
'బాబు ఆస్తి మాకిస్తే.. నాలుగురెట్లు ఆస్తి మేమిస్తాం'
కాకినాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆస్తిని తమకిస్తే..అంతకు నాలుగురెట్టు ఆయనకు ఇస్తామని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆస్తులు ప్రకటించడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. బాబు ఆస్తుల ప్రకటనపై మాట్లాడిని ద్వారంపూడి మండిపడ్డారు. బాబు ఆస్తులను తమకిస్తే అంతకుమించి ఆస్తులను బాబుకు ఇస్తామని ఆయన సవాల్ విసిరారు. కాగా, అమెరికాను అతాలకుతలం చేసిన తీవ్రవాది లాడెన్ తో బాబును పోల్చారు ద్వారంపూడి.
ప్రస్తుతం పదవీ వ్యామోహం కోసం చంద్రబాబు రాజకీయ ఉగ్రవాదిగా మారిపోయారని ఆయన విమర్శించారు. ట్విన్ టవర్ళ్ ను కూల్చి అమెరికాకు లాడెన్ నిద్రలేకుండా చేస్తే.. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని అతాలకుతలం చేశారని ద్వారంపూడి అన్నారు.