1/12
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, వార్షిక బడ్జెట్‌పై బుధవారం మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడువైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
2/12
దురదృష్టవశాత్తూ 8 నెలలు అయిపోయాక, ఇంకో నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముందే బడ్జెట్ ప్రవేశపెడితే చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు బయటపడతాయని, ప్రజలు తమ హామీలు అడుగుతారన్న భయంతో ఇన్నాళ్లు సాగదీస్తూ వచ్చారు
3/12
బడ్జెట్‌లో చెప్పిన అంశాలు, గణాంకాలు చూస్తే, చంద్రబాబు ఎంత డ్రామా ఆర్టిస్ట్ అన్నది స్పష్టమైంది.ఆయన ఆర్గనైజ్డ్ క్రిమినల్
4/12
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్లాన్ ప్రకారం దుష్ప్రచారం చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అప్పులు రాకూడదని, కేంద్రం సహకరించొద్దని చూసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన దుష్ప్రచారం మానలేదు.హామీలు అమలు చేయడం ఆయనకు అలవాటు లేదు. అందుకే అదే విష ప్రచారం చేశారు.
5/12
చంద్రబాబు సూపర్‌సిక్స్‌లో ఏమన్నాడు? యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి. అంటే రూ.7,200 కోట్లు. ఎక్కడైనా బడ్జెట్ లో కనిపించిందా?
6/12
చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? 2.60 లక్షల మంది వాలంటీర్లను రోడ్డుపై పడేశారు. ఉద్యోగాలు కట్. 15 వేల మంది ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లో పని చేస్తున్న వారిని ఉద్యోగాల్లోంచి తీసేశారు.
7/12
ఐదున్నర నెలల్లోనే ఏకంగా 110 మంది మహిళలు, చిన్నారుల మీద అత్యాచారాలు ఈ ఐదున్నర నెలల్లోనే జరిగాయి. ఇందులో 11 మంది చనిపోయారు.– పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదు. వారు రోడ్డెక్కుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2300 కోట్లు దాటాయి. వారు రోడ్డెక్కుతున్నారు. 108, 104 సిబ్బంది ధర్నా చేస్తున్నారు.
8/12
చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.1,32,079 కోట్లు కాగా, ఆయన పదవి నుంచి దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.3,13,018 కోట్లు. ఏటా సగటున 19.54 శాతం చొప్పున అప్పులు పెరిగాయి.
9/12
మేము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర అప్పులు రూ.3,13,018 కోట్ల నుంచి రూ.6,46,531 కోట్లకు పెరిగాయి. అంటే ఏటా సగటున 15.61 శాతం చొప్పున అప్పులు పెరిగాయి. చంద్రబాబు హయాంలో కన్నా, 4 శాతం తక్కువ.
10/12
సూపర్‌సిక్స్ ఒక మోసం. సూపర్ సెవెన్ ఒక మోసం. బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక మోసం. రోజూ డైవర్షన్ టాపిక్స్. వీటన్నింటినీ ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 680 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు నోటీసులు. 147 మంది మీద కేసులు. 49 మందిని అరెస్టు చూపారు.
11/12
నీ సూపర్ సిక్స్‌కు కావాల్సిన బడ్జెట్ రూ.74 వేల కోట్లు. కానీ కేటాయింపు లేదు. నీవు చేసింది మోసం కాదా? చెప్పేది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఇది ఆర్డనైజ్డ్ క్రైమ్ కాదా?.. అని నేను ట్వీట్ చేస్తున్నాను. నా ఎమ్మెల్యే అభ్యర్థులు, మా పార్టీ నాయకులంతా ట్వీట్ చేయబోతున్నారు. నీపై 420 కింద కేసు ఎందుకు పెట్టకూడదు?.
12/12
వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తున్నా. ఈ రెండూ పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్ చేయండి. ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్.. అన్నింట్లో పెట్టండి.– ఎంత మందిని అరెస్టు చేస్తారో చూద్దాం. అరెస్టు చేయడం మొదలు పెడితే, నాతోనే స్టార్ట్ చేయమని చెబుతాను.