సాక్షి, కాకినాడ: గత మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపాత్రాభినయం చేస్తున్నాడు అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. రాజకీయాలు దిగజారిపోయేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లేనిపోని కోపాన్ని ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల్ని రెచ్చగొట్టి టీడీపీ క్యాడర్‌ను కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ఈ మేరకు కన్నబాబు మాట్లాడుతూ.. 'చంద్రబాబు తన్నితే తన్నించుకోవడానికి వైఎస్సార్‌సీపీలో ఎవరూ సిద్దంగా లేరు. 14 ఏళ్ళు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడల్సిన భాషేనా ఇది అని ప్రశ్నించారు. ప్రధాని వచ్చి వెళ్లిన తర్వాత చంద్రబాబులో మార్పు వచ్చింది. తిట్లు తిడితే ఓట్లు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నాడేమో. మీ తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు భయపడే వారు లేరు. 2024 ఫలితాలు ప్రతిరోజూ చంద్రబాబుకు కలలోకి వస్తున్నట్లు ఉన్నాయి. అందుకే ఆ ఫ్రస్టేషన్. చంద్రబాబు మాట్లాడిన మాటలే.. రేపు వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడితే ఒప్పుకుంటారా?' అని ప్రశ్నించారు.
చదవండి: (వెంటిలేటర్లు తీస్తే అంతిమ యాత్రే: స్పీకర్ తమ్మినేని)
చంద్రబాబు మాటలు, చేష్టలు ఆయన్ని పాతాళానికి పడేశాయి. ఆయనకు వచ్చే ఎన్నికలే ఆఖరువి. తర్వాత టిడిపికి మనుగడ ఉండదు. అసెంబ్లీకి రాను అని మంగమ్మ శపధంలా.. చంద్రన్న శపధం చేశాడు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం.. అనంతరం సీఎం జగన్ సంక్షేమ పాలనతో చంద్రబాబుకు ఫ్రస్టేషన్ పట్టుకుంది. ఆయనకు ఎంత ఫ్రస్టేషన్ వచ్చినా మేము మూడు రాజధానులును ఏర్పాటు చేసి తీరతాం అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment