
తిరుపతి, సాక్షి: సొంత డబ్బా కొట్టుకోవడంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు దిట్ట అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఓవైపు ప్రజలను మోసం చేస్తూనే.. వైఎస్సార్‌సీపీకి సానుభూతిపరులెవరూ ఉండకూడదని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారాయన.
సాధ్యంకాని హామీలిచ్చి టీడీపీ-జనసేన కూటమి ప్రజలను మోసం చేసింది. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ చెప్పిందే సత్యమని ఎల్లో మీడియా బాకా ఊదుతోంది. చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్‌పై విమర్శలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ఒక చరిత్ర.. కొన్ని నిజాలు పుస్తకం నుంచి చంద్రబాబుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను భూమన మీడియాకు చదివి వినిపించారు.

Comments
Please login to add a commentAdd a comment