ఇది మంచి పద్ధతి కాదు.. ముద్రగడ ఆవేదన | Mudragada's Cry Moment For Pawan Kalyan Fans Harassment | Sakshi
Sakshi News home page

ఇది మంచి పద్ధతి కాదు.. ముద్రగడ ఆవేదన

Published Fri, Jun 21 2024 1:01 PM | Last Updated on Fri, Jun 21 2024 1:33 PM

Mudragada's Cry Moment For Pawan Kalyan Fans Harassment

కాకినాడ, సాక్షి: కాపుల రిజర్వేషన్‌ సాధించేందుకు పవన్‌ కల్యాణ్‌కు మంచి అవకాశం దొరికిందని.. అలాగే రాష్ట్ర ప్రత్యేక హోదా సాధించేందుకు ఓ అడుగు ముందుకు వేయమని కాపు ఉద్యమనేత, వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సూచించారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘పవన్‌ అభిమానులు బూతులు తిడుతున్నారు. అంతకంటే మమ్మల్ని చంపేయమని అడుగుతున్నాం. మేం ఎవరికీ అడ్డుపడం.. మాకు ఎవరూ లేరు. మేం అనాథలం’’ అని ఆవేదనగా  మాట్లాడారాయన.

గత ఎన్నికల్లో పవన్ మీద చేసిన సవాల్ ప్రకారం నా పేరు మార్చుకున్నాను. దీనికి సంబంధించిన గెజిట్ పేపర్లు ఆయన కు పంపిస్తున్నాను. పవన్ ను ప్రేమించే కాపు,బలిజ యువత నిత్యం  బూతు సందేశాలు పెడుతున్నారు. ఇది మంచి పద్దతి కాదని నా అభిప్రాయం. అలా కాదంటారా.. మీ మనుషులను పంపి మా కుటుంబాన్ని చంపేయండి అని అన్నారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement