'రాజీనామా చేశాకే వైఎస్ జగన్ పార్టీలో చేర్చుకున్నారు'
కాకినాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ఎప్పుడు ప్రోత్సహించలేదని వైఎస్ఆర్ సీపీ నేత ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఫార్టీ ఫిరాయింపుల అంశంపై మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులం అయినప్పటికీ ఎమ్మెల్యేలు తమ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీ అధినేత వైఎస్ జగన్ వారిని వైఎస్ఆర్ సీపీ లోకి ఆహ్వానించారని ఆయన వివరించారు. రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని, ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ సీపీ నేత ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.