పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ద్వారంపూడి!
కాకినాడ: సినీనటుడు పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు అన్యాయానికి గురైతే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు కనిపించడం లేదని ఆయన అన్నారు. కనీసం ప్రశ్నించడానికి కూడా ముందుకు రావడం లేదని ద్వారంపూడి విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత హామీల కారణంగా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీల అమలుకు ప్రజలు చేపట్టే పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పారట్ఈ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తెలిపారు.