Mudragada Padmanabha Reddy
-
YSRCP నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి
-
కూటమి కార్యకర్త హల్చల్.. ముద్రగడ ఇంటిపై దాడి
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి పాలనలో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసం వద్ద జనసేన కార్యకర్త హల్చల్ చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. అనంతరం, అక్కడ బీభత్సం సృష్టించాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.అనంతరం, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన దాడిని పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, ముద్రగడ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. ముద్రగడ గిరికి కీలక బాధ్యతలు
-
చంద్రబాబూ.. మీకిది తగునా?: లేఖ రాసిన ముద్రగడ
కాకినాడ, సాక్షి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ కీలక నేత ముద్రగడ లేఖ రాశారు. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సిక్స్ హామీలిచ్చి.. వాటిని ఎత్తేసే ప్రయత్నాలు చేయొద్దని లేఖలో చంద్రబాబుకి ముద్రగడ హితవు పలికారు.‘‘ఇచ్చినా హమీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీలాంటి సినియర్ రాజకీయ నాయకులకు తుగునా?. మీ దొంగ సూపర్ సిక్స్ హమీలను తలచుకుంటే భయం వేస్తొంది. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. సూపర్ సిక్స్ అమలు చేయాలంటే కోట్లాది రూపాయాల నిధులు కావాలని మీకు తెలియదా?.తెలిసి అబద్దాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు. ప్రజలకు సూపర్ సిక్స్ గుర్తుకు రాకుండా తిరుపతి ప్రసాదం,రెడ్ బుక్ రాజ్యంగం, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను అరెస్ట్ చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మీకు వెన్నతో పెట్టిన విద్య అని ముద్రగడ తీవ్రంగా విమర్శించారు. -
పేరు మారినా.. ముద్రగడ.. ముద్రగడే..
-
వైఎస్ జగన్‌ను కలిసిన ముద్రగడ, కాసు మహేష్‌రెడ్డి
-
ఇది మంచి పద్ధతి కాదు.. ముద్రగడ ఆవేదన
కాకినాడ, సాక్షి: కాపుల రిజర్వేషన్ సాధించేందుకు పవన్ కల్యాణ్‌కు మంచి అవకాశం దొరికిందని.. అలాగే రాష్ట్ర ప్రత్యేక హోదా సాధించేందుకు ఓ అడుగు ముందుకు వేయమని కాపు ఉద్యమనేత, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సూచించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.‘‘పవన్ అభిమానులు బూతులు తిడుతున్నారు. అంతకంటే మమ్మల్ని చంపేయమని అడుగుతున్నాం. మేం ఎవరికీ అడ్డుపడం.. మాకు ఎవరూ లేరు. మేం అనాథలం’’ అని ఆవేదనగా మాట్లాడారాయన.గత ఎన్నికల్లో పవన్ మీద చేసిన సవాల్ ప్రకారం నా పేరు మార్చుకున్నాను. దీనికి సంబంధించిన గెజిట్ పేపర్లు ఆయన కు పంపిస్తున్నాను. పవన్ ను ప్రేమించే కాపు,బలిజ యువత నిత్యం బూతు సందేశాలు పెడుతున్నారు. ఇది మంచి పద్దతి కాదని నా అభిప్రాయం. అలా కాదంటారా.. మీ మనుషులను పంపి మా కుటుంబాన్ని చంపేయండి అని అన్నారాయన.