
ద్వారంపూడి కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కాకినాడ చేరుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కాకినాడ వెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ రోజు రాత్రి కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్లి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
వైఎస్ జగన్ ఈ రోజు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లి.. ఇటీవల నగరంలోని మోరంపూడి జంక్షన్లో స్కూల్ బస్సు సృష్టించిన బీభత్సంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ వారి ఆరోగ్యం పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.