
'విభజనపై బాబు వెనక్కి వెళ్లరనే నమ్మకం ఉంది'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై సీమాంధ్ర ప్రాంత నేతల ఒత్తిడి తమకు భయం కలిగిస్తోందని ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రాష్ట్ర విభజనపై బాబు వెనక్కి వెళ్లరనే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమైక్యమంటూ సీమాంధ్ర టీడీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సరికాదని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.
కాగా తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు ఈరోజు ఉదయం ఎన్టీఆర్ భవన్లో సమావేశం అయ్యారు. 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉండాలని నేతలు పట్టుబడుతున్నారు. ఈ విషయమై రాష్ట్రపతిని కలిసేందుకు తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు అపాయింట్మెంట్ కోరగా.... రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు కుదరదని స్పష్టం చేశాయి. దాంతో నేతలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలనుకుంటున్నారు.