
బాబు తోక పత్రికలు విష ప్రచారం: ద్వారంపూడి
కాకినాడ : చంద్రబాబు నాయుడు రుణమాఫీపై తొలి సంతకానికి విలువ లేకుండా చేశారని వైఎస్ఆర్ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. తొలి సంతకం చేసి మాట నిలుపుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు సర్కార్ మోసపూరిత విధానాలను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ సీపీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.
మహాధర్నాలో పాల్గొన్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై చంద్రబాబు తోక పత్రికలు విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. త్వరలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఇంటింటికి పంచిపెట్టి బాబు మోసాలను మరోసారి ప్రజలకు తెలియ చేస్తామన్నారు.