1/11
తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు నిజ స్వరూపాన్ని, రాజకీయ కుట్రను సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది.
2/11
దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని చంద్రబాబు సిట్‌ను కోర్టు రద్దు చేసింది.
3/11
చంద్రబాబుకు వ్యక్తిత్వం ఉంటే ముందుగా ప్రజలను క్షమాపణ కోరాలి. తప్పు జరిగిందని తిరుమల స్వామి వారిని వేడుకోవాలి.
4/11
తన రాజకీయ ప్రయోజనం కోసం, దేవుడంటే, భయం భక్తి లేకుండా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇంత జరిగినా కనీసం పశ్చాత్తాపం లేదు.
5/11
లడ్డూ విషయంలో టీటీడీ ఈవో నిజం చెప్పినా.. చంద్రబాబు వక్రీకరించారు. పదే పదే అబద్దమే ప్రచారం చేశారు.
6/11
ధర్మారెడ్డి నాకు బావా?. కరుణాకర్‌రెడ్డి నాకు మామ అంట. మనిషి అన్నాక కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా?. టీడీపీ సోషల్ మీడియా అత్యంత నీచంగా వ్యవహరిస్తోంది.
7/11
ఇవన్నీ విషయాలు వెలుగులోకి వచ్చాయంటే దేవుడి దయతోనే. వెంకటేశ్వరస్వామినే నడిపిస్తున్నాడు. ఆయనే వారికి మొట్టికాయలు వేస్తాడు.
8/11
దేవుడి విషయంలో బాబు తప్పుడు కూతలు కూసినా ఎత్తి చూపకపోవడం ఎంత వరకు కరెక్ట్?. అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేయడమేనా పవన్ వైఖరి?.
9/11
పవన్‌కు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా?
10/11
తెలిసి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటారా?.
11/11
రాబోయే రోజుల్లో దేవుడి కోపం రాష్ట్ర ప్రజలపై పడకూడదని దేవుడిని కోరుకుంటాను. చంద్రబాబు, కూటమి నేతలకే పరిమితం కావాలి.