1/15
అప్పులపై చంద్రబాబు అదే దుష్ప్రచారం
2/15
బడ్జెట్ పేజీ నెం.14. 16 రెండు పేజీలు చూస్తే.. రాష్ట్ర అప్పులు 2018–19 నాటికి రూ.2.57 లక్షల కోట్లు అని చూపారు. దానికి గవర్నమెంట్ గ్యారెంటీ రూ.55 వేల కోట్లు కూడా కలిపితే అప్పటికి రాష్ట్ర అప్పు మొత్తం రూ.3.13 లక్షల కోట్లు.
3/15
అలాగే 2024లో వైఎస్సార్‌సీపీ దిగిపోయే నాటికి ఉన్న అప్పులను అదే పేజీలో చూపారు. అప్పులు రూ.4.91 లక్షల కోట్లకు ఎగబాయాయని, గవర్నమెంట్ గ్యారెంటీ అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు, రెండూ కలిపితే మొత్తం అప్పు 6.46 లక్షల కోట్లు అని తేల్చారు.
4/15
అది బడ్జెట్‌లోనే కాకుండా, 2023–24లో కాగ్ రిపోర్ట్ (పేజీ నెం.18. 20)లో చూపారు.
5/15
చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. నీకు కుటుంబం ఉంది. మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. కానీ నీవు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు ఎవరూ చేయరు. నేను చంద్రబాబును ఒకటే అడుతున్నాను. నేను సీఎంగా ఉన్నప్పుడు, ఆయన విపక్షంలో ఉన్నప్పుడు తన ఆఫీస్‌లో తన పార్టీ అఫీషియల్ ప్రతినిధితో నన్ను ఏమని తిట్టించాడు.. బోస్‌డీకే అని. అది ధర్మమేనా?. ఇదే చంద్రబాబునాయుడు నా చెల్లెలు షర్మిల మీద, హైదరాబాద్, జూబిలీహిల్స్ రోడ్ నెం.36లో ఆయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ తన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి తప్పుడు వార్తలు రాయించలేదా? పోలీసుల దర్యాప్తులో అది తేలలేదా
6/15
ఎవరి హయాంలో ఎంతెంత అప్పు?:
7/15
చంద్రబాబు హయాంలో కోవిడ్ వంటి మహమ్మారి లేదు. అదే మా హయాంలో రెండేళ్లు ఆ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా చూస్తే.. – చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్ల అప్పు ఉండగా, 2019 నాటికి అది రూ.3.13 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే అప్పులు ఏటా సగటున 19.54 శాతం పెరిగాయి.
8/15
అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లు కాగా, ఆ పెరుగుదల (సీఏజీఆర్) 15.61 శాతం మాత్రమే. అంటే చంద్రబాబు హయాంలో కంటే మా హయాంలో 4 శాతం తక్కువ.
9/15
అలాగే నాన్ గ్యారెంటీ అప్పులు కలిపి చూసినా, చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8600 కోట్లు ఉంటే, 2019 నాటికి అవి రూ.77వేల కోట్లకు చేరాయి.
10/15
అదే మా హయాంలో ఆ అప్పులను రూ.2 వేల కోట్లు తగ్గించాం. అంటే మేము దిగిపోయేనాటికి నాన్ గ్యారెంటీ అప్పులు రూ.75వేల కోట్లు.
11/15
ఆ మేరకు చంద్రబాబు హయాంలో నాన్ గ్యారెంటీ అప్పులు 54.98 శాతం పెరిగితే, మా హయాంలో అది –0.48 శాతం.
12/15
13/15
14/15
15/15