'పవన్ కళ్యాణ్.. ఏసీ గదుల్లో నుంచి బయటకు రా'
కాకినాడ : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీలు విస్మరించిన చంద్రబాబు పాలనను ఎండగట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం పోరుబాట పట్టింది. రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ధర్నాలకు దిగారు.
ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్ఆర్ సీపీ పోరుబాటలో పాల్గొన్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ ఇప్పుడు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో ఆంధ్రప్రదేశ్లో 95శాతం ప్రజలు అన్యాయానికి గురయ్యారని ద్వారంపూడి అన్నారు. ఏసీ గదులకు పరిమితమైన పవన్ ఇప్పటికైనా విజ్ఞతతో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలకు కృషి చేయాలని సూచించారు. బాబు వంచనను ప్రశ్నించకుంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రజలను మోసం చేసినట్లేనని ద్వారంపూడి అన్నారు.