
సాక్షి, ద్వారపూడి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని దుమ్మెత్తిపోశారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఏర్పాటు చేసిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....‘బ్యాంకులను దోచుకుని విదేశాలకు పారిపోయినవారిని కేంద్రం ఏం చేసింది. రాష్ట్రంలో అసలు బీజేపీకి బలముందా?. ఆ పార్టీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది. గవర్నర్ వ్యవస్థను వద్దని చెప్పాను. కేంద్రం రాష్ట్రాన్ని ఇబ్బందిపెడుతోంది. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు సాధించి కాబోయే ప్రధానమంత్రిని నిర్ణయిస్తాం. మన హామీలు సాధించుకోవడమే లక్ష్యం. అసలు నన్నేమి చేయాలనుకుంటున్నారు. ఏదైనా మీరంతా నాకు వలయంగా ఉండాలి. రాజకీయ పరిణామాలను గమనించాలి.’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment