' పోరాట పటిమ ఉన్న ఏకైక నాయకుడు జగన్' | YS Jagan mohan reddy One and Only Leader: Dwarampudi Chandra Sekhar Reddy | Sakshi
Sakshi News home page

' పోరాట పటిమ ఉన్న ఏకైక నాయకుడు జగన్'

Published Wed, Oct 2 2013 12:20 PM | Last Updated on Sat, Sep 29 2018 6:14 PM

కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచేలా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాకినాడ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

కాకినాడ : కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచేలా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాకినాడ ఎమ్మెల్యే,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు బుధవారం నుంచి నిరాహారదీక్షలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో  ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మసీదు సెంటర్‌లో దీక్షకు దిగారు.

మహత్మగాంధీ, పొట్టి శ్రీరాములు, వైఎస్సార్‌ చిత్రపటాలకు ద్వారంపూడి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. దీక్షా ప్రాంగణానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో పోరాట పటిమ ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి అని ద్వారంపూడి అన్నారు. జగన్ నేతృత్వంలో తాము సమైక్యాంధ్ర సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement