ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు.
కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఐదో రోజు రిలే దీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో చంద్రబాబు చేసినవి దొంగ దీక్షలని ఎద్దేవా చేశారు.
అందుకే అందరినీ దొంగ బుద్దితో చూస్తున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు నిరాహార దీక్షా చేస్తే షుగర్, బీపీ లెవల్స్ ఎందుకు డౌన్ కాలేదని ప్రశ్నించారు. దమ్ముంటే లోకేశ్ను జగనతో సమానంగా దీక్ష చేయించాలని చంద్రబాబుకు చంద్రశేఖరరెడ్డి సవాల్ విసిరారు. ఈ దీక్షలో మైనారిటీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.