
'సీఎంకు చిత్తశుద్ధి ఉంటే శంఖారావంకు అనుమతి ఇవ్వాలి'
కాకినాడ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్ సిపి తలపెట్టిన సమైక్య శాంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సీఎం పైకి సమైక్యవాదినంటూ చెప్పుకుంటూ, లోపల మరోల వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సభకు అనుమతిస్తే ప్రశాంతంగా నిర్వహించుకుంటామని చెప్పారు. సీమాంధ్ర ప్రజలు శాంతికాముకులన్నారు.
గొడవలు జరుగుతాయన్నది సాకుమాత్రమేన్నారు. తెలంగాణవాదులు ట్యాంక్బండ్పై విగ్రహాలను ధ్వంసం చేశారు. సీమాంధ్రులను వారితో పోల్చడం సరికాదన్నారు. విభజనవాదులకు జైకొడతారా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాపాడాలని కోరారు. సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని ద్వారంపుడి డిమాండ్ చేశారు.