Dwarampuidi Chandrasekhara Reddy
-
గెలుస్తాననే నమ్మకం నాకు లేదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘నేను గెలుస్తాననే నమ్మకం నాకు లేదు. కానీ, పోరాటం మాత్రం ఆపేది లేదు’.. అని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. ‘కీడెంచి మేలెంచాలనే ఈ విషయం మీకు చెబుతున్నాను. నన్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. అయినా భయపడేదిలేదు. కులాన్ని చూడకండి. తెలంగాణ ప్రజల మాదిరిగా కులం కంటే నా ఆంధ్రా అనే భావన అందరిలోనూ రావాలి’.. అని ఆయన అన్నారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి జిల్లా కేంద్రమైన కాకినాడలోని సర్పవరం జంక్షన్లో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ‘మీరు అండగా నిలబడితే నేను, జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తాం. నాకు ఫలానా కులం ఎక్కువ, మరో కులం తక్కువ అనేది లేదు. అధికారం లేకున్నా 2008 నుంచి మీకోసం పోరాడుతూనే ఉన్నాను’.. అని చెప్పారు. రాజకీయం వేరు, సినిమాలు వేరని అన్నారు. సభలకు రావడం కాదు.. ఎన్నికల్లో ఓటేసి సత్తా చాటాలని, గత ఎన్నికల్లో పార్టీలపై కోపంతో నోటాకు వేసిన 3–4 శాతం ఓట్లను ఈసారి జనసేనకు వేయాలని పవన్ వేడుకున్నారు. మధ్యతరగతి మేధావులు మౌనంగా ఉండటమే ప్రశాంత ఆంధ్రప్రదేశ్ క్రిమినల్స్‌కు అడ్డాగా మారడానికి కారణమని ఆయన ఆరోపించారు. అన్యాయం జరుగుతున్నప్పుడు యువత మేలుకోకపోతే అరాచకాలు పెరిగిపోతాయన్నారు. దళితులకు సీఎం అన్యాయం చేశారు దళిత యువతకు సంబంధించిన 18 పథకాలు రద్దుచేసిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలని పవన్ ప్రశ్నించారు. అంబేడ్కర్ విదేశీ విద్యను జగనన్న విదేశీ విద్యగా మార్చుకుని దళితులకు అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని డీజీపీ చెబుతున్న దానికి, వాస్తవ పరిస్థితికి అసలు పోలికేలేదన్నారు. నిన్నగాక మొన్న బాపట్ల జిల్లాలో సోదరిని వేధిస్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు ఒక గౌడ యువకుడిని దహనం చేయడం.. ప్రొద్దుటూరులో ఒక యువతిపై సామూహిక అత్యాచారం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నా... రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ చెబుతున్న తీరు సరికాదన్నారు. రాష్ట్రంలో క్రిమినల్ ఎంపైర్‌ను నేలమట్టం చేసి, సీఎంను రోడ్డు మీదకు తీసుకువస్తానన్నారు. నన్ను ఓడించడానికి రూ.200 కోట్లు ఖర్చు.. ఇక భీమవరంలో ఉన్న ఓటింగ్ కంటే అధికంగా ఓటింగ్ జరిగిందని.. తనను ఓడించేందుకు రూ.200 కోట్లు ఖర్చుచేయాలనుకుంటున్నారని పవన్‌కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై గతంలో జనసైనికులు ఫొటోలు తీసి దేశం దృష్టికి తీసుకువెళ్లినట్లుగానే హ్యాష్‌ట్యాగ్ ద్వారా ఇక్కడ జరుగుతున్న అవినీతి, దోపిడీపై ఫొటోలు తీసి కేంద్ర హోంశాఖ, రాష్ట్ర డీజీపీ, జనసేన కార్యాలయాలకు ట్యాగ్ చేయాలని పవన్ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ద్వారంపూడి లక్ష్యంగా.. ఇక గంటంపావు సేపు సాగిన పవన్ ప్రసంగంలో మూడొంతుల సమయం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై విమర్శలే లక్ష్యంగా సాగింది. కాకినాడ పోర్టులో అక్రమంగా బియ్యం ఎగుమతుల ద్వారా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. నాడు వీర మహిళలను దుర్భాషలాడి కొట్టించావని.. అందుకు మూల్యం చెల్లించుకుంటావని.. చంద్రశేఖర్ పతనం ఈరోజే మొదలైందని ఆయన అన్నారు. అంతేకాక.. ‘నువ్వు చేసే భూకబ్జాలు, అక్రమాల చిట్టా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఉంది. నిన్నూ, నీ ముఖ్యమంత్రిని ఓడించకపోతే నేను పవన్‌కళ్యాణ్‌నే కాదు.. మా పార్టీ జనసేనే కాదు.. మీ డి–గ్యాంగ్‌ను సాగనంపే సమయం ఆసన్నమైంది’ అని పవన్ సవాల్ చేశారు. -
ఓటమి భయంతో కాకినాడలో తోక ముడిచిన టీడీపీ
కాకినాడ: నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ ముందే తోక ముడిచింది. ఈ ఎన్నికలో తమ పార్టీ పాల్గొనడం లేదంటూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంగళవారం ప్రకటించారు. రెండో డిప్యుటీ మేయర్ ఎన్నికకు ప్రభుత్వం జీఓ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాకినాడ కార్పొరేషన్లో రాజకీయం రసకందాయంలో పడింది. నాటి ఎన్నికల్లో టీడీపీకి 32 మంది కార్పొరేటర్లతో మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఒంటెద్దు పోకడలు, పార్టీ పట్ల అంకిత భావంతో పని చేసే వారిపై వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరితో చాలాకాలంగా టీడీపీ కార్పొరేటర్లు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఆయన విధానాలు నచ్చక టీడీపీ మాజీ నగర అధ్యక్షుడు నున్న దొరబాబు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. తాజాగా మెజార్టీ కార్పొరేటర్లు కూడా బయటకొచ్చేశారు. ప్రస్తుతం మేయర్‌తో కలిపి పది మందికి మించి కార్పొరేటర్లు కూడా ఆ పారీ్టలో లేరు. రాజకీయాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా ఏకతాటిపై పని చేస్తామంటూ వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీ కార్పొరేటర్లు ఏకాభిప్రాయానికి వచ్చారు. వారు తమ నిర్ణయాన్ని మీడియా ముందు ప్రకటించడంతో టీడీపీ కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది. దీంతో ఎన్నికలకు ముఖం చాటేయాలనే నిర్ణయానికి వచ్చింది. సంక్షేమానికి జై .. కాకినాడలోని 45 మంది కార్పొరేటర్లలో 35 మంది ఒక్కటిగా కలిసి ఉంటామంటూ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో మంగళవారం మీడియా ముందు ప్రకటించారు. 2017 ఎన్నికల్లో 48 డివిజన్లకు ఎన్నికలు జరగగా టీడీపీ 32, వైఎస్సార్ సీపీ 10, బీజేపీ 3, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలిచారు. ముగ్గురు మృతి చెందగా ప్రస్తుతం 45 మంది ఉన్నారు. వీరిలో 35 మంది పార్టీ రహితంగా జగన్‌కు జై కొట్టారు. మేయర్ సుంకర పావని సహా 10 మంది మాత్రమే టీడీపీ పక్షాన నిలిచారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నియంతృత్వ పోకడలతో విసుగెత్తిపోయమని.. సీఎం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తామంతా మద్దతుగా నిలిచామని ప్రకటించారు. వైఎస్సార్ సీపీకి జై కొట్టిన వీరందరూ బుధవారం రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఏకతాటిపై ఉండాలని నిర్ణయించుకున్నారు. తామంతా ముఖ్యమంత్రి నాయకత్వంలో ద్వారంపూడికి మద్దతుగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక బుధవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఎన్నికల అధికారిగా జాయింట్ కలెక్టర్ వ్యవహరించనున్నారు. -
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
సాక్షి, తూర్పు గోదావరి : కాపు రిజర్వేషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసానికి బ్రాండ్ అంబాసిడరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడారాయన. కాపులను రాజకీయంగా వాడుకునే విధానాన్ని బాబు మానుకోవాలని హితవుపలికారు. కాపులను ఓటు బ్యాంకుగా టీడీపీ వాడుకోవడాన్ని అందరూ గమనించారని తెలిపారు. హోదా విషయంలో మాట మార్చి తోకముడిచింది చంద్రబాబేనని అన్నారు. వైఎస్ జగన్ రియల్ హీరో తూర్పు గోదావరి : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రియల్ హీరో అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తోకముడిచే నైజం జగన్‌ది కాదని, సోనియాతో పోరాడిన వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి విజయవాడకు పరుగులు పెట్టారని పేర్కొన్నారు. కేసులపై స్టేలు తెచ్చుకుని తోక ముడిచింది చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. -
నవరత్నాలతో ప్రజల్లోకి వెళ్లండి
కాకినాడ: నవరత్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక 9వ డివిజన్ సత్యానగర్ నాయకులు పెంకే రవి ఆధ్వర్యంలో పలువురు శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికీ ద్వారంపూడి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, అన్నివర్గాల సంక్షేమాన్నీ కాంక్షించి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలను రూపొందించారన్నారు. ఈ పథకాలను అన్ని వర్గాల ప్రజలకూ తెలియజేయాలని, దీనిపై పార్టీలో కొత్తగా చేరిన వారందరూ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమిస్తూ ప్రజల పక్షాన పోరాడాలన్నారు. పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ త్వరలో కాకినాడలో జరగనున్న జననేత పాదయాత్రను విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుంచే కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో అనుసూరి నాగేశ్వరరావు, అనుసూరి సత్యనారాయణ, పితాని ముసలయ్య, పలివెల సూర్యనారాయణ, గీసాల రమణ, అనసూరి నూకరాజు, కె.ప్రకాష్, పెద్దింశెట్టి శివకుమార్, అనుసూరి సత్య తదితరులున్నారు. -
బీజేపీ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతోంది
-
కేంద్రాన్ని దుమ్మెత్తి పోసిన చంద్రబాబు
సాక్షి, ద్వారపూడి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని దుమ్మెత్తిపోశారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఏర్పాటు చేసిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....‘బ్యాంకులను దోచుకుని విదేశాలకు పారిపోయినవారిని కేంద్రం ఏం చేసింది. రాష్ట్రంలో అసలు బీజేపీకి బలముందా?. ఆ పార్టీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది. గవర్నర్ వ్యవస్థను వద్దని చెప్పాను. కేంద్రం రాష్ట్రాన్ని ఇబ్బందిపెడుతోంది. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు సాధించి కాబోయే ప్రధానమంత్రిని నిర్ణయిస్తాం. మన హామీలు సాధించుకోవడమే లక్ష్యం. అసలు నన్నేమి చేయాలనుకుంటున్నారు. ఏదైనా మీరంతా నాకు వలయంగా ఉండాలి. రాజకీయ పరిణామాలను గమనించాలి.’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
సీఎం సభలో అపశ్రుతి,పలువురికి గాయాలు
-
చంద్రబాబు సభలో అపశ్రుతి
సాక్షి, మండపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేదికకు సమీపంగా ఉన్న కాలువలపై నడవటానికి వీలుగా ఏర్పాటుచేసిన రేకులు విరిగి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అమాంతం కాలువలోకి కూరుకుపోయిన బాధితులను పోలీసులు పైకిలాగారు. సీఎం సభలో నాసిరకం ఏర్పాట్లపై జనం పెదవివిరిచారు. సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఏడాది లోగా ఇంటింటి నుంచి చెత్తను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని చెప్పారు. ప్రతి ఇంట్లో ఎల్ఈడీ బల్బులనే వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో సీఎం వెంట పలురువు మంత్రులు, టీడీపీ ముఖ్యులు కూడా ఉన్నారు. -
నిరుద్యోగులను దగా చేసిన సర్కార్
9న జరిగే ‘నిరుద్యోగ పోరు’కు తరలిరావాలి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విజ్ఞప్తి కాకినాడ : నిరుద్యోగ యువతను తెలుగుదేశం సర్కార్ పూర్తిగా దగా చేసిందని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యాన, ఈ నెల 9న కలెక్టరేట్ వద్ద జరిగే నిరుద్యోగ పోరులో విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ పోరును విజయవంతం చేసే అంశంపై స్థానిక డి–కన్వెన్ష¯ŒS హాలులో పార్టీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, విద్యార్థి, యువజన విభాగాలకు చెందిన నాయకులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగాలిస్తామని, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన మాట నమ్మిన యువత తెలుగుదేశం పార్టీని గెలిపించిందన్నారు. ఎన్నికలయ్యాక ఆ ఊసే లేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత గడచిన 32 నెలల కాలానికి ఒక్కో నిరుద్యోగికి రూ.64 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంతబాబు ఆధ్వర్యాన ఈ నెల 9న కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పాల్గొంటారన్నారు. నగరంలోని విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వం కళ్లు తెరిపించేలా ఉద్యమించాలని చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మత్సా గంగాధర్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు కత్తిపూడి శ్రీను, నాగదేవర కార్తీక్, మత్సా లోకేష్‌వర్మ, యువజన, విద్యార్థి విభాగాల నగర అధ్యక్షులు కిషోర్, రోకళ్ళ సత్యనాయణ, మాజీ కార్పొరేటర్ మేడిశెట్టి రమణ తదితరులు పాల్గొన్నారు. -
'రాజీనామా చేశాకే వైఎస్ జగన్ పార్టీలో చేర్చుకున్నారు'
కాకినాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ఎప్పుడు ప్రోత్సహించలేదని వైఎస్ఆర్ సీపీ నేత ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఫార్టీ ఫిరాయింపుల అంశంపై మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులం అయినప్పటికీ ఎమ్మెల్యేలు తమ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీ అధినేత వైఎస్ జగన్ వారిని వైఎస్ఆర్ సీపీ లోకి ఆహ్వానించారని ఆయన వివరించారు. రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని, ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ సీపీ నేత ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. -
'ఆ ఘటనతో మాకెలాంటి సంబంధం లేదు'
కాకినాడ : కాపు గర్జన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చోటు చేసుకున్న ఘటనలకు... తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. బుధవారం కాకినాడలో వారిద్దరు విలేకర్లతో మాట్లాడుతూ.... టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తుని ఘటనలో తమ ప్రమేయం లేదని కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేస్తామని తెలిపారు. మీరు సిద్ధమా అంటూ గాలి ముద్దుకృష్ణమనాయుడికి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు సవాల్ విసిరారు. -
'మరోసారి ప్రజలు మోస పోయారు'
-
'మరోసారి ప్రజలు మోస పోయారు'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి దారుణంగా మోసపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేడు జరిగిన కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం కాదని అన్నారు. ఓటుకు నోటు కేసులో ప్రధాని సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య జరిగిన రాజీ సభ అని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయం ప్రస్తావించకపోవడం ప్రజలను మోసగించినట్లు కాదా అని మండిపడ్డారు. -
లోకేశ్‌తో కూడా దీక్ష చేయించాలి
కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఐదో రోజు రిలే దీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో చంద్రబాబు చేసినవి దొంగ దీక్షలని ఎద్దేవా చేశారు. అందుకే అందరినీ దొంగ బుద్దితో చూస్తున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు నిరాహార దీక్షా చేస్తే షుగర్, బీపీ లెవల్స్ ఎందుకు డౌన్ కాలేదని ప్రశ్నించారు. దమ్ముంటే లోకేశ్‌ను జగనతో సమానంగా దీక్ష చేయించాలని చంద్రబాబుకు చంద్రశేఖరరెడ్డి సవాల్ విసిరారు. ఈ దీక్షలో మైనారిటీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
'చంద్రబాబు బాటలోనే పవన్ కల్యాణ్'
కాకినాడ : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఏవిధంగా మోసం చేస్తున్నారో పవన్ కల్యాణ్ కూడా అదేవిధంగా ప్రజలను మోసం చేశారని ఆయన గురువారమిక్కడ అన్నారు. అవినీతిపై ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. పరిపాలన గాలికొదిలేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. కాకినాడలో ధర్నాలో పాల్గొన్న ద్వారంపూడి మాట్లాడుతూ ప్రజలు అన్యాయానికి గురైతే ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఈ రోజు వరకు కనిపించడం లేదని అన్నారు. కనీసం ప్రశ్నించడానికి కూడా ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. ఏసీ గదుల్లో కూర్చుని ముఖానికి రంగులేసుకుని పవన్ నటిస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల్లోకి వస్తే సమస్యలు అర్థం అవుతాయని ద్వారంపూడి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత హామీల కారణంగా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీల అమలుకు ప్రజలు చేపట్టే పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ద్వారంపూడి తెలిపారు. -
ద్వారంపూడి కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కాకినాడ వెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ రోజు రాత్రి కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్లి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. వైఎస్ జగన్ ఈ రోజు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లి.. ఇటీవల నగరంలోని మోరంపూడి జంక్షన్లో స్కూల్ బస్సు సృష్టించిన బీభత్సంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ వారి ఆరోగ్యం పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
పెట్రోవర్సిటీ వేదిక ద్వారపూడే!
మండపేట : ద్వారపూడిలో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. 87 ఎకరాల సేకరణకు కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ ఆమోదం తెలిపింది. నీటి వసతి, రోడ్డు, రైలు మార్గాలు, ఎయిర్‌పోర్టు సమీపంలోనే ఉండటంతో ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటుకు ఉన్నతస్థాయి నుంచి సానుకూలత లభించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత కేంద్ర ప్రభుత్వ కమిటీ భూములను పరిశీలించి తదుపరి కార్యాచరణ చేయనున్నట్టు అధికారవర్గాలు అంటున్నాయి. పెట్రో యూనివర్సిటీ, రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మాణానికి మొత్తం 87 ఎకరాలు అవసరమవుతాయని అంచనా. అందుకు అనువైన స్థలం కోసం ఇప్పటికే జిల్లాలోని రాజానగరం, కాకినాడ, తాళ్లరేవు ప్రాంతాల్లో అధికారులు పరిశీలన చేశారు. ఆయా చోట్ల అవసరమైన మేరకు భూములు లేకపోవడం, యూనివర్సిటీ వలన తమ ప్రాంత అభివృద్ధికి, ఉపాధికి అవకాశాలు పెద్దగా ఉండవన్న ఉద్దేశంతో అక్కడి ప్రజాప్రతినిధులు విముఖత చూపడంతో ద్వారపూడి వైపు అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లి, కేశవరం గ్రామాల పరిధిలో సుమారు 300 ఎకరాల అసైన్డ్భూములుండగా, మరో 200 ఎకరాల రెవెన్యూ భూములు ఉన్నాయి. స్థానికులకు అప్పగించిన అసైన్డ్ భూములు చాలాచోట్ల అన్యాక్రాంతమై గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిలో వేములపల్లిలో సుమారు వంద ఎకరాలు, కేశవరంలో సుమారు 47 ఎకరాల అసైన్డ్ భూములను గతంలోనే రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకుంది. స్థానికంగా వ్యతిరేకత ఏమీ లేకపోవడంతో ఈ ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. జడ్.మేడపాడు - రాజానగరం రోడ్డులో వైఎస్సార్ నగర్‌కు పక్కనే ఉన్న 87 ఎకరాలు అనువైనవిగా భావిస్తున్నారు. ద్వారపూడిలో రైల్వే స్టేషన్, సుమారు 20 కిలోమీటర్ల దూరంలో 16వ నంబరు జాతీయ రహదారి, 40 కిలోమీటర్ల దూరంలో మధురపూడి ఎయిర్‌పోర్టు ఉండటంతో ఈ ప్రాంతం రవాణాకు అనుకూలమైనదిగా అధికారులు భావిస్తున్నారు. సేకరించాలని ప్రతిపాదించిన భూముల పక్కనే సుమారు 60 ఎకరాల్లో పంగిడి చెరువు ఉండటంతో నీటి వసతికి సమస్య ఉండదంటున్నారు. ఇటీవల ఈ భూములను పరిశీలించిన కలెక్టర్ నీతూప్రసాద్ యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైనదిగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. సంక్రాంతి తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యులు ఈ భూములను పరిశీలించి తదుపరి కార్యాచరణకు ఉపక్రమించనున్నట్టు సమాచారం. కేశవరంలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్.. కేశవరంలోని కోకా కోలా కంపెనీ సమీపంలో గల 47 ఎకరాల్లో జీడిపప్పు, కొబ్బరి ఆధారిత ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వేములపల్లి, కేశవరాల్లో అన్యాక్రాంతమైన మిగిలిన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చే యోచనలో అధికారయంత్రాంగం ఉంది. -
బాబు తోక పత్రికలు విష ప్రచారం: ద్వారంపూడి
కాకినాడ : చంద్రబాబు నాయుడు రుణమాఫీపై తొలి సంతకానికి విలువ లేకుండా చేశారని వైఎస్ఆర్ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. తొలి సంతకం చేసి మాట నిలుపుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు సర్కార్ మోసపూరిత విధానాలను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ సీపీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. మహాధర్నాలో పాల్గొన్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై చంద్రబాబు తోక పత్రికలు విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. త్వరలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఇంటింటికి పంచిపెట్టి బాబు మోసాలను మరోసారి ప్రజలకు తెలియ చేస్తామన్నారు. -
'పవన్ కళ్యాణ్.. ఏసీ గదుల్లో నుంచి బయటకు రా'
-
'పవన్ కళ్యాణ్.. ఏసీ గదుల్లో నుంచి బయటకు రా'
కాకినాడ : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీలు విస్మరించిన చంద్రబాబు పాలనను ఎండగట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం పోరుబాట పట్టింది. రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ధర్నాలకు దిగారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్ఆర్ సీపీ పోరుబాటలో పాల్గొన్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ ఇప్పుడు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో ఆంధ్రప్రదేశ్‌లో 95శాతం ప్రజలు అన్యాయానికి గురయ్యారని ద్వారంపూడి అన్నారు. ఏసీ గదులకు పరిమితమైన పవన్ ఇప్పటికైనా విజ్ఞతతో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలకు కృషి చేయాలని సూచించారు. బాబు వంచనను ప్రశ్నించకుంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రజలను మోసం చేసినట్లేనని ద్వారంపూడి అన్నారు. -
వాకతిప్ప పేలుడు బాధితులకు నేడు జగన్ పరామర్శ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం వాకతిప్ప విస్ఫోట బాధితులను పరామర్శించనున్నారు. గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర లోని తుపాను పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం సంభవించిన పేలుడు దుర్ఘటనను తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. ముందు అనుకున్న దాని ప్రకారం ఆయన మరో రెండురోజులు శ్రీకాకుళం జిల్లాలోని తుపాను బాధిత గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే పేలుడు బాధితులను సత్వరం ఊరడించాలన్న సంకల్పంతో మంగళవారం రాత్రే శ్రీకాకుళం నుంచి నేరుగా కాకినాడ చేరుకుని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంట బస చేశారు. పలువురు పార్టీ నేతలు ఆయనను కలుసుకుని పేలుడు వివరాలను తెలిపారు. -
టీడీపీ వేధింపులకు భయపడొద్దు : జ్యోతుల
కాకినాడ: అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రభుత్వం నుంచి ఎలాంటి దాడులు, బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదని, పార్టీ తరఫున తాము రక్షణ కవచంలా నిలుస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. కాకినాడ గొడారిగుంటలో నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన సిటీ నియోజకవర్గ సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం చంద్రబాబు హయాంలో ప్రత్యర్థ పార్టీలపై జరుగుతోన్న కక్షసాధింపుల వంటి నీచ సంస్కృతిని మున్నెన్నడూ చూడలేదన్నారు. ప్రజల తరఫున పోరాడే జగన్‌తో భవిష్యత్‌లో తన మనుగడకు ప్రమాదం ఉందని భయంతో టీడీపీ ఉందన్నారు. వైఎస్సార్ సీపీని నిర్మాణాత్మకమైనదిగా తీర్చిదిద్దుదామన్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్యే ముత్యాలనాయుడు మాట్లాడుతూ గతంలో జగన్‌ను జైలులో నిర్బధించిన సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందన్నారు. తెలుగుదేశానికి అదే గతి పడుతుందన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన మాటను అమలు చేయకుండా రుణమాఫీపై ముఖం చాటేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. జడ్పీ మాజీ ఛైర్మన్, కాకినాడరూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. జిల్లా ఎస్సీసెల్ ఛైర్మన్ శెట్టిబత్తుల రాజబాబు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ వంటి పోరాటతత్వం కలిగిన నాయకుడన్నారు. జిల్లా ప్రచారకమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, నాయకులు అత్తిలి సీతారామస్వామి, వైఎస్సార్ సీపీ కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడారు. పవన్‌కల్యాణ్ ఎక్కడ?: ద్వారంపూడి అన్యాయాన్ని ప్రశ్నిస్తానంటూ ఎన్నికల ముందు ప్రసంగాలతో ఊదరగొట్టిన సినీనటుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నిలదీశారు. చంద్రబాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన ప్రతి ప్రాంతంలోను పవన్ అన్యాయాన్ని ప్రశ్నిస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారని.. ఇప్పుడు రైతు, డ్వాక్రా రుణాలు రద్దు సహా చంద్రబాబు హామీలు ఏ ఒక్కటి అమలు కావడం లేదని, ఈ అన్యాయాన్ని ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. సమావేశంలో తొలిత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చివరగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులై తొలిసారిగా కాకినాడ వచ్చిన జ్యోతుల నెహ్రూను సన్మానించారు. సమావేశంలో రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయభాస్కర్, వైఎస్సార్ సీపీ మండలపేట కోఆర్డినేటర్ గిరిజాల వెంకటస్వామినాయుడు, పార్టీ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ , రాష్ట్ర కార్యదర్శి గుండా వెంకటరమణ, జిల్లా వక్ఫ్కమిటీ అధ్యక్షుడు అబ్దుల్‌బషీరుద్దీన్, రాష్ట్ర యువజన విభాగం సభ్యులు వాసిరెడ్డి జమీలు, కాకినాడ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, పార్టీ నాయకులు దొంగ రామసత్యనారాయణ తదిత రులు పాల్గొన్నారు. -
పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ద్వారంపూడి!
-
పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ద్వారంపూడి!
కాకినాడ: సినీనటుడు పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు అన్యాయానికి గురైతే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు కనిపించడం లేదని ఆయన అన్నారు. కనీసం ప్రశ్నించడానికి కూడా ముందుకు రావడం లేదని ద్వారంపూడి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత హామీల కారణంగా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీల అమలుకు ప్రజలు చేపట్టే పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పారట్ఈ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. -
‘బుక్ ఆఫ్ ఎవరెస్ట్’లో యువరాజారెడ్డి
పెదపూడి : జి.మామిడాడకు చెందిన పీఈటీ ఉపాధ్యాయుడు, లయన్స క్లబ్ సభ్యుడు ద్వారంపూడి యువరాజారెడ్డి బుక్ ఆఫ్ ఎవరెస్ట్ ప్రపంచ రికార్డులో స్థానం సాధించారు. గత శ్రీరామ నవమి సందర్భంగా 12,345 బియ్యం గింజలపై శ్రీరామనామాన్ని తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో సూక్ష్మ పరికరాలు ఉపయోగించకుండా రాశారు. వీటిని రికార్డుల సేకరణ సంఘం(ఇన్వోరాన్స్) అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చింతా శ్యామ్‌కుమార్ పరిశీలించి అవార్డుకు సిఫార్సు చేశారు. నేపాల్‌కు చెందిన బుక్ ఆఫ్ ఎవరెస్ట్ చీఫ్ ఎడిటర్ మధుకుమార్ ప్రేష్ట ధ్రువపత్రం జారీ చేశారు. దానిని లయన్స్ ఇంటర్నేషనల్ డెరైక్టర్ ఆర్ సునీల్‌కుమార్ చేతుల మీదుగా ఈ నెల 20న మండపేటలో జరిగిన కార్యక్రమంలో యువరాజారెడ్డి అందుకున్నారు. లయన్స్ గవర్నర్ డి.తిరుమలరావు, బాదం ఐ, బ్లడ్ బ్యాంక్ అధ్యక్షుడు బాదం బాలకృష్ణ, బీ ఛత్రపతి శివాజీ, మండ రాజారెడ్డి పాల్గొన్నారు. -
కాకినాడలో నీటి ఎద్దడి.
-
'జగన్‌ని చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి'
రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి శుక్రవారం కాకినాడలో ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసైన బుద్ది తెచ్చుకోవాలని ఆయన చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబు తన రెండు కళ్ల సిద్దాంతాన్ని వదిలిపెట్టి సమైక్య ఉద్యమంలో పాల్గొన్నాలని చంద్రశేఖరరెడ్డి సూచించారు. పోరాడాల్సింది పోయి జగన్ పై ఆరోపణలు చేయటం తగదన్నారు. కాగా తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగింది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. -
'సీఎంకు చిత్తశుద్ధి ఉంటే శంఖారావంకు అనుమతి ఇవ్వాలి'
కాకినాడ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్ సిపి తలపెట్టిన సమైక్య శాంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సీఎం పైకి సమైక్యవాదినంటూ చెప్పుకుంటూ, లోపల మరోల వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సభకు అనుమతిస్తే ప్రశాంతంగా నిర్వహించుకుంటామని చెప్పారు. సీమాంధ్ర ప్రజలు శాంతికాముకులన్నారు. గొడవలు జరుగుతాయన్నది సాకుమాత్రమేన్నారు. తెలంగాణవాదులు ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను ధ్వంసం చేశారు. సీమాంధ్రులను వారితో పోల్చడం సరికాదన్నారు. విభజనవాదులకు జైకొడతారా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాపాడాలని కోరారు. సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని ద్వారంపుడి డిమాండ్ చేశారు. -
చంద్రబాబుతో జై సమైక్యాంధ్ర అని చెప్పిస్తారా?: ద్వారంపూడి సవాల్
రాష్ట్రంలో పిచ్చెక్కిన కుటుంబం ఏదైనా ఉందా అంటే అది చంద్రబాబు కుటుంబమేనని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. సీమాంధ్ర టీడీపీ నేతలకు చేతనైతే చంద్రబాబుతో జై సమైక్యాంధ్ర అని అనిపించాలని ద్వారంపూడి సవాల్ చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విడుదలయ్యాక చంద్రబాబు గుండెదడతో ఐదు రోజుల వరకు తన ఇంటి గడప దాడి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. మంత్రి తోట నరసింహం, కేంద్రమంత్రి పల్లంరాజు పార్టీ కోసం కష్టపడితే పదవులు రాలేదని, వారసత్వంగా వచ్చాయని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఇప్పటికైనా వారు రాజీ నామా చేయాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు. -
' పోరాట పటిమ ఉన్న ఏకైక నాయకుడు జగన్'
కాకినాడ : కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచేలా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాకినాడ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు బుధవారం నుంచి నిరాహారదీక్షలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మసీదు సెంటర్లో దీక్షకు దిగారు. మహత్మగాంధీ, పొట్టి శ్రీరాములు, వైఎస్సార్ చిత్రపటాలకు ద్వారంపూడి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. దీక్షా ప్రాంగణానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో పోరాట పటిమ ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ద్వారంపూడి అన్నారు. జగన్ నేతృత్వంలో తాము సమైక్యాంధ్ర సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. -
జగన్‌కు బెయిల్ మంజూరుపై సర్వత్రా హర్షం
సంతోషకరం: అసదుద్దీన్ ఓవైసీ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత, ఎంపీ జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం. జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు. - అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీ,హైదరాబాద్ అన్యాయంగా ఏడాదిన్నరజైల్లో.. రాజకీయ కుట్రలో భాగంగా కోర్టులు, సీబీఐ విలువైన సమయాన్ని వృథా చేసి ప్రజాధనం దుర్వినియోగానికి కారణమైన మాజీ మంత్రి శంకరరావును అరెస్టు చేయాలి. అధికార, ప్రతిపక్షాల కుట్రలతో అన్యాయంగా ఏడాదిన్నర జైలులో నిర్బంధానికి గురైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మంజూరుతో కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారు. జగన్‌కు బెయిల్ ఇవ్వడం, ఎనిమిది కంపెనీలకు సంబంధించి క్విడ్‌ప్రోకోకు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ తేల్చిచెప్పడాన్ని బట్టి న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఇంకా నమ్మకం సన్నగిల్లలేదనే విషయం స్పష్టమైంది. ఐఎంజీ, ఏలేరు సహా పలు కుంభకోణాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై హైకోర్టు నుంచి స్టేలు తెచ్చుకుని కేసుల విచారణ జరగకుండా నిరోధించుకున్నారు. - వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ జగన్‌కు బెయిల్‌తో ప్రజలకు భరోసా రాష్ర్ట విభజన ప్రకటన, సమైక్యాంధ్ర ఉద్యమం వంటి క్లిష్ట సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రావడం రాష్ర్ట ప్రజలకు ఎంతో భరోసాగా నిలుస్తుంది. ప్రస్తుతం వైఎస్సార్ పథకాలు పూర్తిగా నిర్వీర్యం కావడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వంటి సమస్యలపై జగన్ ప్రజల తరఫున పోరాడి, వారికి అండగా ఉండేలా సరైన సమయంలో భగవంతుడు బెయిల్ వచ్చేలా చేశాడు. చంద్రబాబు కేంద్రంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్‌ను అడ్డుకోలేకపోయారు. - కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి న్యాయవ్యవస్థలో ధర్మానికి చోటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కూడబలుక్కుని ఇన్నాళ్లూ బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. జగన్‌కు బెయిల్ రావడంతోపాటు, 10 కేసుల్లో క్విడ్ ప్రోకో జరిగిందనడానికి ఆధారాలు లేవని సీబీఐ ధ్రువీకరించడం శుభపరిణామం. ఇప్పటి వరకు ప్రపంచ జర్నలిజం చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎల్లో మీడియా వ్యవహరించింది. ఆధారాలున్నాయని అభూత కల్పనలు సృష్టించి సీబీఐ దర్యాప్తునే ప్రభావితంగా చేసేందుకు ప్రయత్నించింది. -ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే, నరసన్నపేట ప్రజల ప్రార్థనలు ఫలించాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్రజల దీవెనలు, భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. ఆయన బెయిల్ రావడం శుభపరిణామం. జగన్మోహన్రెడ్డికి బెయిల్ రావాలని, తమను ఆదుకోవాలని అన్ని వ ర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. వారి ఆశ్శీలతోనే జగ న్కు బెయిల్ మంజూరయింది. పార్టీకి మరింత నూతనోత్తేజం వస్తుంది. - పెనుమత్స సాంబశివరాజు, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా కన్వినర్. జగన్ నాయకత్వాన సమైక్యాంధ్ర ఉద్యమం సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వుంది. అందుకే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉధృతంగా ముందుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతున్న తరుణంలో జగన్‌కు బెయిల్ లభించడం హర్షించదగ్గ విషయం. - పి.విష్ణుకుమార్ రాజు, రాజకీయేతర జేఏసీ, విశాఖపట్నం జగన్ నిర్దోషిగా కూడా నిగ్గుతేలతారు తెలుగు ప్రజల 16 నెలల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో రాష్ట్రమంతటా సంతోషం వెల్లివిరుస్తోంది. కాంగ్రెస్, టీడీపీలు రాజకీయంగా ఎదుర్కోలేకే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించాయి. ఆసలు క్విడ్‌ప్రోకోనే జరగలేదని సీబీఐ నిర్ధారించడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు బెయిల్ వచ్చింది. త్వరలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్దోషిగా కూడా నిరూపితమవుతారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రాష్ట్రంలో రాజన్న సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ తీసుకువస్తారు. - బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ విప్ చంద్రబాబు పన్నాగాలకు తెర ఇటలీరాణి సోనియా, టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడి అప్రజాస్వామిక ప్రయత్నాలకు అడ్డుకట్టపడింది. ఢిల్లీలో గల్లీగల్లీ తిరిగి బెయిల్రాకుండా చంద్రబాబు పన్నిన పన్నాగాలకు తెరదించుతూ కోర్టు తీర్పు ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులో ఎనిమిది కంపెనీలకు సంబంధించి క్విడ్ ప్రోకోకు ఆధారాలు లభించలేదని సీబీఐ స్వయంగా మెమోలో తెలపడం జగన్మోహన్రెడ్డి నిజాయితీని తెలియజేస్తోంది. దీన్నిబట్టి ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్రెడ్డిని కాంగ్రెస్, టీడీపీ నాయకులు చేతులు కలిపి జైల్లో ఉంచే విధంగా చేశారన్నది అర్థమవుతోంది. జగ న్మోహన్రెడ్డి బయటకు వస్తే తమ అడ్రస్సులు గల్లంతవుతాయని రెండు నాలుకల చంద్రబాబు ఆడిన హైడ్రామా ఇది. ఇప్పటికైనా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. ఆరోపణలు మినహా ఆధారాలు లేకపోవడంతో జగన్మోహన్రెడ్డి కోహినూరు వజ్రంలా మంగళవారం బయటకు రానున్నారు. వైఎస్సార్ కుటుంబానికి భగవంతుడితో పాటు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఫలించవని న్యాయవ్యవ స్థ రుజువు చేసింది. - నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రజల ప్రార్థనలు ఫలించే.. బెయిల్! గత 16 నెలలుగా రాష్ట్ర ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ లభించిందని రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీస్ కూటమి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఐసీ అశోక్‌కుమార్ అన్నారు. జగన్ రాకతో పేదల జీవితాల్లో ఆశలు చిగురించాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
'బాబు ఆస్తి మాకిస్తే.. నాలుగురెట్లు ఆస్తి మేమిస్తాం'
కాకినాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆస్తిని తమకిస్తే..అంతకు నాలుగురెట్టు ఆయనకు ఇస్తామని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆస్తులు ప్రకటించడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. బాబు ఆస్తుల ప్రకటనపై మాట్లాడిని ద్వారంపూడి మండిపడ్డారు. బాబు ఆస్తులను తమకిస్తే అంతకుమించి ఆస్తులను బాబుకు ఇస్తామని ఆయన సవాల్ విసిరారు. కాగా, అమెరికాను అతాలకుతలం చేసిన తీవ్రవాది లాడెన్ తో బాబును పోల్చారు ద్వారంపూడి. ప్రస్తుతం పదవీ వ్యామోహం కోసం చంద్రబాబు రాజకీయ ఉగ్రవాదిగా మారిపోయారని ఆయన విమర్శించారు. ట్విన్ టవర్ళ్ ను కూల్చి అమెరికాకు లాడెన్ నిద్రలేకుండా చేస్తే.. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని అతాలకుతలం చేశారని ద్వారంపూడి అన్నారు. -
షర్మిల బస్సు యాత్ర ద్వారా సమైక్యవాదం బలపడుతుంది: ద్వారంపూడి
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సు యాత్ర ద్వారా ప్రజలలో సమైక్యవాదం బలపడుతుంది మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనని ఆయన మండిపడ్డారు. షర్మిల సమైక్య శంఖారావం యాత్ర చూసైనా టీడీపీ బుద్ది తెచ్చుకోవాలి ఆయన అన్నారు. చంద్రబాబు రాజీనామా చేసి బస్సు యాత్ర చేయాలి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. -
జన నినాదమై... ఉవ్వెత్తున సమైక్య సమరం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్రనే శ్వాసిస్తూ, ధ్యానిస్తూ జన నినాదమై ఉద్యమం సీమాంధ్రలో వెల్లువెత్తుతోంది. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాలు, మారుమూల పల్లెలు అన్నీ ఒక్కటై సమైక్యమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నాయి. కులాలు, మతాలు, శ్రామిక వర్గాల వారీగా ప్రజలు విభజనయత్నాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. స్వచ్ఛందంగా వివిధ రూపాల్లో ఆందోళనలను హోరెత్తిస్తున్నారు. వరుసగా ఎనిమిదో రోజైన బుధవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థల మూత కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు తోడుగా ప్రైవేటురంగంలోని ఉద్యోగులందరూ సమైక్యపోరాటంలో భాగస్వాములవుతున్నారు. మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన 72గంటల పెన్‌డౌన్ బుధవారంతో ముగిసింది. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను గురువారం ప్రకటిస్తామని నేతలు వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహజ్వాలలు కొనసాగుతున్నాయి. గోదావరి తీరాన 300కుటుంబాల నిరాహారదీక్ష రాజమండ్రి లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 300కుటుంబాలు నిరాహార దీక్షలో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. కాకినాడలో జర్నలిస్టు వారణాసి సాయిపెరుమాళ్లు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అడ్డుకున్నారు. గుంటూరులో ఏపీఎన్జీవో జేఏసీ పిలుపు మేరకు అన్నిశాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి ప్రదర్శన చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులు గుంటూరు-విజయవాడ హైవేపై రాస్తారోకో చే శారు. నడిరోడ్డుపై ముస్లింల ప్రార్ధన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో వేలాదిమంది ముస్లింలు మసీదుల నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. సోనియా మనసు మార్చి రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాలని నడిరోడ్డుపై ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. కర్నూలులో పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో సుమారు 500మంది సభ్యులు వెంకటరమణ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై యోగాసనాలతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. మేముసైతమంటూ అంధుల ర్యాలీ తిరుపతిలో అంధులు భారీ ర్యాలీ నిర్వహించారు. కపిలితీర్థం నుంచి లీలామహల్ కూడలి, మున్సిపల్ కార్పొరేషన్, నాలుగుకాళ్ల మంటపం, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా తెలుగుతల్లి విగ్రహం వరకు సుమారు 7 కిలోమీటర్ల దూరం నడిచి సమైక్యనినాదాలతో ప్రదర్శన చేపట్టారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచే షాపులను మూయించి బంద్ నిర్వహించారు. పరకాల ప్రభాకర్ బుధవారం మదనపల్లి నుంచి బస్సుయాత్రను కొనసాగించారు. సినిమా థియేటర్లమూత కృష్ణా జిల్లాలో ఫిలింఛాంబర్ నేతృత్వంలో ఎగ్జిబిటర్లు బుధవారం బంద్ పాటించి జిల్లా మొత్తం సినిమా థియేటర్లు మూసివేశారు. విజయవాడలో భారీ ప్రదర్శన చేపట్టారు. నాలుగురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు బుధవారం రాత్రి గుండెనొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఉయ్యూరులో రైతులు ఎడ్లబళ్లతో ప్రదర్శన చేశారు. గుడివాడలో నడిరోడ్డుపై నాట్లు వేశారు. సమ్మెకు తామూసిద్ధమన్న ఎంపీడీవోలు ఈ నెల 12 నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు రాష్ట్ర ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు హరిహరనాధ్ విజయవాడలో ప్రకటించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న జిల్లా న్యాయమూర్తి ఎ.రాధాకృష్ణ వాహనాన్ని అడ్డగించారు. ఒంగోలు నగరంలో పదివేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ఆధ్వర్యంలో బుజబుజ నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై చేసిన రాస్తారోకోతో రాకపోకలు స్తంభించాయి. పదివేలమంది ఉద్యోగుల భారీ ప్రదర్శన అనంతపురం నగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు పది వేల మంది ఉద్యోగులతో ఆర్ట్స్ కళాశాల నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిగింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐదు వేల మంది మహిళలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. సమైక్య ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ఆధ్వర్యంలో పీఆర్టీయూ నాయకులు శ్రీకాకుళంలో సమావేశమై సమైక్య రాష్ట్ర సాధన కోసం సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సమైక్య ఉపాధ్యాయ జేఏసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎచ్చెర్లలోని బీఆర్ అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు హౌరా-చెన్నై జాతీయ రహదారిపై హోమం నిర్వహించి, రహదారిని దిగ్బంధించడంతో సుమారు పది కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. రణస్థలం, నరసన్నపేట, టెక్కలి తదితర ప్రాంతాల్లోనూ రాస్తారోకోలునిర్వహించారు. విజయనగరంలో ఉద్యోగులు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించడడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేలుతున్న స్లో ‘గన్స్’ సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యవాదులు చేస్తున్న నిరసనల్లో నినాదాలు హోరెత్తుతున్నాయి. ప్లకార్డులు, ఫ్లెక్సీలపై ఆందోళనకారులు రాసి, ప్రదర్శిస్తున్న నినాదాలు, వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలను ఎండగడ్తూ చిత్రించిన, రూపొందించిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లకు జనం నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. గత వారం రోజులుగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో నిరసనకారులు ప్రదర్శించిన ప్లకార్లుల్లోని నినాదాలు, వాల్‌పోస్టర్లలోని వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని.... విభజనకు ముందు దర్జా... ఆ తర్వాత బికారి సమైక్యాంధ్రలో కుర్చీలో దర్జాగా ఉన్న కేసీఆర్.. విభజన జరిగితే బికారిగా మారతారంటూ రూపొందించిన ఫ్లైక్సీ అనంతపురం నగరంలో వెలిసింది. నాకు నచ్చని పదం రాజీనామా సినిమాల్లో చిరంజీవి డైలాగులను పేరడీ చేస్తూ విజయవాడలో ప్లకార్డులు ప్రదర్శించారు. నాకు తెలుగుభాషలో నచ్చనిది ఒకే ఒక్క పదం ‘రాజీనామా’ అంటూ ఠాగూర్ సినిమాలో డైలాగ్‌ను, నా ఇంటి ముందు ధర్నా చేయమని ముగ్గురికి చెప్పండి.. వారు ముగ్గురికి చెబుతారు.. వారు మరో ముగ్గురికి చెబుతారు.. అంటూ స్టాలిన్ సినిమాలో డైలాగ్‌ను పేర డీ చేశారు. బొత్స ఆచూకీ చెప్పండి ‘‘విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని వెతుక్కుంటూ వెళ్లి తప్పిపోయారు. ఆచూకీ తెలిసిన వారు సమైక్యాంధ్ర ఉద్యమ కార్యకర్తలకు తెలియజేయాలి.’’ అంటూ విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలో వాల్‌పోస్టర్ అంటించారు. తెలుగుతల్లికి సోనియా తూట్లు తెలుగు తల్లిని సోనియాగాంధీ బల్లెంతో పొడుస్తుంటే కారుతున్న రక్తాన్ని గద్ద రూపంలో కేసీఆర్ తాగుతున్న చిత్రాన్ని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రదర్శించింది. రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటూ చిరంజీవి, బొత్స, గంటాశ్రీనివాసరావులను కోతి బొమ్మలుగా చిత్రీకరించినబ్యానర్‌ను తెలుగుశక్తి నేతలు విశాఖపట్నంలో ఊరేగించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ పాము.. చిరు చీటింగ్ జీవి... చెన్నైలో అవార్డులు సమైక్యాంధ్రను పరిరక్షించాలని కోరుతూ తమిళనాడు రాష్ట్రం చెన్నై మైలాపూర్‌లో తెలుగు సంఘాలు బుధవారం నిరాహారదీక్ష నిర్వహించాయి. ఈ సందర్భంగా వ్యంగ్యోక్తులతో అవార్డులను ప్రకటించారు. సోనియాకు ‘విభజన విధ్వంస స్వరూపిణి’, కేసీఆర్‌కు ‘ఫామ్ హౌస్ పాము’, చిరంజీవికి ‘చీటింగ్ జీవి’, పురంధేశ్వరికి ‘పితృ ఆత్మక్షోభకారిణి’, సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ‘సోనియా పెట్స్’, కాంగ్రెస్ అధిష్టానానికి ‘అష్టదరిద్ర స్థానం’ అవార్డులను ప్రకటించారు. తొమ్మిదిమందిని మింగిన ‘విభజన’ ఒకరి ఆత్మహత్య.. గుండెపోటుతో 8 మంది.. ఇద్దరి ఆత్మహత్యాయత్నం సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజన ప్రకటనను జీర్ణించుకోలేక బుధవారం ఒక్కరోజే 8 మంది గుండెపోటుతో మరణించగా, ఒకరు ఆత్మహత్యకు, మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరులో పెయింటర్ దిడుమర్తి రాజీవ్‌గాంధీ (24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్తిలి మండలం గుమ్మంపాడులో వినుకొండ వెంకటసుబ్బమ్మ (54), ఉండి గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీను (31), పెంటపాడు మండలం గ్రామానికి చెందిన మేనేటి కోటేశ్వరరావు(61), ఉంగుటూరు మండలం నారాయణపురంలో కర్రి నాగరాజు(35), అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన రంగప్ప (45), రాయదుర్గం మండలంలోని జుంజరంపల్లికి చెందిన అచ్చెల్లి మాబు(35) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. రాష్ట్ర విభజనపై వస్తున్న వార్తలను టీవీలో వీక్షిస్తూ కర్నూలు జిల్లా అవుకు మండల పరిధిలోని రాఘవరాజపురానికి చెందిన బూరుగుల నాగేష్ బుధవారం గుండెపోటుతో మరణించాడు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురంలో చంద్రమౌళి నాయుడు (55) సమైక్య ఉద్యమాలను టీవీలో చూస్తూ కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు రుయాకు తరలించగా చికిత్సపొం దుతూ మరణించాడు. సత్యవేడులో బాలాజీ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా గుత్తికి చెందిన కిషోర్ బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమైక్య ద్రోహులకు కుంభీపాకం శిక్ష విజయనగరంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో సోనియా, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను మరుగుతున్న నూనెలో దించి కుంభీపాకం శిక్ష విధించారు.