చంద్రబాబూ.. మీకిది తగునా?: లేఖ రాసిన ముద్రగడ | Mudragada Satiric Letter To Chandrababu Over Super Six | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. మీకిది తగునా?: లేఖ రాసిన ముద్రగడ

Nov 15 2024 9:56 AM | Updated on Nov 15 2024 10:58 AM

Mudragada Satiric Letter To Chandrababu Over Super Six

కాకినాడ, సాక్షి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ కీలక నేత ముద్రగడ లేఖ రాశారు. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సిక్స్ హామీలిచ్చి.. వాటిని ఎత్తేసే ప్రయత్నాలు చేయొద్దని లేఖలో చంద్రబాబుకి ముద్రగడ హితవు పలికారు.

‘‘ఇచ్చినా హమీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీలాంటి సినియర్ రాజకీయ నాయకులకు తుగునా?. మీ దొంగ సూపర్ సిక్స్ హమీలను తలచుకుంటే భయం వేస్తొంది. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. సూపర్ సిక్స్ అమలు చేయాలంటే కోట్లాది రూపాయాల నిధులు కావాలని మీకు తెలియదా?.

తెలిసి అబద్దాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు. ప్రజలకు సూపర్ సిక్స్ గుర్తుకు రాకుండా తిరుపతి ప్రసాదం,రెడ్ బుక్ రాజ్యంగం, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను అరెస్ట్ చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మీకు వెన్నతో పెట్టిన విద్య అని ముద్రగడ తీవ్రంగా విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement