే అంతమందికీ ఏటా రూ.15 వేలు ఇచ్చి ఆ తల్లికి వందనం చేస్తామన్నారు. ప్రతి రైతుకూ ఏటా ఇరవై వేల పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లన్నారు. మహిళలందరికీ ఉచి తంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ నెలకు 15 వందల రూపాయలిస్తామన్నారు.ఎనిమిదో నెల వచ్చినా ఇందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆరింటిలో ఆర్థిక భారం పెద్దగా పడని గ్యాస్ సిలిండర్ల హామీని తీసుకొని పాక్షికంగా అమలు చేశారు. మూడుకు బదులు ఒకే సిలిండర్‌ను తొలి ఏడాదికి పరిమితం చేశారు.రెండో సంవత్సరం నుంచైనా మూడు సిలిండర్లిస్తారో ఒక్కదాని తోనే సరిపెడతారో చూడాలి. మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో అతి ప్రధానమైనవిగా ఎంపిక చేసుకున్న ‘సూపర్ సిక్స్’కే ఈ గతి పడితే మిగిలిన వాటి సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు.ఎకనామిక్స్ పాఠాల ప్యాకేజీలో భాగంగా ఎన్నికల హామీలను తాము అమలు చేయబోవడం లేదనే సంగతిని నర్మగర్భంగా చంద్రబాబు చెప్పేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) తొలి అంచనాల పేరుతో మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు ఓ క్లాస్ తీసుకున్నారు. పవర్ పాయింట్ ద్వారా ఓ పది పదిహేను గణాంకాల టేబుళ్ళను ప్రదర్శించారు. ఈ సంవ త్సరం జీఎస్డీపీ పెరుగుదల రేటు 12.94 శాతంగా ఉండ బోతున్నదని జోస్యం చెప్పారు. ఈ అంచనాకు ఆధారమేమిటో ఆయన చెప్పలేదు.ఈ జోస్యం ఇంతటితో ఆగలేదు. ఆయన వేసిన చిటికెల పందిరి ఆకాశం దాకా ఎగబాకింది. ఏటా పదిహేను శాతం చొప్పున జీఎస్డీపీ పెరుగుతూ పోతే 2047 నాటికి 2.74 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందనీ, తలసరి ఆదాయం 58,14,916 రూపాయలకు పెరుగుతుందనీ చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఎదిగినా డాలర్ కూడా ఇంకా బలపడుతుందట! అది కూడా ఆయనే చెప్పారు. 2047 నాటికి డాలర్ విలువ 127 రూపాయలుగా ఉండ బోతున్నదట! వచ్చే సంవత్సరం తమ పిల్లల్ని అమెరికా చదువులకు పంపించాలనుకునే వాళ్లు అప్పటికి డాలర్ రేటు ఎంతుంటుందోనని కంగారుపడే అవసరం లేదు. చంద్రబాబు సర్కార్‌ను సంప్రదిస్తే తెలిసిపోతుంది. వారికి డాలర్ జ్యోతిషం తెలుసు.ఈవిధంగా ఏటా 15 శాతం చొప్పున జీఎస్డీపీ పెరుగుతూ పోతే ఈ ఐదేళ్లలో 4 లక్షల 35 వేల కోట్ల రూపాయల కొత్త అప్పులు చేయవచ్చట! వాటి ఆధారంగా సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చనే చావు కబురు చల్లగా చెప్పారు. ‘ఈ సంవ త్సరం మంచి వర్షాలు కురవాలి. అతివృష్టి, అకాల వర్షాలు ఉండరాదు. పశు, పక్ష్యాదుల దాడి ఉండకూడదు. పంట తెగుళ్ల బారిన పడకూడదు. మంచి దిగుబడి రావాలి. అద్భుతమైన ధర మార్కెట్లో పలకాలి. అప్పుడు తప్పకుండా విందు చేసుకుందాం’ అనే సందేశాన్ని ఆయన సంక్షేమ పథకాల అమలుకు వర్తింపజేశారు.ఇటువంటి పాలకులను ఉద్దేశించే కావచ్చు – వందేళ్ల క్రితమే సుప్రసిద్ధ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ చెప్పిన ఒకమాట ప్రసిద్ధ కొటేషన్‌గా మారింది. ‘‘ఇన్ ద లాంగ్ రన్ వి ఆర్ ఆల్ డెడ్’’. సుదూర భవిష్యత్తులో మనమంతా విగత జీవులమే అనే మాటను తక్షణ సమస్యల పరిష్కారం అవసరాన్ని పాలకులకు చెప్పడం కోసం వాడారనే అభిపాయం ఉన్నది. ఇప్పుడు పరి ష్కారం కావలసిన ఆర్థిక సమస్యలను భవిష్యత్ మార్కెట్ పరిస్థితులు పరిష్కరిస్తాయని నమ్మేవారిపై కీన్స్ వేసిన సెటైర్‌గా దాన్ని చెబుతారు. ఇది మన ఏపీ సర్కార్‌కు బాగా నప్పుతుంది.చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రపంచ బ్యాంకు ఇచ్చే నివేదికలను సైతం ఆయన లెక్కలోకి తీసుకోవడం లేదని పిస్తున్నది. గ్లోబల్ ఎకానమీ మీద ఈ జనవరిలోనే ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ శతాబ్దపు తొలి క్వార్టర్ (2000–2025) ఇచ్చినంత ఉత్తేజం ఆర్థిక రంగానికి రెండో క్వార్టర్ (2026–2050) ఇచ్చే అవకాశం లేదని ఈ నివేదిక అభిప్రాయపడింది. గ్లోబల్ జీడీపీ పెరుగుదల రేటు 2.7 శాతంగానే ఉండబోతున్నట్టు ఇది అంచనా వేసింది. రెండు ఖండాల్లో యుద్ధాలు, పెద్ద దేశాలు అవలంబిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతున్నాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, దక్షిణాసియా ప్రాంతాల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండొచ్చనీ, ఆ యా ప్రాంతాల్లోని స్థానిక విని మయ మార్కెట్లు బలపడడం అందుకు కారణమనీ ఈ నివేదిక పేర్కొన్నది.దక్షిణాసియా దేశాల్లో స్థానిక వినిమయ మార్కెట్లు బలపడుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆ అవకాశం లేకుండా చంద్ర బాబు హరించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి ఆరు మాసాల్లో తగ్గిపోయిన జీఎస్టీ వసూళ్లే అందుకు నిదర్శనం. ఏటికేడు పెరుగుతూ వస్తున్న జీఎస్టీ వసూళ్లు చంద్రబాబు తొలి ఆరు నెలల కాలంలో తొలిసారిగా నేల చూపులు చూస్తూ వచ్చాయి. లిక్కర్ అమ్మకాల పుణ్యమా అని ఒక్క అక్టోబర్ మాసంలోనే కొంత ఎదుగుదల నమోదైంది. ఈ జీఎస్టీ లెక్కలు చంద్రబాబు చెబుతున్న ఆకాశ రామన్న లెక్కలు కావు. స్వయానా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే లెక్కలివి. ఒకపక్క ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో సాక్ష్యాధారాలతో కనిపిస్తున్నది. కానీ జీఎస్డీపీ పెరుగుదల మాత్రం తారాజువ్వలను తలదన్నేలా ఉంటుందని చంద్రబాబు విడుదల చేసిన ఆకాశ రామన్న లెక్కలు చెబుతున్నాయి. ఇదెలా సాధ్యమవుతుందో చెప్పడం తలపండిన ఆర్థికవేత్తలకు కూడా సాధ్యం కాకపోవచ్చు.చంద్రబాబు తొలి ఆరు మాసాల కాలంలో రాష్ట్ర ప్రభు త్వానికి తన సొంత ఆదాయ మార్గాల ద్వారా వచ్చే ఆదాయంలో 1.69 శాతం క్షీణత నమోదైంది. అక్టోబర్‌లో లిక్కర్ వేలంపాటల ఆదాయం ఆదుకోకపోయి ఉంటే ఈ క్షీణత ఇంకా ఎక్కువే ఉండేది. అంతకుముందు సంవత్సరం (2023) అదే నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 12.19 శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలంటే ఏముంటాయి? జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సేల్స్ ట్యాక్స్ (పెట్రోలియం ఉత్పత్తులు ఈ కేటగిరీలో వస్తాయి), మైనింగ్ వగైరా పన్నేతర ఆదాయం... ప్రధానంగా ఇవే! ఈ వసూళ్లు క్షీణించడమంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నట్టు అర్థం. ఈ వసూళ్లలో వృద్ధి కనిపిస్తేనే జీఎస్డీపీలో ఎదుగుదల కనిపిస్తుంది.చంద్రబాబు మొదటి ఐదేళ్ల (2014–19) కాలంలో దేశ జీడీపీలో ఏపీ వాటా 4.45 శాతంగా ఉంటే వైఎస్ జగన్ హయాంలో (2019–24) 4.82 శాతంగా నమోదైంది. ఈ లెక్కలను చంద్రబాబు ప్రెజెంటేషన్‌లో కూడా దాచిపెట్ట లేకపోయారు. వాస్తవాలు ఇలా ఉంటే జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందనే దగుల్బాజీ ప్రచారాన్ని ఇంకా కొనసా గిస్తున్నారు. ఒకపక్క పరిపాలనా వైఫల్యం, దివాళా తీస్తున్న ఆర్థిక రంగం, మరోపక్క ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను దారుణంగా వంచించడం... వీటి నుంచి దృష్టి మళ్లించడానికి తప్పుడు ప్రచారాలనూ, హెచ్చుల ‘విజన్’లనూ బాబు సర్కార్ ఆశ్రయిస్తున్నది.ఏడు మాసాల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించామని డప్పు వేసుకోవడం ఒక వంచన. 1 లక్షా 85 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చంద్రబాబు చెబుతున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలపై జగన్ ప్రభుత్వ హయాంలోనే సంతకాలు పూర్తయ్యాయి. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కథ కూడా ఇంతే! కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఆ ఘనతను తన ఖాతాలోనే వేసుకొని ప్రచారం చేసుకుంటున్నది. తాజాగా విశాఖ ఉక్కు విషయంలోనూ ఇదే తంతు. కేంద్రం చేత 11 వేల కోట్లు విడుదల చేయించి తాము ఘనకార్యం చేశామనీ, ప్రైవేటీకరణ ఆగిపోయిందనీ కూటమి నేతలు ప్రచారం చేసు కుంటున్నారు. కానీ ఈ ప్రకటన చేసిన కేంద్ర మంత్రి కుమార స్వామి చెప్పిన విషయాన్ని మాత్రం యెల్లో మీడియా మరుగున పడేసింది. జగన్మోహన్రెడ్డి అడ్డుకున్నందు వల్లనే ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఆయన మీడియా సమక్షంలోనే కుండబద్దలు కొట్టారు.కేంద్రం ఆర్థిక సాయాన్నయితే ప్రకటించింది గానీ ప్రైవేటీ కరణను ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదు. కార్మిక సంఘాల ఇతర ప్రధాన డిమాండ్లయిన సొంత గనుల కేటాయింపు, ‘సెయిల్’లో విలీనంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవేమీ లేకుండా 26 వేల కోట్ల అప్పులున్న సంస్థకు 11 వేల కోట్లు సాయం చేస్తే అప్పులూ, బకాయిలూ తీర్చి, సామర్థ్యాన్ని పెంచుకొని భారీ ఉత్పత్తులు సాధించి లాభాల బాటలో పయనిస్తుందా? పోలవరం, బనకచర్ల వంటి అంశాల్లోనూ మోసపూరితమైన తప్పుడు ప్రచారాలే! ఇటువంటి నయవంచనను ప్రతిఘటించవలసిన బాధ్యత కేవలం ప్రతిపక్ష రాజకీయ పార్టీలదే కాదు – విద్యాధి కులు, మేధావులు, ప్రజా సంఘాలది కూడా! అప్పుడే మన ప్రజాస్వామ్యం పరిణతి చెందినట్టు! లేకపోతే అప్పుల అప్పా రావులు వేసే చిటికెల పందిళ్లు ఎప్పటికి పూర్తవుతాయోనని కళ్లప్పగించి చూస్తూ ఉండాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రంగురంగుల మేనిఫెస్టోలతో చంద్రబాబు జనాన్ని మభ్యపెడతారు: కాకాణీ
-
లోకేష్ కు ఝలక్ ఇచ్చిన మహిళలు
-
చేసిన అభివృద్ధి జీరో.. బాబును ఏకిపారేసిన గడికోట శ్రీకాంత్
-
మంత్రి లోకేశ్‌ను నిలదీసిన మహిళలు
-
సీజ్ ద సూపర్ సిక్స్.. 2025లో చంద్రబాబు రిజల్యూషన్..
-
Chandrababu: సూపర్ సిక్స్ కు ఎగనామం
-
సూపర్ సిక్స్‌కు చంద్రబాబు ఎగనామం
తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టేశాం! అసలు పథకాన్నే ఎగరగొడదాం..! రైతు భరోసా రెండుసార్లు ఎగనామం.. ఈసారి కేంద్రం ఇచ్చాక చూద్దాం..! ఆడబిడ్డ నిధి అబ్బే..! మనకు ఇప్పుడు అసలా ఆలోచనే లేదు! ఉద్యోగులు, నిరుద్యోగులు ఆ ఊసే మరిచిపోదాం!! సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనూ కేబినెట్ సాక్షిగా సూపర్ సిక్స్ హామీలకు కూటమి సర్కారు ఎగనామం పెట్టింది. తల్లికి వందనం నుంచి అన్నదాతా సుఖీభవ దాకా.. ఆడబిడ్డ నిధి నుంచి ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్.. నిరుద్యోగులకు భృతి వరకు ఇదే తీరు!! కొత్త ఏడాది కోటి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్న తల్లులు, రైతన్నలు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మళ్లీ నిరాశ మిగిలింది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్.. సెవన్ అంటూ ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు పీఠం ఎక్కిన తరువాత వాటిని పూర్తిగా ఎగ్గొట్టేశారు. సూపర్ సిక్స్ సహా ఇతర హామీలను అటకెక్కించి తొలి ఏడాది గడిపేశారు. కొత్త సంవత్సరంలోనూ నిర్దిష్టంగా ఏమైనా ప్రకటిస్తారనుకున్న వారికి నిరాశే మిగిలింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో హామీల అమలుపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేదు. కేబినెట్లో చర్చించారని మంత్రి ప్రకటించడం ప్రజలను మోసగించడమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంతో 87.42 లక్షల మంది విద్యార్ధులు ఒక్క ఏడాదే రూ.13,112 కోట్ల మేర నష్టపోయారు. 54 లక్షల మంది రైతన్నలు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందకపోవడంతో రూ.10,000 కోట్ల మేర నష్టపోయారు. కోటి మందికిపైగా యువత నిరుద్యోగ భృతి కోసం.. ‘ఆడబిడ్డ నిధి’ కోసం 1.80 కోట్ల మంది మహిళలు పడిగాపులు కాస్తుంటే నూతన ఏడాది నిర్వహించిన తొలి మంత్రివర్గ భేటీలో ఒక్క సానుకూల ప్రకటన కూడా చేయలేదు. వాటిని అమలు చేసే ఉద్దేశం లేకపోవడం వల్లే ప్రభుత్వం సాగదీస్తోందని, ఎన్నికల హామీలను నమ్మి తాము మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అదే జగన్ అధికారంలో ఉండి ఉంటే ఈ సమయానికి ఏ పథకాల కింద, ఎంత లబ్ధి చేకూరేదో బేరీజు వేసుకుంటున్నారు. గత ఐదేళ్లూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ఇంటి వద్దకే వైఎస్ జగన్ చేరువ చేశారు. ఏటా ఏప్రిల్‌లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మే నెలలో విద్యా దీవెన, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా.. జూన్‌లో అమ్మ ఒడి.. జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు.. ఆగస్టులో విద్యా దీవెన, నేతన్న నేస్తం.. సెప్టెంబర్‌లో చేయూత.. అక్టోబర్‌లో రైతు భరోసా.. నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు సున్నా వడ్డీ రుణాలు.. డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టారు.అమ్మ ఒడి ఆగిపోయి.. తల్లికి వందనం లేక!పేదరికం చదువులకు అడ్డు కాకూడదని, పేదింటి తలరాతలను మార్చే శక్తి విద్యకే ఉందని దృఢంగా నమ్మిన మాజీ సీఎం వైఎస్ జగన్ ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలను పాఠశాలలు, కాలేజీలకు పంపిన తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేల చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. విద్యా రంగ సంస్కరణకు ఐదేళ్లలో దాదాపు రూ.73వేల కోట్లు వ్యయం చేసిన వైఎస్ జగన్ ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా తల్లులకు అందించి పిల్లల చదువులకు భరోసా కల్పించారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. తొలిసారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌లోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)తో డిజిటల్ బోధన ప్రారంభించారు. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లీషు మీడియం చేయడంతో పాటు సీబీఎస్సీతో ఆపకుండా.. ఏకంగా ఐబీ వరకు ప్రయాణం దిశగా అడుగులు వేశారు. రోజుకొక మెనూతో రుచికరంగా గోరుముద్ద అందించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని విద్యా సంస్కరణలను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారు ఐబీ, సీబీఎస్ఈ, టోఫెల్‌ను రద్దు చేసి.. తల్లికి వందనం పథకంపై చేతులెత్తేసింది. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తామన్న హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. తొలి ఏడాది దీన్ని అమలు చేయకుండా పిల్లల చదువులను నీరుగార్చిన కూటమి సర్కారు అసలు పూర్తిగా పథకాన్నే ఎత్తివేసే దిశగా వ్యూహం రచిస్తోంది. అన్నదాతలకూ ఎగనామమేకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని రెండు వ్యవసాయ సీజన్లు గడుస్తున్నా అందించలేదు. రైతు భరోసా పేరును అన్నదాతా సుఖీభవగా మార్చడం మినహా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అమలు చేయలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇప్పటికే రైతులకు రెండు విడతలు ఆర్థిక సాయం అందించడం గమనార్హం. చంద్రబాబు సర్కారు ఆ రెండు విడతలూ అన్నదాతలకు సాయం అందించకుండా ఎగనామం పెట్టింది. కేంద్రం తదుపరి ఇచ్చే వాటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాపై ఆలోచన చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. అన్నదాతా సుఖీభవ కోసం 54 లక్షల మంది అన్నదాతలకు రూ.10వేల కోట్లకుపైగా అవసరం కాగా, బడ్జెట్లో రూ.1,000 కోట్లు మాత్రమే విదిలించడం గమనార్హం. ఇంతవరకు పథకం విధివిధానాలే ఖరారు చేయలేదు. ఇక ఖరీఫ్ 2023 సీజన్‌కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. సున్నా వడ్డీ రాయితీ ఊసే లేదు. రబీ సీజన్లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు సేవా కేంద్రాలను (ఆర్బీకేలు) చంద్రబాబు నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేశారు. కాగా రైతులకు రైతు భరోసా పథకాన్ని మరుసటి ఏడాది నుంచి అమలు చేస్తామని వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ తొలి కేబినెట్లోనే నిర్ణయం తీసుకుని తొలి ఏడాది నుంచే వైఎస్ జగన్ అమలు చేశారు.జాడలేని ఆడబిడ్డ నిధి..19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలందరికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సహాయం అందచేస్తామని సూపర్ సిక్స్‌లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ పథకాన్ని నెరవేర్చే ఉద్దేశం కానరాకపోవడం, మంత్రివర్గ సమావేశాల్లో కనీసం చర్చించకపోవడంతో 1.80 కోట్ల మంది మహిళలు మోసపోయినట్లు గ్రహిస్తున్నారు.ఉచిత గ్యాస్‌లోనూ మాయఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు జిమ్మిక్కులతో మహిళలను మోసం చేశారు. ఈ ఏడాది రెండు సిలిండర్లకు కోత పెట్టారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చే పరిస్థితి ఉంది.మత్స్యకారులనూ ముంచారు..గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయానికి చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. దీంతో 1.30 లక్షల మత్స్యకారులు ఇప్పటికే రూ.260 కోట్లు నష్టపోయారు. ఇప్పుడు ఏప్రిల్‌లో సాయం అందించడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు చెబుతోంది. అయితే పథకం అమలుపై కచ్చితమైన ప్రతిపాదనలు, నిర్ణయాలు మాత్రం జరగలేదు. విధివిధానాలు ఖరారు చేయలేదు. కేవలం చర్చలు, ఆలోచనలతోనే సరిపుచ్చారు. వైఎస్ జగన్ చెప్పిన మాట మేరకు అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచే మత్స్యకార భరోసాను అమలు చేశారు.ఉద్యోగుల ప్రయోజనాలపై చర్చలేదుఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచినా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యను పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.బాలాజీ జీవీ సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి నెలా మంత్రివర్గం సమావేశాలను నిర్వహిస్తున్నా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై ఎలాంటి చర్చలు లేవన్నారు. పీఆర్సీ అమలుకు కమిటీని నియమించాలిఏపీటీఎఫ్ అమరావతి 12వ పీఆర్సీ అమలు కోసం కమిటీని నియమించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన సంవత్సరంలోనైనా డీఏ ప్రకటిస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. తల్లులకు మోసం వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం తల్లికి వందనం పథకం ద్వారా ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ.15వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకం ఈ ఏడాది ఇవ్వడం లేదని మంత్రివర్గ సమావేశంలో ప్రకటించి తల్లులను దగా చేసిందన్నారు. అమలు చేయకుంటే ఆందోళనఎస్ఎఫ్ఐ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్, ఎ.అశోక్ గురువారం ఓ ప్రకటనలో ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం అమలు చేయకపోతే ఆందోళన చేస్తామన్నారు.ఉద్యోగులకు మొండిచెయ్యిచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి సారించలేదు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, కూటమి ప్రభుత్వం రాగానే వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చింది. సీపీఎస్/జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని వాగ్దానం చేసింది. ఇంతవరకూ ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఏర్పాటుతోపాటు కమిషనర్‌ను నియమించింది. అయితే చంద్రబాబు సర్కారు కమిషనర్‌తో రాజీనామా చేయించింది. ఇక పీఆర్సీ కమిషన్ గురించి అసలు పట్టించుకోవడమే లేదు. ఉద్యోగుల సమస్యల్లో ఒక్కటి కూడా పరిష్కరించలేదు. ఇందుకు భిన్నంగా వైఎస్ జగన్ తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ఇప్పుడు 7 నెలలైనా ఐఆర్ గురించి చంద్రబాబు అసలు పట్టించుకోవడమే లేదు. గత సర్కారు ఉద్యోగుల సమస్యలపై సీఎస్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పరిష్కరించగా, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఊసే మరిచింది.నిరుద్యోగికి నయవంచన..యువతకు ఉద్యోగాలు, లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నెలకు రూ.4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి రూ.57,600 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో ఇందుకు పైసా ఇవ్వలేదు. క్యాబినెట్లో కనీసం చర్చించలేదు. దీంతో నిరుద్యోగ భృతి హామీకి నీళ్లు వదిలినట్టయ్యింది.కొత్తవి లేవు.. అన్నీ రద్దులేతాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతోపాటు గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతానంటూ ఉగాది సందర్భంగా ఇచ్చిన హామీని చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పలికి 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారు. ఇక 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీ బూటకంగా మారింది.ఉద్యోగుల ఆశలపై నీళ్లు..కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఉద్యోగుల గురించి ఆలోచించడం లేదని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని గురువారం మీడియాతో పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక్క డీఏ కూడా ఇవ్వలేదన్నారు. ఐఆర్ ఇవ్వలేదని, డీఏ, జీపీఎస్ బకాయిలు, ఈఎల్స్ సరెండర్ బకాయిలు చెల్లించలేదన్నారు. రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త కమిషనర్‌ను ఇంతవరకు నియమించలేదన్నారు. కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో తాము ఒత్తిడి చేయకుండా వేచి చూశామని, కానీ నెలలు గడుస్తున్నా ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. 2019లో గత ప్రభుత్వం జూలై 1 నుంచే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిందని వెంకట రామిరెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కూడా అలాగే ఇస్తారని ఉద్యోగులు నమ్మారన్నారు. ప్రతి కేబినెట్ సమావేశంలోనూ ఐఆర్ ఇస్తారని ఎదురు చూస్తూ వస్తుంటే ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. గత ప్రభుత్వం రెండు మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించిందన్నారు. సాధ్యం కాకుంటే కనీసం తమకు చెప్పేదన్నారు. పెండింగ్ బకాయిలు దశలవారీగా ఎప్పుడు ఎంత చెల్లిస్తారో పారదర్శకంగా చెప్పేవారన్నారు. ఇప్పుడు అది కూడా లేదన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో అధికారికంగా ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కానీ, ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఉద్యోగులను పిలిచి మాట్లాడడం గానీ జరగలేదన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వేధించడం మొదలు పెట్టిందన్నారు. సచివాలయంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ అధికారులు ఆరుగురిని ఎలాంటి కారణాలు లేకుండా బదిలీ చేసి ముగ్గురికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నట్లు చెప్పారు. ఒక డీఏ ఇవ్వాలని, వెంటనే పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలని కోరారు. -
బాబుకది షరా మామూలే!
బాబుకది షరా మామూలే! ‘‘చంద్రబాబూ..కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంలో నీకు నీవే సాటి’’ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడిని ఉద్దేశించి తరచూ చేసిన వ్యాఖ్య ఇది. 1999-2004 మధ్యకాలంలో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్ విపక్ష నేత అన్నది తెలిసిన విషయమే. ఆ తర్వాత ఐదేళ్లు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు విపక్ష నేతగా బాబు ఉన్నారు. ఈ సమయంలో ఆయా సందర్భాలలో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలేవి. వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్నిసార్లు టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను, బాబు చేసిన ప్రకటనల్లోని అబద్ధాలను వేలెత్తి చూపుతూండేవారు. ‘‘అబద్దాలు చెప్పకపోతే తల వెయ్యి ముక్కలవుతుంది అని శాపం ఉంది’’ అని కూడా వైఎస్సార్ ఎద్దేవ చేసేవారు. కానీ చంద్రబాబు మాత్రం తనదైన ధోరణిలోనే ప్రసంగాలు సాగిస్తుండేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అసత్యమైనా తన అవసరానికి తగ్గట్టు మాట్లాడేవారని చెప్పాలి.ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అబద్ధాలు చెప్పి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు ఎక్కువసార్లు సఫలమయ్యారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఆ తరువాత ఇంకో మాట మాట్లాడటం విషయంలో ముప్పై ఏళ్ల క్రితం మాదిరిగానే ఇప్పుడూ బాబు ఉన్నారు. అబద్దాల విషయంలో స్థిరత్వం పాటించిన నేత అన్నమాట! చంద్రబాబు తాజా ప్రసంగం ఒకటి వింటే ఔరా అనిపిస్తుంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను తెగ ఊరించిన ఆయన వీటితోపాటు మేనిఫెస్టోలో మరో 175 హామీలు ఇచ్చారు. అధికారంలోకి రావడంతోనే అమలు చేస్తామని, సంపద సృష్టించడం తనకు తెలుసు అంటూ నమ్మబలికారు. లోకేష్, పవన్కళ్యాణలు కూడా బాబు వాగ్ధానాలను ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చారు. సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు అవుతాయా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రబాబు... ‘‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’’ అని ప్రకటించేశారు. అరె... తమకు తెలియకుండా అన్ని హామీలెప్పుడు అమలు చేశారబ్బా అని ముక్కున వేలేసుకోవడం ప్రజల వంతైంది. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలు బాగా పనిచేశాయంటే అర్థం చేసుకోవచ్చు. అవి ఉత్తుతివే అని అందరూ అనుకుంటున్నప్పుడు ఎన్నికల సంగతి ఎవరూ ప్రస్తావించరు. అందుకే హామీలన్నీ అమలు చేసేశామన్న భ్రమ కల్పించేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారని అనుకోవాలి. అయితే వృద్ధుల ఫించన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం మినహా మరే ఇతర హామీ అమలు కాలేదన్నది వాస్తవం. పైగా... లక్షల మంది ఫించన్లకు కోత పెట్టిన తరువాత కానీ మొత్తం పెంపు జరగలేదు.ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. ఎంతమందికి నిజంగా అందిందన్నది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారనుకున్నా, మరో నాలుగు నెలల వరకు ఆ ఊసే ఎత్తడానికి వీలు లేదు. అంటే నెలకు రూ. 200ల చొప్పున రాయితీ మాత్రమే ఇచ్చారన్నమాట. ఇతర వాగ్దానాలు అమలు చేయకుండానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందని అడిగితే సమాధానం మాత్రం బాబూ అండ్ కో నుంచి ఉండదు. ఇదేం న్యాయమని అడిగితే వారి గొంతు నొక్కేందుకు పోలీసులు కేసులు బనాయించేస్తారు. కేసులు వస్తాయి. జైలుపాలు కావాల్సి ఉంటుంది. మహిళా శక్తి పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికీ రూ.1500 చొప్పున ఇస్తామని అప్పట్లో ప్రచారమైతే చేశారు కానీ.. ఇచ్చింది సున్నా! తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని.. గతంలో జగన్ కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఇస్తే తాము ఎంతమంది ఉంటే అంతమందికీ ఇస్తామని ఊదరగొట్టారు. ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు వస్తాయని, ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని కూడా చంద్రబాబు ఉచిత సలహా ఇచ్చిన విషయం ఎవరూ మరచిపోలేదు కానీ అధికారంలోకి వచ్చాక ఒక విద్యార్ధికి ఈ పథకం అంది ఉంటే ఒట్టు! రైతు భరోసా కింద ప్రతి రైతుకు జగన్ హయాంలో ఇచ్చిన రూ.13500 కాకుండా రూ.20 వేల చొప్పున ఇస్తామన్న హామీ గురించి అసలు మాట్లాడటమే లేదిప్పుడు. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ప్రజలు బిత్తరపోవడం తప్ప చేసేది ఏముంటుంది. ఇక నిరుద్యోగుల సంగతి సరేసరి.ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని, అంతవరకు నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామన్న భృతి కూడా ఇప్పటివరకూ అమలు కాలేదు. ఇవి కాకుండా మానిఫెస్టోలో వలంటీర్ల కొనసాగింపు, వారి జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం, బీసీ, ఎస్సీఎస్టీ వర్గాల వారికి యాభై ఏళ్లకే రూ.4 వేల చొప్పున ఫించన్, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్న హామీ కూడా అమలు కాకపోగా.. అసలుకే మోసం వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. వలంటీర్ల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలు పోగా.. ప్రజలపై రూ.15 వేల కోట్ల కరెంటు ఛార్జీల భారం పడింది. బహుశా చంద్రబాబు సృష్టిస్తానన్న సంపద ఇలా జనాలపై బాదడం ద్వారానే అనుకోవడం ప్రజల వంతైంది. ఒకపక్క ప్రజలకు పైసా విదల్చని ప్రభుత్వం ఇంకోపక్క వారానికి వారం కొత్త కొత్త అప్పులు తెచ్చుకుంటున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏడు నెలల వ్యవధిలోనే లక్ష కోట్ల రూపాయల అప్పులు తేవడం ఆర్థిక వేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 1996 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఇలాగే అలివికానీ హామీలు బోలెడన్ని చేసి ఎన్నికల తరువాత అన్నీ తూచ్ అనేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని 2014లో హామీ ఇచ్చిన బాబు తరువాత ఎన్ని పిల్లిమొగ్గలు వేసింది ఇటీవలి అనుభవమే. ప్రత్యేక తెలంగాణ అంశంలో చూసుకున్నా, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్, బీజేపీలతో జత కట్టే అంశంలో గమనించినా, ఎన్నికల పొత్తులలో పలు భిన్నమైన విధానాలు కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా, అన్ని అవకాశవాద రాజకీయాలు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇది సర్కారు లెక్క.. 95 మంది రైతుల ఆత్మహత్య
రేటు పతనమై.. బతుకు భారమై..గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కౌలు రైతు యనగందుల వీరారావు (54) 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తుండేవాడు. గతేడాది అధిక వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పత్తి, మిరపకు మంచి ధరలు రావడంతో ఈ ఏడాది రూ.4 లక్షలు అప్పులు చేసి 2.5 ఎకరాల్లో మిరప సాగు చేశాడు. కోతలు ప్రారంభమయ్యే నాటికి క్వింటా రూ.15 వేలు ఉండడంతో, ధరలు పెరుగుతాయన్న ఆశతో కోల్డ్ స్టోరేజీలో పెట్టాడు. వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో క్వింటా రూ.10 వేలకు పడిపోయింది. మరింత పడిపోతాయన్న ఆందోళనతో అమ్ముకోగా, కోల్డ్ స్టోరేజీ ఖర్చులన్నీ పోనూ రూ.70 వేలు మిగిలింది. గతంలో చేసిన వాటితో కలిపి రూ.10 లక్షల అప్పులు తీర్చే దారిలేక, అప్పులోళ్లకు ముఖం చూపించలేక గత నెల 23న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరారావు భార్య కూలీ పనికి వెళ్తోంది. ఉన్న ఇంటిని అమ్మి రేకుల షెడ్లో అద్దెకు ఉంటున్నామని, తల్లితో పాటు తన వద్ద ఉన్న బంగారాన్ని కుదవ పెట్టినా అప్పులు తీరలేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమను పట్టించుకోలేదని వీరారావు కుమారుడు సుబ్బారావు కన్నీటి పర్యంతమయ్యాడు.సాగు నిజం.. వ్యవ‘సాయం’ దుర్లభంవైఎస్సార్ జిల్లా రామిరెడ్డిపల్లెకు చెందిన ఎన్.శ్రీనివాసులు రెడ్డి (47) గత నెల 28న, వేంపల్లికి చెందిన ఆశీర్వాదం (63) ఈ నెల 15న ఆత్మహత్యలకు పాల్పడ్డారు. శ్రీనివాసులురెడ్డికి సొంత పొలంతో పాటు 4 ఎకరాల కౌలు భూమి ఉండగా, సొసైటీలో రూ.5 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.20 లక్షల అప్పులున్నాయి. ఆశీర్వాదానికి సొంతంగా 2 ఎకరాలుండగా, 4 ఎకరాలు కౌలుకు చేస్తున్నాడు. ఆయన సొసైటీలో రూ.2 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇద్దరి పంటలు పూర్తిగా దెబ్బ తినడంతో పొలంలో గుళికలు మింగి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి.. వీరిద్దరి ఆత్మహత్యలకు వ్యక్తిగత ఇబ్బందులే కారణమని అధికారులు తేల్చారు. పరిహారం అందక ఈ రెండు కుటుంబాలు రోడ్డునపడ్డాయి.టీడీపీ నేతల బెదిరింపులు తాళలేకబాపట్ల జిల్లా బుల్లికురువ మండలం వెలమవారిపాలెంలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చింతల శ్రీను(41) 25 ఏళ్లుగా సాగు చేస్తున్నాడు. తనకున్న 20 ఎకరాలను గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఆక్రమించుకొని అక్రమంగా ఆన్లైన్లో వారి పేరిట మార్చుకున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. టీడీపీ నేతల వేధింపులు తాళలేకపోతున్నానని, తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ అధికారులకు సమాచారమిచ్చినా స్పందన లేదు. చనిపోయే ముందు 100కు ఫోన్ చేసినా పట్టించుకోలేదు. చివరికి అద్దంకి సమీపంలోనే పురుగుల మందు తాగి విగతజీవిగా పడి ఉన్న శ్రీనును స్థానిక వైఎస్సార్సీపీ కార్తకర్తలు హుటాహుటిన ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గత నెల 28న మృతి చెందాడు. తండ్రి చనిపోయిన తర్వాత కూడా టీడీపీ నేతల వేధింపులు కొనసాగుతున్నాయంటూ శ్రీను కుమారులు భూదేశ్వరరావు, వీరయ్యలు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి/నెట్వర్క్ : ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఇల్లు గడిచే దారిలేక, పిల్లల చదువులు సాగక, పెళ్లిళ్లు ఆగిపోయి ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ‘మేమున్నాం అని ధైర్యం చెప్పి ఆదుకోవాల్సిన ఆపన్న హస్తం కనిపించకపోవడంతో వారంతా రోడ్డున పడి దిక్కులు చూస్తున్నారు. అందలం ఎక్కింది మొదలు అన్నదాతపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో పుడమి తల్లి బిడ్డలు విసిగివేసారి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సాగు వేళ తుపానులు, వరదలు, వర్షాభావ పరిస్థితులు ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వైపరీత్యాలు ముప్పేట దాడి చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నల పాలిట ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు మృత్యు పాశాలుగా మారాయి. సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించిన ప్రభుత్వం తమను వంచించడంతో పాటు తమకు న్యాయంగా దక్కాల్సిన పంటల బీమా పరిహారం కూడా అందకుండా చేయడంతో పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వలేక సాగు భారమై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే ఆరున్నర నెలల కూటమి పాలనలో ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య సెంచరీకి చేరువయ్యిందంటే రైతులు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నారో అర్థమవుతోంది. వీరంతా త్రీమెన్ కమిటీ నిర్ధారించిన వారే. ఇక వివిధ కారణాలతో కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులు, తిరస్కరించిన కేసులు కలుపుకుంటే ఆత్మహత్య చేసుకున్న వారు 150కి పైగానే ఉన్నారు. ఆరున్నర నెలల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా పైసా పరిహారం ఇవ్వక పోవడంతో బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి. తాజాగా వైఎస్సార్ జిల్లాకు చెందిన రైతు తన భార్య, కొడుకు, కుమార్తెలకు ఉరి వేసి.. తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల దయనీయ పరిస్థితి కంట నీరు తెప్పిస్తోంది.కూటమి ప్రభుత్వం రాకతో కష్టాలురాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఏటా సీజన్‌కు ముందు అందే పెట్టుబడి సాయం లేదు. పంటల బీమా పరిహారం జాడ లేదు. కరువు సాయం ఊసే లేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. పోనీ రూ.3–5 వడ్డీలకు అప్పులు చేసి మరీ సాగు చేస్తుంటే సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరక్క పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్లో ఓ పక్క కల్తీలు రాజ్యమేలుతుంటే మరోపక్క బ్లాక్ మార్కెటింగ్ పెచ్చు మీరింది. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం శ్రమించి సాగు చేస్తే ఓ వైపు వైపరీత్యాలు, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసి పండించిన కొద్దిపాటిæ పంట చేతికొచ్చే సమయంలో ధర లేక అయినకాడకి తెగనమ్ముకుంటూ తమ కష్టాన్ని దళారుల పాల్జేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాలను ఓదార్చే వారు కరువయ్యారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తిచూడడం లేదు.ఆరున్నర నెలల్లోనే సడలిన నమ్మకంప్రభుత్వ నిర్వాకం, అస్తవ్యస్త విధానాల వల్ల అన్నదాతల్లో నమ్మకం పోతోంది. వెరసి జూన్ 12వ తేదీ నుంచి ఇప్పటి దాకా.. కేవలం ఆరున్నర నెలల్లో 95 మంది ఆత్మహత్యకు పాల్పడినట్టుగా త్రీమెన్ కమిటీ ధ్రువీకరించింది. తాజాగా వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో శనివారం ఆత్మహత్య చేసుకున్న వారితో కలుపుకుంటే ఈ సంఖ్య 97కు చేరుకుంది. త్రీమెన్ కమిటీ ధ్రువీకరించకుండా పెండింగ్‌లో ఉన్న కేసులు మరో 10–15 వరకు ఉంటాయని, తిరస్కరించిన కేసులు ఇంకో 50 ఉంటాయని అధికార వర్గాల సమాచారం. ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారిలో రాయలసీమ జిల్లాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, గుంటూరు జిల్లాల్లోనే 51 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 30 మంది అర్ధాంతరంగా తనువు చాలించారు. దాదాపు ప్రతి జిల్లాలోనూ కనీసం ఇద్దరు ముగ్గురికి తక్కువ కాకుండా ఆత్మహత్యలకు పాల్పడిన రైతులున్నారు. వీరికి ఎంత పరిహారం ఇవ్వాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.2014–19 మధ్య ఎన్నో ఆంక్షలుఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవారు. రూ.లక్ష కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటూ చంద్రబాబు అవహేళనగా మాట్లాడడమే కాదు.. ఆ ఇచ్చే పరిహారాన్ని కూడా 2003లో ఆపేశారు. 2014లో పరిహారం పునరుద్ధరించగా, 2015 ఫిబ్రవరి 18వ తేదీ వరకు రూ.1.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. ఆ తర్వాత రూ.5 లక్షలకు పెంచారు. దాంట్లో రూ.1.50 లక్షలను వన్ టైం సెటిల్మెంట్ కింద ఆత్మహత్యకు పాల్పడిన రైతుల అప్పుల ఖాతాకు జమ చేసేవారు. రూ.3.5 లక్షల పరిహారాన్ని విత్ డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునేలా ఆంక్షలు విధించారు. 2014–19 మధ్య ఐదారువేల మంది ఆత్మహత్యలకు పాల్పడితే అధికారికంగా గుర్తించింది కేవలం 1,223 మందిని మాత్రమే. కానీ పరిహారం ఇచ్చింది కేవలం 450 మందికి రూ.20.12 కోట్లే. కౌలు రైతుల ఊసే లేదు.పరామర్శ లేదు.. సాయం ఊసు లేదు ‘రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ వారింటికి వెళ్లి ధైర్యాన్నివ్వాలి. అదేరోజు వీఆర్వో వెళ్లి వివరాలు సేకరించాలి. మండల స్థాయి కమిటీ విచారణ చేపట్టి, 24 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలి. డివిజన్ స్థాయి త్రీమెన్ కమిటి సిఫార్సు మేరకు నిర్దేశిత గడువులోగా పరిహారం అందించేలా జిల్లా ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖకు నివేదిక సమర్పించాలి’ అనే విధానాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వంలో రైతు ఆత్మహత్య తర్వాత బాధితులను కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శించిన పాపాన పోలేదు. తుది నివేదిక రూపకల్పనలో ప్రభుత్వ ఒత్తిళ్లు బలంగా పని చేస్తున్నాయి. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక పొలంలోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యలకు పాల్పడినా సరే, వ్యక్తిగత కారణాలతోనే చనిపోతున్నారంటూ నివేదికలు ప్రభుత్వం వద్దకు వెళ్తున్నాయి. బాధిత కుటుంబాలు స్పందనలో అర్జీలు ఇచ్చినా స్పందించడం లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవనే సాకుతో అన్యాయం చేస్తున్నారు.2019–24 మధ్య ఆదుకున్న ప్రభుత్వంవైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కారణాలు ఏమైనా సరే ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకతీతంగా ఆదుకుంది. 2014–19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతు ఘటనలకు సంబంధించి కూడా రీ వెరిఫికేషన్‌లో 474 మంది అర్హత పొందగా, వారికి పరిహారం అందజేసింది. ఈ విధంగా ఐదేళ్లలో 1,794 మందికి రూ.116.10 కోట్ల ఎక్స్‌గ్రేషియా జమ చేసింది. ఇందులో 495 మందిక కౌలు రైతులున్నారు. ఊరూరా ఆర్బీకేల ఏర్పాటు ద్వారా విత్తు నుంచి పంట కొనుగోలు వరకు రైతులను చేయి పట్టుకుని నడిపించింది. ఉచిత పంటల బీమా ద్వారా అండగా నిలిచింది. ఏటా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూ.13,500 చొప్పున సాయం అందించింది. రూ.12,563 కోట్లు ఎగ్గొట్టిన కూటమి సర్కారుఅధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద గత ఐదేళ్లలో లబ్ధి పొందిన 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే ఏటా రూ.10,718 కోట్లు అవసరం. ఇప్పటికీ దాని ఊసే ఎత్తడం లేదు. 2023–24 సీజన్‌కు రూ.930 కోట్ల రైతుల వాటా ప్రీమియం సొమ్ము చెల్లించక పోవడం వల్ల ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బ తిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో పంటల బీమా అమలు చేస్తుండడంతో బీమా ప్రీమియం భరించలేక రైతులు పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌తోపాటు రబీ 2023–24 సీజన్లో కరువు ప్రభావంతో దెబ్బతిన్న 3.91 లక్షల మంది రైతులకు రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్ 2023 సీజన్‌కు సంబంధించి 6.31 లక్షల మందికి రూ.132 కోట్ల వరకు జమ చేయలేదు. ఇలా ఆరున్నర నెలల్లో అన్నదాత సుఖీభవ, పంటల బీమా, కరువు సాయం బకాయిలు, సున్నా వడ్డీ రాయితీలు కలిపి రైతులకు ఈ ప్రభుత్వం రూ.12,563 కోట్లు ఎగ్గొట్టింది.పెద్దదిక్కు కోల్పోయి రోడ్డున పడ్డారు..నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రహిమానుపురానికి చెందిన సలీంద్ర మధు (35) సొంతంగా 1.50 ఎకరాలు, మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని కంది, పత్తి, టమాటా, మిరప, ఉల్లి పంటలు సాగు చేసేవాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది కలిసి రాలేదు. సాగు కోసం రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. వీటిని తీర్చే దారిలేక గత నెల 16న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధు మృతితో అతని భార్య సంధ్యాదేవి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ప్రభుత్వం నుంచి పైసా పరిహారం కూడా అందలేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.పరిహారం కోసం ఎదురు చూపుప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్ధినాయునిపల్లికి చెందిన రుద్రపాటి చిన్న వెంకట చన్నయ్య (70) 30 ఏళ్లుగా వ్యవసాయం చేసేవాడు. సొంతంగా ఆరెకరాలు, కౌలుకు 2 ఎకరాలు తీసుకొని టమాటా, పొగాకు సాగు చేశాడు. అప్పులు చేసి మూడు బోర్లు వేసినా నీరందక అవస్థలు పడ్డాడు. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పాటు చీడపీడలు కారణంగా పంటలు దెబ్బతినగా, పెట్టుబడులు కూడా దక్కలేదు. రూ.9 లక్షలకుపైగా చేసిన అప్పులు తీర్చే దారిలేక గత నెల 8న సొంత పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీమెన్ కమిటీ విచారణలో కూడా ఇదే విషయం నిర్ధారణ అయింది. అయినా పరిహారం ఇవ్వ లేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.అప్పులోళ్ల ఒత్తిళ్లు భరించలేక..పల్నాడు జిల్లా వెల్దురికి చెందిన పల్లపోలు వేణుగోపాల రెడ్డి (68) 1.50 ఎకరాలు కౌలుకు తీసుకొని పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బ తిన్నాయి. సాగు కోసం చేసిన అప్పులు రూ.20 లక్షల వరకు చేరుకున్నాయి. వాటిని తీర్చే దారిలేక, అప్పులోళ్ల ఒత్తిళ్లు భరించలేక గత నెల 22న ఇంట్లోనే ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోవడంతో తామంతా రోడ్డున పడ్డామని, తమకు ఆసరా లేకుండాపోయిందని, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కూలి పనికి వెళ్తోన్న భార్య లక్ష్మి వేడుకుంటోంది.స్వాతంత్య్రం వచ్చిన రోజే.. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పందిర్లపల్లెకు చెందిన మహిళా రైతు మాదిగ సువర్ణ (39) తన 7 ఎకరాల భూమిలో ఆముదం, మిరప పంటలు సాగు చేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. చేసిన అప్పులు రూ.8 లక్షలకు పైగా ఉన్నాయి. వాటిని తీర్చే దారిలేక స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న పొలంలోనే బావి వద్ద పురుగుల మందు తాగి తనువు చాలించింది. కుటుంబానికి జీవనాధారమైన సువర్ణ అర్ధాంతరంగా చనిపోవడంతో తనకున్న ముగ్గురు కుమార్తెలు, కుమారుడ్ని పోషించుకునే దారిలేక అనారోగ్యంతో బాధ పడుతున్న భర్త పాండు కన్నీటి పర్యంతమవుతున్నాడు.30 ఏళ్లకే తనువు చాలించి..అనంతపురం జిల్లా కాలువపల్లికి చెందిన యువ రైతు ఎర్రిస్వామి(30) అప్పుల బాధతో జూన్ 17న ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఐదెకరాల్లో సాగు కోసం అప్పులు చేసి మరీ బోరుబావులు తవ్వించాడు. నీరు పడలేదు. మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని కర్బుజా, టమాటా పంటలు సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో కలిసి రాలేదు. అప్పులు రూ.25 లక్షలు తీర్చే దారిలేక పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఇలా 30 ఏళ్లకే మృత్యువాత పడడంతో తల్లి లక్ష్మిదేవి, భార్య ప్రియాంకలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమ గతేమిటని ప్రశ్నిస్తున్నారు. -
మహిళలకు ఉచిత బస్సు... మరింత దూరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. అధ్యయనం పేరుతో ఓ కమిటీని నియమించిన ప్రభుత్వం... దానికి కాలపరిమితిని విధించకపోవడమే ఇందుకు కారణం. కాలయాపన కోసమే ఈ కమిటీని నియమించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి హామీ ఇచ్చింది. సూపర్ సిక్స్ పేరిట ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. అయితే అధికారం చేపట్టి ఆరు నెలలు దాటినా మహిళలకు ఉచిత బస్సు హామీని అమలు చేయలేదు. ఇప్పుడు ఉచిత బస్సు అమలు కోసం అధ్యయనం పేరుతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి తెలంగాణతోపాటు కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమల్లో ఉంది. దీనిపై పెద్ద అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని, అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రారంభించవచ్చని ఉన్నతాధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రవాణా శాఖ మంత్రి అధ్యక్షతన కమిటీ... మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడంపై అధ్యయనం కోసం రవాణా శాఖ మంత్రి అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని నియమించింది. మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, హోంమంత్రి సభ్యులుగా, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలను ఈ బృందం సందర్శించి అక్కడ విధానాలపై అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అమలుకు తగిన నమూనాను మంత్రుల బృందం రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, మంత్రుల బృందం నమూనా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించేందుకు నిర్దిష్ట సమయం ఏదీ ఉత్తర్వుల్లో పేర్కొనకుండా వీలైనంత త్వరగా... అంటూ ముక్తాయింపు ఇచ్చారు. దీంతో కాలయాపన కోసమే ఈ కమిటీని నియమించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
చంద్రబాబు ఒక్కడికే అది సాధ్యం వైఎస్ జగన్ సెటైర్లు
-
జగన్ పిలుపు ప్రభుత్వం వణుకు
-
KSR Live Show: హామీలతో బురిడీ..! ఇద్దరూ జాతిరత్నాలే
-
సూపర్ సిక్స్ తో అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం చంద్రబాబు
-
Big Question: సీజ్ ద సూపర్ సిక్స్
-
6 నెలల్లో తారుమారు.. హామీలకు చంద్రబాబు తూట్లు
ఓ నాయకుడు మాట ఇస్తే... ఆరు నూరైనా నూరు ఆరైనా కట్టుబడి ఉండాలంటారు! కానీ సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ఏరు దాటాక తెప్ప తగలేశారు! ఆర్నెళ్ల పాలనలో కనిపించేదంతా ఉత్త ‘గ్యాసే’!ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకపోగా ఇసుకలో దోపిడీ.. మద్యంలో దోపిడీ.. రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల బాదుడుతో ప్రజలను గుల్ల చేస్తున్నారు. మరోవైపు కొత్త పథకాలు లేకపోగా ఉన్నవాటినే రద్దు చేస్తూ రెడ్‌బుక్ పాలనతో ప్రశ్నించే గళాలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయి. రెడ్‌బుక్, మాఫియా రాజ్యంతో స్కామ్‌ల పాలన సాగుతోంది. ఎన్నికలు జరిగిన ఏడు నెలలు తరువాత.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆర్నెళ్లు గడిచాక ఇదీ పరిస్థితి!!సాక్షి, అమరావతి: అలవి మాలిన హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం చంద్రబాబు అభూత కల్పనలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా గత ఐదేళ్లూ అమలైన పథకాలు, వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి పేద వర్గాలకు తీరని ద్రోహం తలపెట్టారు. ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పిన ‘తల్లికి వందనం’ ఊసే లేదు. దీనికోసం 46 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఏటా రూ.20 వేలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం ఎటు పోయిందో తెలియక 54 లక్షల మంది అన్నదాతలు ఉసూరుమంటున్నారు. కోటి మందికిపైగా యువత నిరుద్యోగ భృతి లేదంటే ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రకటించిన పేదలను ధనికులుగా మార్చే ‘పూర్ టు రిచ్’ కాన్సెప్ట్ కాగితాలకే పరిమితం! ‘యువగళం’, ‘ఆడబిడ్డ నిధి’ పథకాలు కనుచూపు మేరలో లేవు. ‘ఆడబిడ్డ నిధి’ కోసం 1.80 కోట్ల మంది మహిళలు ఆశగా పడిగాపులు కాస్తున్నారు. అయితే కనీసం వాటిని అమలు చేసే ఉద్దేశం కూడా ప్రభుత్వ పెద్దల్లో కానరాక పోవడంతో మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అంతా అదే జగన్ అధికారంలో ఉండి ఉంటే ఈ సమయానికి ఏ పథకాల కింద, ఎంత లబ్ధి చేకూరేదో బేరీజు వేసుకుంటున్నారు. గత ఐదేళ్లూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ప్రజల ఇంటి వద్దకే వైఎస్ జగన్ చేరవేశారు. రాజకీయ వేదికలుగా ప్రభుత్వ విద్యా సంస్థలు..అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలో 16 వేలకుపైగా పోస్టులతో మెగా డీఎస్సీని పూర్తి చేస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన తొలి సంతకం మురిగిపోయింది! వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని విద్యా సంస్కరణలను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారు ఆర్నెళ్లుగా ప్రభుత్వ పాఠశా>లలపై అనేక ప్రయోగాలు చేసి ఒక్క హామీనీ అమలు చేయలేదు. ఐబీ, సీబీఎస్ఈ, టోఫెల్‌ను రద్దు చేసి.. తల్లికి వందనం పథకం అమలుపై మాత్రం చేతులెత్తేసింది. ఇంగ్లీషు మీడియం చదువులు, డిజిటల్ తరగతి గదులు, పిల్లలకు ట్యాబ్‌లపై చేతులెత్తేసింది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేట్‌కు లబ్ధి చేకూరుస్తోంది. రాష్ట్రంలో స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఓ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికీ ఇస్తామన్న హామీ గాలికి ఎగిరిపోయింది. స్కూళ్లల్లో అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చిందే గానీ ఒక్క విద్యా సంస్కరణను అమలు చేసింది లేదు. మెగా పీటీఎం పేరుతో ఉపాధ్యాయులను ఉరుకులు పెట్టించి ప్రభుత్వ విద్యా సంస్థలను రాజకీయ ప్రచార వేదికలుగా మార్చేశారు. రాష్ట్రానికి రావాల్సిన 700 ఎంబీబీఎస్ సీట్లకు మోకాలడ్డిన కూటమి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు మన విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది. అన్ని విధాలా దగా పడిన రైతన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని రెండు వ్యవసాయ సీజన్లు గడుస్తున్నా అందించలేదు. అన్నదాతా సుఖీభవ కోసం 54 లక్షల మంది అన్నదాతలకు రూ.10 వేల కోట్లు అవసరం కాగా బడ్జెట్లో రూ.1000 కోట్లు మాత్రమే విదిలించడం గమనార్హం. ఇంతవరకు పథకం విధివిధానాలే ఖరారు చేయలేదు. ఇక ఖరీఫ్ 2023 సీజన్‌కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. సున్నా వడ్డీ రాయితీ ఊసే లేదు. రబీ సీజన్లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు సేవా కేంద్రాలను (ఆర్బీకేలు) చంద్రబాబు నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేశారు. గత ఆర్నెళ్లలో 70 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది.జాడలేని ఆడబిడ్డ నిధి..19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలందరికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సహాయం అందచేస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు పేర్కొన్నారు. 1.80 కోట్ల మంది మహిళలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగికి నయవంచన..యువతకు ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నెలకు రూ.4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి రూ.57,600 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో ఇందుకు ఒక్కపైసా విదల్చక పోవటాన్ని బట్టి నిరుద్యోగ భృతి లేదని తేలిపోయింది.వైఎస్ జగన్ హయాంలో ఏటా ఏప్రిల్‌లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మే లో విద్యా దీవెన, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా.. జూన్‌లో అమ్మ ఒడి.. జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు.. ఆగస్టులో విద్యా దీవెన, నేతన్న నేస్తం.. సెప్టెంబర్‌లో చేయూత.. అక్టోబర్‌లో రైతు భరోసా.. నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు సున్నా వడ్డీ రుణాలు.. డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపట్టారు.సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఇతర ముఖ్యమైన హామీలు⇒ పూర్ టు రిచ్.. పీ–4 పథకాలు అంటూ ఇంతవరకు ఏ ఒక్కటీ ప్రకటించలేదు⇒ ఏటా జాబ్ క్యాలెండర్ జాడే లేదు⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను హామీ మేనిఫెస్టోకే పరిమితం.⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ అమలు చేయలేదు⇒ ఉద్యోగుల సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు⇒ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్, డీఏ ప్రకటిస్తామనే హామీని విస్మరించారు⇒ వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచకపోగా ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడారు⇒ కాపుల సంక్షేమ కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి బడ్జెట్లో అందుకు తగ్గట్టు నిధులు ఇవ్వలేదు⇒ విద్యుత్ బిల్లుల భారం తగ్గించకపోగా ఆర్నెళ్లలోనే రూ.15 వేల కోట్లకుపైగా చార్జీల భారం మోపారు.⇒ ఉచితంగా ఇసుక అంటూ దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు.ఆసరా, చేయూత అసలే లేవువైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పేద మహిళలను ఆర్థికంగా నిలబెట్టిన చేయూత, సున్నా వడ్డీ, ఆసరా లాంటి పథకాలు చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడంతో అక్క చెల్లెమ్మల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటికే అందాల్సిన మత్స్యకార భరోసాగానీ, వాహనమిత్ర లాంటి పథకాలుగానీ అందలేదని ఆయా వర్గాలు వాపోతున్నాయి. 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీ బూటకంగా మారింది. కొత్తవి లేవు.. అన్నీ రద్దులేతాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతోపాటు వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతానంటూ ఉగాది పండుగ సందర్భంగా ఇచ్చిన హామీని చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పలికి 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారు. ఉచిత గ్యాస్‌లోనూ మాయఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు జిమ్మిక్కులతో మహిళలను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది రెండు సిలిండర్లకు కోత పెట్టారు.రూ.15,485.36 కోట్ల విద్యుత్ చార్జీల భారంఅధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని.. ఇంకా తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే రూ.6,072.86 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని వినియోగదారులపై మోపిన కూటమి ప్రభుత్వం మరో రూ.9,412 కోట్ల భారం కూడా మోపేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్నెళ్లలో వేసిన మొత్తం విద్యుత్ చార్జీల భారం రూ.15,485.36 కోట్లకు చేరింది.మద్యం సిండికేట్లతో లూటీప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసిన సీఎం చంద్రబాబు టీడీపీ సిండికేట్ దోపిడీకి రాచబాట పరిచారు. ప్రైవేటు మద్యం దుకాణాలను నెలకొల్పారు. టెండర్ల ప్రక్రియను ఏకపక్షంగా నిర్వహించి టీడీపీ సిండికేట్‌కే అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా చేశారు. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా పోలీసు యంత్రాంగంతో బెదిరించి అడ్డుకున్నారు. మాట వినకుంటే దాడులకు పురిగొల్పారు. తద్వారా రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్ గుప్పిట పట్టింది. ప్రతి మద్యం దుకాణం పరిధిలో 4 నుంచి పది వరకు బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఊరూవాడా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.15, బెల్ట్ దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.25 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తూ అడ్డగోలుగా దోపిడీకి తెర తీశారు. మద్యం విక్రయాల ద్వారా టీడీపీ సిండికేట్ ఏటా రూ.41,850 కోట్ల చొప్పున ఐదేళ్లలో 2.09 లక్షల కోట్ల దోపిడీకి పన్నాగం పన్నింది.పాలనా వైఫల్యాలు.. డైవర్షన్ రాజకీయాలుఆర్నెళ్ల పాలన అంతా వైఫల్యాల మయంగా మారడంతో డైవర్షన్ రాజకీయాలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్‌లో రుషికొండ భవనాల పేరుతో బురద చల్లి మభ్యపుచ్చేందుకు యత్నించారు. ఆగస్టులో కాదంబరి జెత్వానీ కేసు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. సెప్టెంబర్‌లో ప్రకాశం బ్యారేజీని వైఎస్సార్సీపీ నేతలు బోట్లతో ఢీకొట్టి ధ్వంసం చేయడానికి కుట్ర పన్నారంటూ ఏమార్చే కుతంత్రాన్ని రచించారు. ఆ తర్వాత తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా తిరుమలను రాజకీయాలకు వాడుకున్న వ్యక్తిగా మిగిలిపోయారు. అక్టోబర్‌లో వైఎస్సార్ కుటుంబ వ్యవహారాలను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేశారు. నవంబర్‌లో వైఎస్సార్సీపీ శ్రేణులపై కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియా కేసులు పెట్టారు. అమెరికాలో అదానీపై కేసుల వ్యవహారాన్ని వైఎస్ జగన్‌కు ముడిపెట్టి దుష్ప్రచారానికి కుట్ర పన్నారు. కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతుల వ్యవహారాన్ని రాజకీయం చేసి తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విఫల యత్నాలు చేస్తున్నారు.ఇది అప్పుల కుప్ప ప్రభుత్వంసంపద సృష్టిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని నిరంతరం అప్పుల ఊబిలోకి దించుతున్నారు. ఇప్పటివరకు రూ.67,237 వేల కోట్ల మేర కొత్త అప్పులు చేసి రికార్డు సృష్టించారు. అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ అప్పులు చేశారు. ఇన్ని అప్పులు చేసి కూడా హామీలను నెరవేర్చలేదు.ఉచితం అంటూ.. ఇసుక దోపిడీఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం యార్డుల్లో 80 లక్షల టన్నులను నిల్వ చేయగా కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ ప్రజాప్రతినిధులు మాయం చేశారు. 108 రీచ్‌లకు షార్ట్ టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద అయిన వారికి అప్పగించేశారు. ఇసుక లేక నిర్మాణ రంగం స్తంభించి లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులు అల్లాడుతున్నారు. భూ సమస్యలు మళ్లీ మొదటికిల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూ వివాదరహితంగా మార్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూములపై ఆంక్షలు తొలగిస్తే ఇప్పుడు టీడీపీ మళ్లీ ఆంక్షలు పెట్టి రైతులను కష్టాల్లోకి నెడుతోంది. -
పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ మంత్రి బొత్స
-
ధర్మం చంద్రబాబు పాదం మీదే నడుస్తుందా..?
-
గ్రామీణ రోడ్లకు టోల్ టాక్స్ వసూలు చేయడం సంపద సృష్టినా..?
-
చంద్రబాబు వాలంటీర్లను మోసం చేశాడు: Kannababu
-
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు
-
చంద్రబాబు మంత్రం దండం..కన్నబాబు సెటైర్లు
-
ప్రతీ ఇంటికీ మూడు సిలెండర్లు ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ
-
చంద్రబాబు తీరే అంత.. : భూమన
తిరుపతి, సాక్షి: సొంత డబ్బా కొట్టుకోవడంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు దిట్ట అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఓవైపు ప్రజలను మోసం చేస్తూనే.. వైఎస్సార్సీపీకి సానుభూతిపరులెవరూ ఉండకూడదని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారాయన.సాధ్యంకాని హామీలిచ్చి టీడీపీ-జనసేన కూటమి ప్రజలను మోసం చేసింది. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ చెప్పిందే సత్యమని ఎల్లో మీడియా బాకా ఊదుతోంది. చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్‌పై విమర్శలు చేస్తున్నారు.ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ఒక చరిత్ర.. కొన్ని నిజాలు పుస్తకం నుంచి చంద్రబాబుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను భూమన మీడియాకు చదివి వినిపించారు. -
చంద్రబాబూ.. మీకిది తగునా?: లేఖ రాసిన ముద్రగడ
కాకినాడ, సాక్షి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ కీలక నేత ముద్రగడ లేఖ రాశారు. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సిక్స్ హామీలిచ్చి.. వాటిని ఎత్తేసే ప్రయత్నాలు చేయొద్దని లేఖలో చంద్రబాబుకి ముద్రగడ హితవు పలికారు.‘‘ఇచ్చినా హమీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీలాంటి సినియర్ రాజకీయ నాయకులకు తుగునా?. మీ దొంగ సూపర్ సిక్స్ హమీలను తలచుకుంటే భయం వేస్తొంది. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. సూపర్ సిక్స్ అమలు చేయాలంటే కోట్లాది రూపాయాల నిధులు కావాలని మీకు తెలియదా?.తెలిసి అబద్దాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు. ప్రజలకు సూపర్ సిక్స్ గుర్తుకు రాకుండా తిరుపతి ప్రసాదం,రెడ్ బుక్ రాజ్యంగం, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను అరెస్ట్ చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మీకు వెన్నతో పెట్టిన విద్య అని ముద్రగడ తీవ్రంగా విమర్శించారు. -
వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను సమర్పించిన రూ. 2.94 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ప్రజల్లో నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఈ బడ్జెట్ లాంఛన ప్రాయంగా మాత్రమే కనిపిస్తోంది. ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ‘సూపర్ సిక్స్’తో సహా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించలేదు. యువత నైపుణ్యాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి రంగాలపై గుర్తించదగిన శ్రద్ధను కనబరచలేదు. స్థిరమైన ఉపాధిని పెంపొందించడానికి ఎంఎస్ఎంఈ లకు అదనపు మద్దతు ఇవ్వాలి. అదెక్కడా బడ్జెట్లో కని పించడంలేదు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించే బదులు, స్పష్టమైన ఫలితా లను సాధించడానికి రాష్ట్రం ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వాలి. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు కూటమి సర్కారు మోకాలడ్డుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, మెయింటెనెన్స్ ఛార్జీల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. ఫలితంగా సుమారు 12 లక్షల ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనారిటీలకు చెందిన విద్యార్థుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపుల్లో కోత స్పష్టంగా కనిపిస్తోంది. ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీలను పునరావృతం చేయడం మినహా ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా చెప్పలేదు. రూ. 43,402 కోట్లతో అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌దీ అదే దారి. మొత్తంగా, ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనారిటీల సంక్షేమానికి నామమాత్రంగానే ప్రభుత్వం నిధులు విదిల్చింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో సరిపెట్టారు. మిగతా హామీల అమ లుపై నిర్దిష్టత లేదు. 20 లక్షల మంది యువతకు ఉపాధి అవ కాశాలు, రూ. 3,000 నిరుద్యోగ భృతిని దాటవేశారు. 16,347 పోస్టుల భర్తీకి జారీ చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రస్తావించిన ఆర్థిక మంత్రి... ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీ, జీఓ నెంబరు 3 పునరుద్ధరణ గురించి నోరు మెదపలేదు. ప్రతి రైతుకూ ఏటా రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న ‘అన్నదాత సుఖీ భవ’కు 10 వేల 716 కోట్లు అవసరం కాగా 1000 కోట్లే కేటాయించారు. దాదాపు 25 లక్షలుగా ఉన్న కౌలు రైతులను ఆదుకోవడం కనీస ధర్మం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధా న్యత అని చెప్పినా, నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదు.ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా ఉండాల్సిన మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడంపై చూపే ఆత్రం పథకాల అమలులో కానరావడం లేదు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున అంది స్తామన్న ‘మహాశక్తి’ జాడే లేదు. ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థికి రూ. 15 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 84 లక్షల మంది విద్యార్థుల తల్లులకు చెల్లించేందుకు రూ. 12,600 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, విదిల్చింది రూ. 5,387 కోట్లే! బాలబాలికలకు, బాలింతలకు సేవలందిస్తున్న అంగన్వాడీ వర్క ర్లకు, హెల్పర్లకు పెండింగ్‌లో ఉన్న వేతన పెంపు గురించి ఎక్కడా ప్రస్తావించ లేదు. కార్మికులు, స్కీమ్ వర్కర్ల వేతన పెంపు, సామా జిక భద్రత ఊసే లేదు. మాటిచ్చినట్టుగా విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా వేల కోట్ల రూపాయల అప్పు భారం మోపుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల నుంచి కేంద్రం ఇప్పిస్తా మన్న రూ. 15 వేల కోట్లు గ్రాంటో, రుణమో తేల్చలేదు. మొత్తంగా చూసినప్పుడు బడ్జెట్ కేటాయింపులను బట్టి ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసినట్లు స్పష్టమవుతోంది.– డా‘‘ ముచ్చుకోట సురేష్ బాబుమొబైల్: 99899 88912 -
బడ్జెట్లో సూపర్ సిక్స్‌ల ఎగవేత.. బాబు చేసింది మోసం కాదా?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి జిల్లా: ఏపీలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై సీఎం చంద్రబాబును మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చిన చంద్రబాబు. .బడ్జెట్లో వాటిని ఎగ్గొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను బాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందించారు.. @ncbn గారు.. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టారు!నువ్వు చేసింది మోసం కాదా?యువతని మోసం చేశారుమహిళలను మోసం చేశారురైతులను మోసం చేశారుఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళ…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 14, 2024 -
సూపర్ సిక్స్ ని నమ్మి ఓటేశారు.. ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది
-
బూచిగా అప్పుల భూతం.. సూపర్ సిక్స్‌కు ఎగనామం: వైఎస్ జగన్
‘ఎన్నికల వేళ నువ్వు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? ఇదిగో నీ సూపర్ సిక్స్.. వాటిని అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ రూ.74 వేల కోట్లు. కానీ బడ్జెట్లో కేటాయింపు చేయలేదు. నువ్వు చెప్పింది అబద్ధం కాదా? నువ్వు చేసింది మోసం కాదా? నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా?’ అని ప్రశ్నిస్తూ నేను ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడతా. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇదే పోస్టు పెడతారు. ఇదే పోస్టును సోషల్ మీడియాలో పెట్టాలని ప్రతి కార్యకర్తకూ పిలుపునిస్తున్నా. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. అరెస్ట్ చేయడం మొదలు పెడితే.. అది నాతోనే ప్రారంభించండి.– సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సవాల్సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇస్తున్నప్పుడే వాటిని అమలు చేయలేనని తెలిసినా, మోసం చేయడమే తన నైజంగా పెట్టుకున్న చంద్రబాబు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర అప్పులు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అంటూ చేసిన దుష్ప్రచారం బడ్జెట్ సాక్షిగా బట్టబయలైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఒక అబద్ధాన్ని సృష్టించి.. దాన్నే ఎల్లో మీడియాతో రాయించి.. ఆ తర్వాత దత్తపుత్రుడు, బీజేపీలోని టీడీపీ నాయకురాలు, తన వదినమ్మ, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో పదే పదే మాట్లాడించి దుష్ప్రచారం చేసిన ఆర్గనైజ్డ్ క్రిమినల్ (వ్యవస్థీకృత నేరగాడు) చంద్రబాబు అని ధ్వజమెత్తారు. రాష్ట్రం శ్రీలంకలా దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అంటూ ఒక పద్ధతి ప్రకారం దుష్ఫ్రచారం చేశారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులపై చంద్రబాబు చేసిన దుష్ఫ్రచారాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. అధికారంలోకి వచ్చాక కూడా ఆర్థిక శాఖపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లకు చేరుకుందంటూ సీఎం చంద్రబాబు లీకులు ఇచ్చారని.. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చిత్రీకరిస్తూ సూపర్ సిక్స్, ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేశారని దుయ్యబట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ముందు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లంటూ గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని గుర్తు చేశారు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని తేలిందని ఎత్తి చూపారు. తద్వారా చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారన్నది బట్టయలైందని చెప్పారు. రాష్ట్ర అప్పులపై తాను చెప్పిందంతా అబద్ధమని తేలుతుందని.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కేటాయింపులపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఇన్నాళ్లూ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకాఏమన్నారంటే..ఎనిమిది నెలలయ్యాక బడ్జెట్ ప్రవేశపెట్టడమా? ⇒ ఈ బడ్జెట్ కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లా ఉంది. నిజంగా ఎవరైనా ఎన్నికలైన వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులు చేసి, వాటి అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారు. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 8 నెలలు గడిచాక.. కేవలం మరో నాలుగు నెలలు సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను చూస్తే ఆశ్చర్యమేస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు అన్నీ బయటకొస్తాయని ఇలా చేశారు. ⇒ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు కేటాయింపులు జరపకపోతే మా సూపర్ సిక్స్ ఏమైంది.. సూపర్ సెవెన్ ఏమైందని ప్రజలు నిలదీస్తారని తెలుసు కాబట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారు. దీనికి రకరకాల కారణాలు చెబుతూ వచ్చారు. పరిమితికి మించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని.. రాష్ట్రాన్ని శ్రీలంక చేసిందని.. ప్రజలను మభ్యపెట్టే విధంగా అబద్ధాలు ప్రచారం చేశారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెబుతూ.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే.. ఆయన ఏ స్థాయి డ్రామా ఆర్టిస్ట్ అన్నది స్పష్టమవుతోంది. బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలే ఇందుకు సాక్ష్యం.చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు ఆధారాలు ఇవిగో..05–04–2022: ‘రాష్ట్రం మరో శ్రీలంకగా తయారవుతుంది’ చంద్రబాబు స్టేట్మెంట్. ‘ఈనాడు’లో బ్యానర్ కథనం 13–04–22: ‘శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో?’ అని చంద్రబాబు మరో స్టేట్మెంట్ 19–04–22: చంద్రబాబు చెప్పిన అబద్ధాలను పట్టుకుని ‘మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే’ అంటూ ఈనాడు కథనం 17–05–22: ‘శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం’లోనే ఉందంటూ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ 21–07–22 : ’శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు’ అని అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్17–02–23 : ‘అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు అప్పు రత్న’ అని పేరు పెట్టాలంటూ దత్తపుత్రుడు మరో ట్వీట్ 25–10–23 : ‘రాష్ట్ర రుణం రూ.11 లక్షల కోట్లు’ అని చంద్రబాబు వదినమ్మ, బీజేపీలో టీడీపీ నాయకురాలు స్వయంగా చూసినట్లు, ఆమెకు తెలిసినట్లు స్టేట్మెంట్⇒ వీటిని బట్టి కొత్త పాత్రధారులు, వారి ఎల్లో మీడియా, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో కలిసి ఒక పద్ధతి ప్రకారం అప్పులపై గోబెల్స్ ప్రచారం చేశారని స్పష్టమవుతోంది. అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన సమా«ధానాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం. ఢిల్లీకి పోవడం.. రకరకాల ఏజెన్సీలకు లేఖలు రాయడం ఎందుకు? ‘వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు.. కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు.. ఇక్కడ ఏమెమో జరిగిపోతోందన్న భయం సృష్టించాలి’ అని పద్దతి ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ పోయారు.⇒ ఎన్నికలు సమీపించే సరికి అబద్ధాలు ముమ్మరం చేశారు. 2023 ఏప్రిల్ 7వ తేదీన ‘రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లు’ అని ఎన్నికలకు నెల ముందు చంద్రబాబు వదినమ్మ స్టేట్మెంట్. ఇందుకు వత్తాసుగా అదే నెల 21న ఒకాయనను పట్టుకొచ్చి.. ఆయనకు ఎకానమిస్ట్ అని బిళ్ల తగిలించి.. ‘రాష్ట్ర రుణాలు రూ.14 లక్షలు కోట్లు’ అని చెప్పించారు. ఆ తర్వాత మిగిలిన వాళ్లు వరుసగా ఇదే పాట అందుకున్నారు. ఒక పద్దతి ప్రకారం అబద్ధాల ప్రచారం జరిగింది.మాకు రూ.42,183.80 కోట్ల బకాయిల బహుమతి⇒ చంద్రబాబు పోతూ పోతూ రూ.42,183.80 కోట్ల బకాయిలు మాకు గిఫ్ట్‌గా ఇచ్చి పోయాడు. అవన్నీ మేము కట్టాం. ఉపాధి హామీ బకాయిలు రూ.2,340 కోట్లు, ఉద్యోగులకు రెండు డీఏలు బకాయి పెట్టాడు. ఆరోగ్యశ్రీ రూ.640 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రూ.2,800 కోట్లు, రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తన బకాయిలు రూ.380 కోట్లు, పంటల బీమా బకాయిలు రూ.500 కోట్లు, చివరికి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు, కోడిగుడ్లకు కూడా బకాయిలు పెట్టాడు.⇒ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఏ ప్రభుత్వ హయాంలోనైనా కొన్ని బకాయిలు మామూలే. ఏటా ఈ బకాయిలు క్లియర్ అవుతూనే ఉంటాయి. దీన్నేదో చంద్రబాబు వక్రీకరించి.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టాలనే దూరపు ఆలోచనతో కొత్త కథను బిల్డప్ చేస్తున్నాడు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు అబద్ధాలకు రెక్కలు కట్టాడు. ఇలా చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్‌లో ఎవరెవరు భాగస్వాములై ఉన్నారో సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెట్టాను. రాజకీయ లబ్ధి కోసమే అప్పులపై దుష్ఫ్రచారం⇒ ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా అప్పులు చేయడం బడ్జెట్లో భాగం. ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రభుత్వానికి ఎంత పర్సంటేజ్‌లో అప్పులు చేయాలో ఎఫ్ఆర్బీఎం నిర్దేశిస్తుంది. ఏ ప్రభుత్వమైనా జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతంలోపే అప్పులు తీసుకుంటుంది. అంతకు మించి తీసుకునే అవకాశం ఉండదని అందరికీ తెలుసు.⇒ చంద్రబాబు, ఆయన కూటమి, ముఠా సభ్యులు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఏ విధంగా ప్రచారం చేశారో అందరికీ తెలిసిందే. ఏ బ్యాంకు అయినా ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వాలంటే ఒక పద్ధతి ఉంటుంది. కార్పొరేషన్ల ద్వారా కూడా ఇష్టమొచ్చినట్టు రుణాలు తీసుకోవడానికి అవకాశం లేదు. చంద్రబాబు సుందర ముఖారవిందం చూసో, జగన్ ముఖారవిందం చూసో ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వవు. ఇవన్నీ వాస్తవాలు. కేవలం వారు రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇలా చేశారని స్పష్టమైంది.అధికారంలోకి వచ్చాక కూడా విష ప్రచారమే⇒ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన తప్పుడు ప్రచారం మానలేదు. అదే విష ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. జూలై 10వ తేదీన ఆర్థిక శాఖపై సమీక్ష చేస్తూ ‘రాష్ట్రం మొత్తం అప్పులు రూ.14 లక్షల కోట్లు’ అని లీకులిస్తాడు. ఈనాడులో రాస్తారు.. ఈటీవీలో చూపిస్తారు. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు చంద్రబాబుకు కారణాలు కావాలి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్’కు కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారని తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన దుష్ప్రచారం కొనసాగించారు.⇒ ఒక పద్దతి ప్రకారం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లను తెరమరుగు చేసే కార్యక్రమం. హామీలిచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అయినా ప్రజలను మోసం చేయాలి. మోసం చేసే సమయంలోనైనా కనీసం నిజాయితీతో మిమ్మల్ని మోసం చేస్తున్నాం అని చెప్పడానికి మళ్లీ జగన్ కావాలి. అందుకోసం రంగం సిద్ధం చేస్తున్నాడు.బడ్జెట్ సాక్షిగా దుష్ఫ్రచారం బట్టబయలు⇒ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్టానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి. అది తప్పనిసరి. ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి ఎవరి హయాంలో ఎంత అప్పులున్నాయో స్పష్టంగా వాళ్లే పేర్కొన్నారు. 14, 16 పేజీలను గమనిస్తే.. 2018–19 నాటికి.. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి అప్పులు రూ.2,57,509 కోట్లు. వీటికి ప్రభుత్వ గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కూడా కలుపుకుంటే మరో రూ.55వేల కోట్లు. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి (2018–19) రూ.3.13 లక్షల కోట్ల అప్పులున్నాయి. ⇒ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.3.13 లక్షల కోట్లు ఉన్న అప్పులు, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4.91,774 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు.. రెండు కలిపితే రూ.6.46 లక్షల కోట్లు. ఈ వివరాలను వాళ్లే స్పష్టం చేశారు. అలాంటప్పుడు వాళ్లు ప్రచారం చేసినట్టుగా ఎక్కడ రూ.10 లక్షల కోట్లు, ఎక్కడ రూ.11 లక్షల కోట్లు, ఎక్కడ రూ.12.50 లక్షల కోట్లు, ఎక్కడ రూ.14 లక్షలు కోట్లు అప్పులు? ఇవన్నీ దుష్ప్రచారాలే కదా?అప్పుల రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి?⇒ ఎవరెవరి హయాంలో ఎంతెంత అప్పులు చేశారో అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు (డెట్ కాంపౌండ్ గ్రోత్ రేటు) ఎంతుందో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. ఆయన దిగిపోయేసరికి రూ.3.13 లక్షల కోట్లు అప్పులుగా ఉన్నాయి. అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) 19.54 శాతం. అదే మా హయాంలో అప్పు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 15.61 శాతం. అంటే.. చంద్రబాబు కంటే 4 శాతం తక్కువగా అప్పులు చేశాం.⇒ ఇక ప్రభుత్వ రంగ సంస్థల నాన్ గ్యారంటీ అప్పులు చూసినా.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లు ఉన్న నాన్ గ్యారంటీ అప్పులు.. ఆయన దిగిపోయే నాటికి రూ.77,228 కోట్లకు చేరాయి. పవర్ సెక్టార్, డిస్కమ్‌లకు చేసిన అప్పులు ఏకంగా 54.98 శాతం పెరిగాయి. మేము డిస్కమ్‌లు కాపాడేందుకు, పబ్లిక్ సెక్టార్, నాన్ గ్యారంటీడ్ లయబులిటీస్ అయినా సరే దాన్ని తగ్గించే కార్యక్రమం చేశాం. రూ.77,228 కోట్ల నుంచి రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే మా హయాంలో రుణం పెరగకపోగా – 0.48 శాతం తగ్గించాం. ⇒ ప్రభుత్వ అప్పు, గ్యారంటీ అప్పు,. నాన్ గ్యారంటీ అప్పులు అన్ని కలిపి చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2014 నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉంటే.. ఆయన దిగేపోయే సరికి రూ.3.90 లక్షల కోట్లు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతం ఉంటే.. మా హయాంలో రూ 3.90 లక్షల కోట్లు రూ.7.21 లక్షల కోట్లు అయ్యింది. 13.57 శాతంగా అప్పుల వార్షిక వృద్ధి రేటు నమోదైంది. అది కూడా రెండేళ్లు కోవిడ్ దుర్భర పరిస్థితుల్లో. నిజంగా ఏదైనా అవార్డు ఇవ్వాలంటే మా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, అప్పుల రత్న బిరుదు చంద్రబాబుకు ఇవ్వాలి. -
సూపర్‌సిక్స్, బడ్జెట్ అంతా మోసం: వైఎస్ జగన్
-
అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు
-
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకు స్కెచ్..
-
ఏపీ బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు మొండిచేయి. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులకు కేటాయింపులు నిల్