
'మరోసారి ప్రజలు మోస పోయారు'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి దారుణంగా మోసపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేడు జరిగిన కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం కాదని అన్నారు.
ఓటుకు నోటు కేసులో ప్రధాని సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య జరిగిన రాజీ సభ అని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయం ప్రస్తావించకపోవడం ప్రజలను మోసగించినట్లు కాదా అని మండిపడ్డారు.