సాక్షి,గుంటూరు:తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో అంబటి రాంబాబు శుక్రవారం(ఫిబ్రవరి7) మీడియాతో మాట్లాడారు.
‘అధికారంలోకి వచ్చేందుకు కూటమి నేతలు అసత్యాలు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడు వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. హామీల అమలులో 40 ఏళ్ల నారా చంద్రబాబు అనుభవం ఏమైంది. కూటమి పాలనలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాపై ఆరోపణలు చేస్తున్నారు’అని అంబటి రాంబాబు మండిపడ్డారు.
అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..
- కూటమి అసమర్ధ పాలనపై వైఎస్ జగన్ ప్రజలకు వివరించి చెప్పారు
- ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వివరంగా వివరించారు
- 8 మాసాల కూటమి పాలనలో అన్ని మోసాలు, దాడులు, అరాచకాలే
- 40 ఏళ్ల అనుభవం కలిగి నాలుగుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు.
- వైఎస్ జగన్ అమలుకు సాధ్యం కానీ హామీలను ఇవ్వరు
- చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా సాధ్యం కాదు అని చెప్తున్నారు
- వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేక పోతున్నారు..
- జగన్ హాయంలో 14 లక్షల కోట్ల అప్పులు అని అబద్ధం చెప్పారు
- బడ్జెట్‌లో 6 లక్షల కోట్లు అని చూపించారు
- ఎల్లో మీడియా కోసం తప్పుడు లెక్కలు, అబద్ధాలు చెపుతున్నారు
- 2.73 లక్షల కోట్లు డైరెక్ట్ గా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు వైఎస్ జగన్ వేశారు.
- ఎన్నికల ముందు సంపద సృష్టిస్తా అన్నారు
- మంచంలో ఉన్న ముసలి ఆమె కూడా నొక్కుతుంది బటన్ అన్నారు
- చంద్రబాబు ముసలి వాడే కదా బటన్ ఎందుకు నొక్కలేక పోతున్నారు
- ఆయన వల్ల కాకపోతే ఆయన తనయుడు నారా లోకేష్ యువకుడే కదా ఆయనతో నొక్కించ వచ్చు కదా బటన్
- ఏ మాత్రం ప్రమేయం లేని మిథున్ రెడ్డి గారికి లిక్కర్ స్కాం అంట కడుతున్నారు
- ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీకు జీతాలు అన్నారు
- ఒక్క నెల మాత్రమే 1వ తేదీ ఇచ్చారు
- దావోస్ పర్యటనలో ఏపీకి పెట్టుబడులు రాలేదు
- రెడ్‌బుక్ అంటే పరిశ్రమలు ఎలా వస్తాయి
- కూటమి ప్రజా ప్రతినిధులకు దమ్ము, ధైర్యం ఉంటే నిన్న వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
- టీడీపీ నేతల రాజకీయ బతుకు అంతా అబద్ధాలు, మోసం
- చెత్త వాగుడు, కారుకూతలు పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలి
- గుంటూరుకు మూడు ఆర్వోబీలు వచ్చాయి అని గొప్పలు చెపుతున్నారు
- కాగితాల మీద చాలా అవుతాయి. రియాల్టీ లో అవ్వాలి
- గ్యారెంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ జ్వరం, వెన్నుపూసలో నొప్పి అని ఇంట్లో పడుకున్నాడు
- బటన్ నొక్కమంటే విషం కక్కుతున్నాం అంటే ఎలా.
- రోడ్ల గుంతలు పూడ్చటానికి రూ. 26 వేల కోట్లు అప్పు చేశారు.
- డొక్కా మీద నేను మాట్లాడాల్సిన అవసరం లేదు
- పవన్ కళ్యాణ్ నిజంగా సిక్ అయ్యాడా..? షూటింగ్‌లో ఉన్నాడా తెలీదు.
- పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు, నారా లోకేష్ మీద అలకపునాడు ఏమో నాకు తెలీదు
- చంద్రబాబు రెడ్ బుక్ ఓపెన్ చేసిన తరువాత కేసులు నమోదు అవుతాయి.
- నా మీద ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు
Comments
Please login to add a commentAdd a comment