సీఎం పర్యటన పేరుతో వైఎస్ఆర్ సీపీ ఫ్లెక్సీల తొలగింపు | ysrcp Flexies removed kakinada | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన పేరుతో వైఎస్ఆర్ సీపీ ఫ్లెక్సీల తొలగింపు

Published Tue, Jan 26 2016 12:21 PM | Last Updated on Sat, Jul 28 2018 7:54 PM

సీఎం పర్యటన పేరుతో వైఎస్ఆర్ సీపీ ఫ్లెక్సీల తొలగింపు - Sakshi

సీఎం పర్యటన పేరుతో వైఎస్ఆర్ సీపీ ఫ్లెక్సీల తొలగింపు

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆకస్మిక పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడం విమర్శలకు దారితీసింది. కాకినాడ నగరంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సీపీ ఫ్లెక్సీలను అధికారులు మంగళవారం తొలగించారు. అధికారుల తీరుపై వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు.

బుధవారం కాకినాడలో జరిగే బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. జగన్ కు  స్వాగతం పలుకుతూ మాజీ ఎమ్మెల్యేలు కన్నబాబు, ముత్తా గోపాలకృష్ణ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ బహిరంగ సభను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి పర్యటన పేరుతో ఫ్లెక్సీలను తొలగించారని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement