
సాక్షి, పిఠాపురం: ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు 2000-3000 ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
కాకినాడ నియోజకవర్గంలో కూటమి నేతలు రెచ్చిపోయి ఓటుకు నోటుకు పాల్పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు పట్టపగలే డబ్బుల పంచుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కు ఓటు వేస్తే 3000 అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అలాగే, మున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఓటుకు 3000 రూపాయలను ఓట్లరకు పంచుతున్నారు. ఓట్లరకు డబ్బు పంపిణీ చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

కృష్ణా జిల్లాలో సైతం ఇలాగే జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు ఓట్లరను ప్రలోభాలు గురిచేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే టీడీపీ నేతల బరితెగిస్తున్నారు. ఓట్లుకు 2000 అంటూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పెడనలో పోలింగ్ కేంద్రం వద్దే డబ్బులు ఇచ్చారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాద్ నగదును ఓటర్లు అందిస్తున్నారు.
విశాఖలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈసీ ఆంక్షలు లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలలో నాయకులతో కలిసి హడావిడి చేస్తున్నారు. చంద్రపాలెం స్కూల్‌లోకి నేరుగా వాహనంతో వెళ్లిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. కానీ, అధికారులు మాత్రం ఆయనకు అడ్డుచెప్పకపోవడం గమనార్హం.

ఎన్టీఆర్ జిల్లాలో ఇలా..
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన గుంటూర్ ఆక్స్ ఫర్డ్ స్కూల్ యాజమాన్యం. జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని యాజమాన్యం. 144 సెక్షన్ అమలులో ఉన్నా పట్టించుకోని వైనం. ఓటు వేయకుండా ఉపాధ్యాయులను నిర్బంధించిన యాజమాన్యం. ఇదేమిటని ప్రశ్నించిన మీడియాకు పొంతలేని సమాధానం చెప్పిన సిబ్బంది. పుట్టినరోజు వేడుకలు కోసమే ఉపాధ్యాయులను పిలిచినట్లు సమాధానం. చివరకు మీడియా అక్కడికి చేరుకోవడంతో ఉపాధ్యాయులను వదిలిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment