![Chandrababu Is Brand Ambassador For Fraud Says Kurasala Kannababu - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/2/kurasala-kannababu.jpg.webp?itok=orl7WZzf)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కురసాల కన్నబాబు
సాక్షి, తూర్పు గోదావరి : కాపు రిజర్వేషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసానికి బ్రాండ్ అంబాసిడరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడారాయన. కాపులను రాజకీయంగా వాడుకునే విధానాన్ని బాబు మానుకోవాలని హితవుపలికారు. కాపులను ఓటు బ్యాంకుగా టీడీపీ వాడుకోవడాన్ని అందరూ గమనించారని తెలిపారు. హోదా విషయంలో మాట మార్చి తోకముడిచింది చంద్రబాబేనని అన్నారు.
వైఎస్ జగన్ రియల్ హీరో
తూర్పు గోదావరి : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రియల్ హీరో అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తోకముడిచే నైజం జగన్‌ది కాదని, సోనియాతో పోరాడిన వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి విజయవాడకు పరుగులు పెట్టారని పేర్కొన్నారు. కేసులపై స్టేలు తెచ్చుకుని తోక ముడిచింది చంద్రబాబేనని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment