వైఎస్సార్‌సీపీ అధినేత, ఎంపీ జగన్మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం. జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు.
సంతోషకరం: అసదుద్దీన్ ఓవైసీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధినేత, ఎంపీ జగన్మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం. జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు.
- అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీ,హైదరాబాద్
అన్యాయంగా ఏడాదిన్నరజైల్లో..
రాజకీయ కుట్రలో భాగంగా కోర్టులు, సీబీఐ విలువైన సమయాన్ని వృథా చేసి ప్రజాధనం దుర్వినియోగానికి కారణమైన మాజీ మంత్రి శంకరరావును అరెస్టు చేయాలి. అధికార, ప్రతిపక్షాల కుట్రలతో అన్యాయంగా ఏడాదిన్నర జైలులో నిర్బంధానికి గురైన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ మంజూరుతో కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారు. జగన్‌కు బెయిల్ ఇవ్వడం, ఎనిమిది కంపెనీలకు సంబంధించి క్విడ్‌ప్రోకోకు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ తేల్చిచెప్పడాన్ని బట్టి న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఇంకా నమ్మకం సన్నగిల్లలేదనే విషయం స్పష్టమైంది. ఐఎంజీ, ఏలేరు సహా పలు కుంభకోణాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై హైకోర్టు నుంచి స్టేలు తెచ్చుకుని కేసుల విచారణ జరగకుండా నిరోధించుకున్నారు.
- వైఎస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్
జగన్‌కు బెయిల్‌తో ప్రజలకు భరోసా
రాష్ర్ట విభజన ప్రకటన, సమైక్యాంధ్ర ఉద్యమం వంటి క్లిష్ట సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రావడం రాష్ర్ట ప్రజలకు ఎంతో భరోసాగా నిలుస్తుంది. ప్రస్తుతం వైఎస్సార్ పథకాలు పూర్తిగా నిర్వీర్యం కావడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వంటి సమస్యలపై జగన్ ప్రజల తరఫున పోరాడి, వారికి అండగా ఉండేలా సరైన సమయంలో భగవంతుడు బెయిల్ వచ్చేలా చేశాడు. చంద్రబాబు కేంద్రంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్‌ను అడ్డుకోలేకపోయారు.
- కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
న్యాయవ్యవస్థలో ధర్మానికి చోటు
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కూడబలుక్కుని ఇన్నాళ్లూ బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. జగన్‌కు బెయిల్ రావడంతోపాటు, 10 కేసుల్లో క్విడ్ ప్రోకో జరిగిందనడానికి ఆధారాలు లేవని సీబీఐ ధ్రువీకరించడం శుభపరిణామం. ఇప్పటి వరకు ప్రపంచ జర్నలిజం చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎల్లో మీడియా వ్యవహరించింది. ఆధారాలున్నాయని అభూత కల్పనలు సృష్టించి సీబీఐ దర్యాప్తునే ప్రభావితంగా చేసేందుకు ప్రయత్నించింది.
-ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే, నరసన్నపేట
ప్రజల ప్రార్థనలు ఫలించాయి
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రజల దీవెనలు, భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. ఆయన బెయిల్ రావడం శుభపరిణామం. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రావాలని, తమను ఆదుకోవాలని అన్ని వ ర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. వారి ఆశ్శీలతోనే జగ న్‌కు బెయిల్ మంజూరయింది. పార్టీకి మరింత నూతనోత్తేజం వస్తుంది.
- పెనుమత్స సాంబశివరాజు, వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా కన్వినర్.
జగన్ నాయకత్వాన సమైక్యాంధ్ర ఉద్యమం
సమైక్యాంధ్ర కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వుంది. అందుకే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉధృతంగా ముందుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతున్న తరుణంలో జగన్‌కు బెయిల్ లభించడం హర్షించదగ్గ విషయం.
- పి.విష్ణుకుమార్ రాజు, రాజకీయేతర జేఏసీ, విశాఖపట్నం
జగన్ నిర్దోషిగా కూడా నిగ్గుతేలతారు
తెలుగు ప్రజల 16 నెలల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో రాష్ట్రమంతటా సంతోషం వెల్లివిరుస్తోంది. కాంగ్రెస్, టీడీపీలు రాజకీయంగా ఎదుర్కోలేకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించాయి. ఆసలు క్విడ్‌ప్రోకోనే జరగలేదని సీబీఐ నిర్ధారించడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు బెయిల్ వచ్చింది. త్వరలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషిగా కూడా నిరూపితమవుతారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రాష్ట్రంలో రాజన్న సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ తీసుకువస్తారు.
- బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ విప్
చంద్రబాబు పన్నాగాలకు తెర
ఇటలీరాణి సోనియా, టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడి అప్రజాస్వామిక ప్రయత్నాలకు అడ్డుకట్టపడింది. ఢిల్లీలో గల్లీగల్లీ తిరిగి బెయిల్‌రాకుండా చంద్రబాబు పన్నిన పన్నాగాలకు తెరదించుతూ కోర్టు తీర్పు ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులో ఎనిమిది కంపెనీలకు సంబంధించి క్విడ్ ప్రోకోకు ఆధారాలు లభించలేదని సీబీఐ స్వయంగా మెమోలో తెలపడం జగన్‌మోహన్‌రెడ్డి నిజాయితీని తెలియజేస్తోంది. దీన్నిబట్టి ఉద్దేశపూర్వకంగానే జగన్‌మోహన్‌రెడ్డిని కాంగ్రెస్, టీడీపీ నాయకులు చేతులు కలిపి జైల్లో ఉంచే విధంగా చేశారన్నది అర్థమవుతోంది. జగ న్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తే తమ అడ్రస్సులు గల్లంతవుతాయని రెండు నాలుకల చంద్రబాబు ఆడిన హైడ్రామా ఇది. ఇప్పటికైనా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. ఆరోపణలు మినహా ఆధారాలు లేకపోవడంతో జగన్‌మోహన్‌రెడ్డి కోహినూరు వజ్రంలా మంగళవారం బయటకు రానున్నారు. వైఎస్సార్ కుటుంబానికి భగవంతుడితో పాటు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఫలించవని న్యాయవ్యవ స్థ రుజువు చేసింది.
- నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే
ప్రజల ప్రార్థనలు ఫలించే.. బెయిల్!
గత 16 నెలలుగా రాష్ట్ర ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ లభించిందని రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీస్ కూటమి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఐసీ అశోక్‌కుమార్ అన్నారు. జగన్ రాకతో పేదల జీవితాల్లో ఆశలు చిగురించాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.