
కాకినాడ: నవరత్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక 9వ డివిజన్ సత్యానగర్ నాయకులు పెంకే రవి ఆధ్వర్యంలో పలువురు శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికీ ద్వారంపూడి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, అన్నివర్గాల సంక్షేమాన్నీ కాంక్షించి పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి నవరత్న పథకాలను రూపొందించారన్నారు. ఈ పథకాలను అన్ని వర్గాల ప్రజలకూ తెలియజేయాలని, దీనిపై పార్టీలో కొత్తగా చేరిన వారందరూ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమిస్తూ ప్రజల పక్షాన పోరాడాలన్నారు. పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ త్వరలో కాకినాడలో జరగనున్న జననేత పాదయాత్రను విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుంచే కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో అనుసూరి నాగేశ్వరరావు, అనుసూరి సత్యనారాయణ, పితాని ముసలయ్య, పలివెల సూర్యనారాయణ, గీసాల రమణ, అనసూరి నూకరాజు, కె.ప్రకాష్, పెద్దింశెట్టి శివకుమార్, అనుసూరి సత్య తదితరులున్నారు.